Gmail మెసేజ్‌లను తొలగించడం లేదా రికవర్ చేయడం

మీరు ఒక మెసేజ్‌ను తొలగించినప్పుడు, అది 30 రోజుల వరకు మీ ట్రాష్‌లో ఉంటుంది. 30 రోజుల తర్వాత, మీ ఖాతా నుండి మెసేజ్ శాశ్వతంగా తొలగించబడుతుంది, రికవర్ చేయలేరు.

ఒకటి లేదా మరిన్ని మెసేజ్‌లను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న ప్రతి సందేశం ఎడమవైపు, బాక్స్‌ను ఎంచుకోండి.
  3. ఎగువన, తొలగించు క్లిక్ చేయండి.

చిట్కా: థ్రెడ్‌లో మెసేజ్‌ను తొలగించడానికి:

  1. మెసేజ్‌ను తెరవండి.
  2. 'రిప్లయి ఇవ్వండి' ఆప్షన్‌కి పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఈ మెసేజ్‌ను తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

వర్గంలోని అన్ని సందేశాలను తొలగించండి

మీ Gmail ఇన్‌బాక్స్ లేదా మీ కంప్యూటర్‌లోని మరొక కేటగిరీలో అన్ని మెసేజ్‌లను ఎలా తొలగించాలనేది చూపించే యానిమేషన్

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎడమ వైపు, మీ ఇన్‌బాక్స్, లేబుల్ లేదా మరొక కేటగిరీని ఎంచుకోండి.
  3. ఎగువ ఎడమ వైపు, మీ మెసేజ్‌ల ఎగువ, ఎంపిక బాక్స్‌ను ఎంచుకోండి. 
    • ఎంపిక చేసిన సంభాషణల సంఖ్యను చూపించే నోటిఫికేషన్ చూపబడుతుంది. అన్ని మెసేజ్‌లను ఎంచుకోవడానికి, నోటిఫికేషన్‌లోని లింక్‌ను క్లిక్ చేయండి.
  4. ఎగువన, తొలగించు క్లిక్ చేయండి.

మీ ట్రాష్‌ను ఖాళీ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎడమవైైపు, మరిన్ని ఆ తర్వాత ట్రాష్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న ప్రతి మెసేజ్ ఎడమవైపు, బాక్స్‌ను ఎంచుకోండి.
  4. ఎగువన, శాశ్వతంగా తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీ ట్రాష్‌లోని అన్ని మెసేజ్‌లను తొలగించడానికి, నోటిఫికేషన్‌లో, ఇప్పుడే ట్రాష్‌ను ఖాళీ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ట్రాష్ నుండి మెసేజ్‌లను రికవర్ చేయండి

ముఖ్య విషయం: శాశ్వతంగా తొలగించిన మెసేజ్‌లను లేదా 30 రోజుల కంటే ఎక్కువ కాలం ట్రాష్‌లో ఉంచిన మెసేజ్‌లను మీరు రికవర్ చేయలేరు.

మీ మెసేజ్‌లను గత 30 రోజులలో తొలగించి ఉంటే, వాటిని మీ ట్రాష్ నుండి బయటికి మూవ్ చేయవచ్చు.

మీ Gmail ట్రాష్ నుండి మీ కంప్యూటర్‌లోని మరొక లొకేషన్‌కి మెసేజ్‌లను ఎలా మూవ్ చేయాలన్నది చూపించే యానిమేషన్

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎడమవైపు, ఈ మరిన్ని ఆ తర్వాత ట్రాష్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు రికవర్ చేయాలనుకుంటున్న ప్రతి మెసేజ్ ఎడమవైపు, బాక్స్‌ను ఎంచుకోండి.
  4. ఎగువున ఉన్న, ఇక్కడికి మూవ్ చేయి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. “ఇక్కడికి మూవ్ చేయి” మెనూలో, మీరు మెసేజ్‌లను మూవ్ చేయాలనుకుంటున్న చోటును ఎంచుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4164315501507114337
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false