గోప్యమైన ఇమెయిల్‌లను పంపండి & తెరవండి

అనధికారిక యాక్సెస్ నుంచి సున్నితమైన సమాచారాన్ని రక్షించడంలో సహాయానికి మీరు Gmail గోప్యత మోడ్‌తో సందేశాలను మరియు అటాచ్‌మెంట్‌లను పంపవచ్చు. సందేశాల కోసం గడువు ముగింపు తేదీని సెట్ చేయడానికి లేదా ఎప్పుడైనా యాక్సెస్‌ను ఉపసంహరించుకోవడానికి మీరు గోప్యత మోడ్‌ను ఉపయోగించవచ్చు. గోప్యమైన సందేశాన్ని స్వీకరించిన వారికి ఫార్వర్డ్ చేయడానికి, కాపీ చేయడానికి, ముద్రించడానికి మరియు డిజేబుల్ చేసిన వాటిని డౌన్‌లోడ్ చేయడానికి ఎంపికలు ఉంటాయి. 

గమనిక: స్వీకర్తలు మీ ఇమెయిల్‌ను పొరపాటున షేర్ చేయకుండా నిరోధించడంలో గోప్యత మోడ్ సహకరించినప్పటికీ, అది మీ సందేశాలు లేదా అటాచ్‌మెంట్‌ల స్క్రీన్‌షాట్‌లు లేదా ఫోటోలు తీయకుండా స్వీకర్తలను నిరోధించదు. తమ కంప్యూటర్‌లో హానికరమైన ప్రోగ్రామ్‌లు ఉన్న స్వీకర్తలు ఇప్పటికీ మీ సందేశాలు లేదా అటాచ్‌మెంట్‌లను కాపీ చేయగలరు లేదా డౌన్‌లోడ్ చేయగలరు.

గోప్యమైన ఇమెయిల్‌లు ఎలా పని చేస్తాయో చూడండి 

In this animation for confidential mode in Gmail, Lisa clicks the confidential mode icon at the bottom of the message, then sends a confidential message to Sam
గమనిక: ఈ యానిమేషన్‌లోని కంటెంట్ ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

సందేశాలు & అటాచ్‌మెంట్‌లను గోప్యంగా పంపండి

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ను తెరవండి.
  2.   కొత్త ఈమెయిల్ రాయండి ని ట్యాప్ చేయండి.
  3. ఎగువున కుడి వైపున, మరిన్ని 더보기 ఆ తర్వాత గోప్యత మోడ్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    గమనిక: మీరు ఈమెయిల్ కోసం ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఆన్ చేసి ఉంటే, ఈమెయిల్ దిగువకు వెళ్లి, ఆపై ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కాన్ఫిడెన్షియల్ మోడ్ అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి. 
  5. గడువు ముగింపు తేదీ, పాస్‌కోడ్ మరియు ఇతర నియంత్రణలను సెట్ చేయండి. మెసేజ్ టెక్స్ట్, అలాగే ఏవైనా అటాచ్‌మెంట్‌లపై ఈ సెట్టింగ్‌లు ప్రభావం చూపుతాయి. 
    • మీరు "SMS పాస్‌కోడ్ వద్దు"ను ఎంచుకుంటే, Gmail యాప్‌ను ఉపయోగించే స్వీకర్తలు దాన్ని నేరుగా తెరవగలరు. Gmail వినియోగించని స్వీకర్తలు ఇమెయిల్ ద్వారా పాస్‌కోడ్ పొందుతారు.
    • మీరు "SMS పాస్‌కోడ్" ఎంచుకుంటే, స్వీకర్తలు టెక్ట్స్ మెసేజ్‌ ద్వారా పాస్‌కోడ్ పొందుతారు. మీరు మీ స్వంత ఫోన్ నంబర్ కాకుండా, గ్రహీత ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  6. పూర్తయింది పూర్తయిందిని ట్యాప్ చేయండి.

