మీరు మార్పులను చర్య రద్దు లేదా మళ్లీ చేయడం, బుల్లెట్లతో కూడిన పాయింట్లను జోడించడం, మీ ఫాంట్‌ని మార్చడం, వచనాన్ని హైలైట్ చేయడం లేదా కొట్టివేయడం వంటి మరిన్నింటి కోసం ఫార్మాటింగ్ ఎంపికలను ఉపయోగించగలరు.
మీ ఇమెయిల్‌ను ఫార్మాట్ చేయండి
- మీ కంప్యూటర్‌లో, Gmailని తెరవండి.
- వ్రాయండి క్లిక్ చేయండి.
- సందేశానికి దిగువన, ఫార్మాటింగ్ ఎంపికలను
క్లిక్ చేయండి.
మీ ఆటోమేటిక్ సెట్టింగ్ టెక్స్ట్ స్టైల్‌ను మార్చండి
మీరు వ్రాసే అన్ని కొత్త ఇమెయిల్‌లకు వర్తించేలా మీరు ఒక టెక్స్ట్ స్టైల్‌ను రూపొందించవచ్చు.
- మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
- ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు
అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
- దిగువ ఉన్న "ఆటోమేటిక్ సెట్టింగ్ టెక్స్ట్ స్టైల్" విభాగానికి స్క్రోల్ చేయండి.
- మీ ఇమెయిల్‌లకు మీరు కావాలని కోరుకునే స్టైల్ కోసం బాక్స్‌లోని టెక్స్ట్‌ను మార్చండి.
- పేజీకి దిగువన, మార్పులని సేవ్ చేయిని క్లిక్ చేయండి.