ఇమెయిల్‌లను బ్లాక్ చేయడం లేదా వాటి నుండి సభ్యత్వాన్ని తీసివేయడం

మీరు మీ Gmail ఇన్‌బాక్స్‌లో కోరుకోని ఇమెయిల్‌లను పొందుతున్నట్లయితే, మీకు పంపిన వారిని బ్లాక్ చేయవచ్చు లేదా సభ్యత్వాన్ని తీసివేయవచ్చు లేదా సందేశాన్ని Gmailకి రిపోర్ట్ చేయవచ్చు.  

గమనిక: మిమ్మల్ని వేధించడానికి, భయపెట్టడానికి లేదా బెదిరించడానికి ఎవరైనా Gmailను ఉపయోగిస్తున్నట్లయితే, వారు Gmail ప్రోగ్రామ్ పాలసీలను ఉల్లంఘిస్తున్నారు. మీరు ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే, వెంటనే మీ స్థానిక అధికారులను సంప్రదించి, సైబర్ పీడింపు చట్టాలు ఏవైనా మీరు ఉన్న పరిస్థితికి వర్తిస్తాయోమో అడగండి.

ఈమెయిల్ అడ్రస్‌ను బ్లాక్ చేయండి

ఎవరైనా పంపేవారిని మీరు బ్లాక్ చేసినప్పుడు, వారు మీకు పంపే సందేశాలు మీ స్పామ్ ఫోల్డర్‌కి పంపబడతాయి.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్ ‌ను తెరవండి.
  2. సందేశాన్ని తెరవండి.
  3. సందేశానికి ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని నొక్కండి.
  4. [sender]ని బ్లాక్ చేయి ఎంపికను నొక్కండి

మీరు ఎవరినైనా పొరపాటున బ్లాక్ చేసినట్లయితే, అవే దశలను అనుసరించి మీరు వారిని అన్‌బ్లాక్ చేయవచ్చు.

భారీ సంఖ్యలో ఈమెయిళ్ల నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయండి

ప్రమోషన్‌లు లేదా న్యూస్ లెటర్‌ల వంటి భారీ సంఖ్యలో ఈమెయిళ్లను పంపే సైట్‌కు మీరు సైన్ అప్ చేసి ఉన్నట్లయితే, ఈమెయిళ్లను పొందడం ఆపివేసేందుకు మీరు సబ్‌స్క్రిప్షన్ తీసివేయండి లింక్‌ను ఉపయోగించవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసిన తర్వాత, మెయిలింగ్ లిస్ట్ మీకు మెసేజ్‌లను పంపడం ఆపివేయడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్ ‌ను తెరవండి.
  2. మీరు సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయాలనుకుంటున్న పంపే వ్యక్తి నుండి వచ్చిన ఈమెయిల్‌ను తెరవండి.
  3. పంపే వారి పేరు పక్కన, సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. పాప్-అప్‌లో, సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • కొంతమంది పంపే వారి ఈమెయిళ్ల నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయడానికి వెబ్‌సైట్‌కి వెళ్లండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఆప్షనల్: సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసిన తర్వాత, బ్యానర్‌లో, స్పామ్‌కు తరలించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసినప్పుడు, పంపేవారి పేరుకు బదులుగా, మీరు మెయిలింగ్ లిస్ట్ లేదా లిస్ట్ ID కోసం ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌ను చూడవచ్చు.

సిఫార్సుల నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయడాన్ని ఆపివేసేందుకు:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్ ‌ను తెరవండి.
  2. పైన ఎడమ వైపున, మెనూ మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. మీ ఈమెయిల్ అడ్రస్‌ను ఎంచుకోండి.
  4. "ఇన్‌బాక్స్ చిట్కాలు" కింద, ఇన్‌బాక్స్ చిట్కాల సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  5. "చిట్కాల నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయండి" ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్ ఎంపికను తీసివేయండి.

స్పామ్ లేదా అనుమానాస్పద మెసేజ్‌లను తీసివేయండి

నా ఇన్‌బాక్స్ నుండి స్పామ్‌ని తీసివేయి

Gmail మీ ఇన్‌బాక్స్ నుండి స్పామ్‌ని తీసివేసేందుకు ప్రయత్నిస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో సందేశాలు రావచ్చు. మీరు మీ ఇన్‌బాక్స్‌లో స్పామ్ సందేశాన్ని చూసినట్లయితే:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్ ‌ను తెరవండి.
  2. సందేశానికి ఎడమవైపున ఉన్న అక్షరం లేదా ఫోటోని నొక్కండి లేదా సందేశాన్ని తెరవండి.
  3. ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని నొక్కండి.
  4. స్పామ్‌ని నివేదించు నొక్కండి.
చిట్కా: మీరుస్పామ్‌ని రిపోర్ట్ చేయి నొక్కినప్పుడు లేదా ఇమెయిల్‌ని స్పామ్ ఫోల్డర్‌కి మాన్యువల్‌గా తరలించినప్పుడు, Google ఇమెయిల్‌కి సంబంధించిన కాపీని పొందుతుంది, అలాగే మా వినియోగదారులను స్పామ్ మరియు దుర్వినియోగం నుండి రక్షించడంలో సహకరించేందుకు దానిని విశ్లేషించవచ్చు.
వ్యక్తిగత సమాచారాన్ని కోరే ఒక అనుమానాస్పద ఇమెయిల్

వ్యక్తిగత సమాచారం కోరే ఒక అనుమానాస్పద ఇమెయిల్‌ని మీరు చూసినట్లయితే, మీరు సందేశాన్ని ఫిషింగ్‌గా రిపోర్ట్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
  2. మీరు సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయాలనుకుంటున్న పంపే వ్యక్తి నుండి వచ్చిన ఈమెయిల్‌ను తెరవండి.
  3. ఎగువ కుడివైపున, క్రిందికి బాణం గుర్తుని కిందికి బాణం క్లిక్ చేయండి.
  4. ఫిషింగ్‌ను రిపోర్ట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8306755281602957303
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false