యాక్సెస్‌ను త్వరగా తీసివేయండి

మీరు ఇమెయిల్ గడువు తేదీకి ముందే స్వీకర్త దాన్ని తెరవకుండా మీరు అపివేయవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ను తెరవండి.
  2. మెను మెనూ ఆ తర్వాత పంపబడినవి నొక్కండి.
  3. గోప్యత ఇమెయిల్‌ను తెరవండి.
  4. స్క్రీన్ దిగువున, యాక్సెస్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 

గోప్యత మోడ్‌తో పంపిన ఇమెయిల్‌ను తెరవండి

ఇమెయిల్ పంపడానికి పంపే వారు గోప్యత మోడ్‌ను ఉపయోగించి ఉంటే:

  • మీరు గడువు ముగింపు తేదీ వరకు లేదా పంపే వారు యాక్సెస్‌ను తీసివేసే వరకు సందేశం మరియు అటాచ్‌మెంట్‌లను వీక్షించవచ్చు.
  • సందేశ వచనం మరియు అటాచ్‌మెంట్‌లను కాపీ చేయడం, అతికించడం, డౌన్‌లోడ్ చేయడం, ముద్రించడం మరియు ఫార్వర్డ్ చేయడానికి ఎంపికలు డిజేబుల్ చేయబడతాయి.
  • మీరు ఇమెయిల్‌ను తెరవడానికి పాస్‌కోడ్‌ను నమోదు చేయవలసి ఉండవచ్చు.

నేను Gmail ఖాతాను ఉపయోగిస్తున్నాను

  1. ఇమెయిల్ తెరవండి.
  2. పంపే వారికి SMS పాస్‌కోడ్ అవసరం లేకుంటే:
    • మీరు సరికొత్త Gmail యాప్‌లను (వెబ్ లేదా మొబైల్) ఉపయోగిస్తే, మీరు దాన్ని తెరిచినప్పుడు మీకు నేరుగా ఇమెయిల్ కనిపిస్తుంది.
    • మీరు మరొక ఇమెయిల్ క్లయింట్‌ను ఉపయోగిస్తే, ఇమెయిల్ తెరిచి ఇమెయిల్‌ను చూడండి లింక్‌పై క్లిక్ చేయండి, ఆపై సందేశాన్ని చూడటానికి మీ Google ఆధారాలతో సైన్ ఇన్ చేయండి.
  3. పంపే వారికి SMS పాస్‌కోడ్ అవసరమైతే:
    • పాస్‌కోడ్ పంపు ఎంచుకోండి.
    • పాస్‌కోడ్ కోసం టెక్ట్స్ మెసేజ్‌‌ను తనిఖీ చేయండి.
    • పాస్‌కోడ్‌ను నమోదు చేసి, ఆపై సమర్పించు ఎంచుకోండి.

నేను మరొక ఇమెయిల్ ఖాతాను ఉపయోగిస్తున్నాను

  1. ఇమెయిల్ తెరవండి. ఇమెయిల్‌ను వీక్షించండి లింక్‌ను ఎంచుకోండి
  2. కొత్త పేజీ తెరవబడుతుంది. పాస్‌కోడ్ పంపు ఎంచుకోండి.
    • పాస్‌కోడ్ కోసం మీ టెక్ట్స్ మెసేజ్‌‌లు లేదా ఇమెయిల్ తనిఖీ చేయండి.
    • పాస్‌కోడ్‌ను నమోదు చేసి, ఆపై సమర్పించు ఎంచుకోండి.

నాకు ఎర్రర్ కనిపిస్తోంది

ఇమెయిల్ గడువు ముగిసింది

పంపే వారు గడువు తేదీకి ముందే ఇమెయిల్‌ను తొలగించి ఉండవచ్చు లేదా మీ యాక్సెస్‌ను తీసివేసి ఉండవచ్చు. మీకు మరింత సమయం ఇవ్వడానికి లేదా ఇమెయిల్‌ను మళ్లీ పంపడానికి పంపే వారిని సంప్రదించండి.

అందించిన నంబర్ ఒక మద్దతు లేని దేశానికి చెందినది

మీరు ఈ ప్రాంతాల్లోని ఫోన్ నంబర్‌లకు మాత్రమే SMS పాస్‌కోడ్‌లను జోడించగలరు: 

  • ఉత్తర అమెరికా
  • దక్షిణ అమెరికా
  • యూరప్
  • ఆస్ట్రేలియా
  • ఆసియా: భారతదేశం, కొరియా, జపాన్
ఖాతాలను మార్చు
అందుకునే వారి ఇమెయిల్‌తో అనుబంధించబడిన సరైన Google ఖాతాకు మీరు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి. ఆపై, ఇమెయిల్‌ను మళ్లీ తెరవడానికి ప్రయత్నించండి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12466861766947235992
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false