అనధికారిక యాక్సెస్ నుంచి సున్నితమైన సమాచారాన్ని రక్షించడంలో సహాయానికి మీరు Gmail గోప్యత మోడ్‌తో సందేశాలను మరియు అటాచ్‌మెంట్‌లను పంపవచ్చు. మెసేజ్‌ల కోసం గడువు ముగింపు తేదీని సెట్ చేయడానికి లేదా ఎప్పుడైనా యాక్సెస్‌ను ఉపసంహరించుకోవడానికి మీరు కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. గోప్యమైన మెసేజ్‌ను స్వీకరించిన వారికి ఫార్వర్డ్ చేయడానికి, కాపీ చేయడానికి, ప్రింట్ చేయడానికి, డిజేబుల్ చేసిన వాటిని డౌన్‌లోడ్ చేయడానికి తగిన ఆప్షన్‌లు ఉంటాయి.
ముఖ్య గమనిక: స్వీకర్తలు మీ ఈమెయిల్‌ను పొరపాటున షేర్ చేయకుండా నిరోధించడంలో కాన్ఫిడెన్షియల్ మోడ్ సహకరించినప్పటికీ, అది మీ మెసేజ్‌లు లేదా అటాచ్‌మెంట్‌ల స్క్రీన్‌షాట్‌లను లేదా ఫోటోలను తీయకుండా స్వీకర్తలను నిరోధించదు. తమ కంప్యూటర్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు ఉన్న స్వీకర్తలు ఇప్పటికీ మీ మెసేజ్‌లను లేదా అటాచ్‌మెంట్‌లను కాపీ చేయగలరు లేదా డౌన్‌లోడ్ చేయగలరు.
గోప్యమైన ఈమెయిల్స్ ఎలా పని చేస్తాయో తెలుసుకోండిమెసేజ్లను, అటాచ్‌మెంట్‌లను గోప్యంగా పంపండి
- మీ కంప్యూటర్‌లో, Gmailకి వెళ్లండి.
- కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
- విండోకు దిగువ కుడి వైపున, 'కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను టోగుల్ చేయండి
'ని క్లిక్ చేయండి.
- మీరు ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఆన్ చేసి ఉంటే, ఈమెయిల్ దిగువునకు వెళ్లి, ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- గడువు ముగింపు తేదీని, పాస్‌కోడ్‌ను సెట్ చేయండి. ఈ సెట్టింగ్‌లు, మెసేజ్ టెక్స్ట్ ఇంకా ఏవైనా అటాచ్‌మెంట్‌లు ఉంటే రెండింటిపై ప్రభావం చూపుతాయి.
- మీరు "SMS పాస్‌కోడ్ వద్దు"ను ఎంచుకుంటే, Gmail యాప్‌ను ఉపయోగించే స్వీకర్తలు దాన్ని నేరుగా తెరవగలరు. Gmailను ఉపయోగించని స్వీకర్తలు ఈమెయిల్ ద్వారా పాస్‌కోడ్‌ను పొందుతారు.
- మీరు "SMS పాస్‌కోడ్" ఎంచుకుంటే, స్వీకర్తలు టెక్ట్స్ మెసేజ్ ద్వారా పాస్‌కోడ్ పొందుతారు. మీరు మీ స్వంత ఫోన్ నంబర్ కాకుండా, గ్రహీత ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసినట్లు నిర్ధారించుకోండి.
- సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
యాక్సెస్‌ను త్వరగా తీసివేయండి
ఈమెయిల్ గడువు ముగింపు తేదీకి ముందే, స్వీకర్త దాన్ని తెరవకుండా మీరు ఆపి వేయవచ్చు.
- మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
- ఎడమవైపున, పంపినవి క్లిక్ చేయండి.
- గోప్యత ఇమెయిల్‌ను తెరవండి.
- యాక్సెస్‌ను తీసివేయి క్లిక్ చేయండి.
కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో పంపిన ఈమెయిల్‌ను తెరవండి
ఈమెయిల్‌ను పంపడానికి, పంపే వారు కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఉపయోగించి ఉంటే:
- మీరు, గడువు ముగింపు తేదీ వరకు లేదా పంపిన వారు యాక్సెస్‌ను తీసివేసే వరకు మెసేజ్‌ను, అటాచ్‌మెంట్‌లను చూడవచ్చు.
- మెసేజ్ టెక్స్ట్‌ను ఇంకా అటాచ్‌మెంట్‌లను కాపీ చేయడం, అతికించడం, డౌన్‌లోడ్ చేయడం, ప్రింట్ చేయడం అలాగే ఫార్వర్డ్ చేయడానికి గల ఆప్షన్‌లు డిజేబుల్ చేయబడతాయి.
- మీరు ఈమెయిల్‌ను తెరవడానికి పాస్‌కోడ్‌ను ఎంటర్ చేయవలసి ఉండవచ్చు.
- ఈమెయిల్‌ను తెరవండి.
- పంపిన వారికి SMS పాస్‌కోడ్ అవసరం లేకపోతే:
- మీరు సరికొత్త Gmail యాప్‌లను (వెబ్ లేదా మొబైల్) ఉపయోగిస్తే, మీరు దాన్ని తెరిచినప్పుడు మీకు నేరుగా ఈమెయిల్ కనిపిస్తుంది.
- మీరు మరొక ఈమెయిల్ క్లయింట్‌ను ఉపయోగిస్తే, ఈమెయిల్‌ను తెరిచి ఈమెయిల్‌ను చూడండి అనే లింక్‌పై క్లిక్ చేయండి, ఆపై మెసేజ్‌ను చూడటానికి మీ Google ఆధారాలతో సైన్ ఇన్ చేయండి.
- పంపిన వారికి SMS పాస్‌కోడ్ అవసరం అయితే:
- పాస్‌కోడ్ పంపండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- పాస్‌కోడ్ కోసం మీ టెక్ట్స్ మెసేజ్‌ను చెక్ చేయండి.
- పాస్‌కోడ్‌ను ఎంటర్ చేసి, ఆపై సమర్పించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఈమెయిల్‌ను తెరవండి.
- ఈమెయిల్‌ను చూడండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- కొత్త పేజీ తెరవబడుతుంది.
- పాస్‌కోడ్ పంపండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- పాస్‌కోడ్ కోసం మీ టెక్ట్స్ మెసేజ్‌లను లేదా ఈమెయిల్‌ను చెక్ చేయండి.
- పాస్‌కోడ్‌ను ఎంటర్ చేసి, ఆపై సమర్పించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
నాకు ఎర్రర్ వస్తోంది
ఈమెయిల్ గడువు ముగిసిందిపంపే వారు గడువు తేదీకి ముందే ఈమెయిల్‌ను తొలగించి ఉండవచ్చు లేదా మీ యాక్సెస్‌ను తీసివేసి ఉండవచ్చు. మీకు మరింత సమయం ఇవ్వడానికి, లేదా ఈమెయిల్‌ను మళ్లీ పంపడానికి పంపే వారిని సంప్రదించండి.
మీరు ఈ ప్రాంతాల్లోని ఫోన్ నంబర్‌లకు మాత్రమే SMS పాస్‌కోడ్‌లను జోడించగలరు:
- ఉత్తర అమెరికా
- దక్షిణ అమెరికా
- యూరప్
- ఆస్ట్రేలియా
- ఆసియా: భారతదేశం, కొరియా ఇంకా జపాన్