Gmail మెసేజ్‌లను తొలగించడం లేదా రికవర్ చేయడం

మీరు ఒక మెసేజ్‌ను తొలగించినప్పుడు, అది 30 రోజుల వరకు మీ ట్రాష్‌లో ఉంటుంది. 30 రోజుల తర్వాత, మీ ఖాతా నుండి మెసేజ్ శాశ్వతంగా తొలగించబడుతుంది, రికవర్ చేయలేరు.

ఒకటి లేదా మరిన్ని మెసేజ్‌లను తొలగించండి

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న ప్రతి మెసేజ్ ఎడమ వైపు, సెండర్ ప్రొఫైల్ ఇమేజ్‌పై ట్యాప్ చేయండి.
  3. ఎగువున, తొలగించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

అనేక మెసేజ్‌లను త్వరగా తొలగించండి

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
  2. మెసేజ్‌లో ఎడమ వైపున ఉండే, సెండర్ ప్రొఫైల్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువ ఎడమ వైపున ఉన్న, "అన్నీ ఎంచుకోండి" పక్కన ఉన్న బాక్స్‌ను ట్యాప్ చేయండి.
    • మరిన్ని మెసేజ్‌లను ఎంచుకోవడానికి, కిందికి స్క్రోల్ చేసి, ఆ తర్వాత 'అన్నీ ఎంచుకోండి' అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్‌ను మళ్లీ ట్యాప్ చేయండి.
  4. ఎగువున, తొలగించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

స్వైప్ చర్యగా "ట్రాష్" ఆప్షన్‌ను జోడించండి

ఎడమ లేదా కుడి వైపునకు స్వైప్ చేయడం ద్వారా మీ ఇన్‌బాక్స్‌లో మెసేజ్‌లను త్వరగా ఆర్కైవ్ చేయడానికి, స్వైప్ చర్యగా "ట్రాష్" ఆప్షన్‌ను జోడించండి.

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున, మెనూ మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "ఇన్‌బాక్స్" దిగువ, ఇన్‌బాక్స్ అనుకూల మార్పులు ఆ తర్వాత మెయిల్ స్వైప్ చర్యలు ఆ తర్వాత కుడి స్వైప్ లేదా ఎడమ స్వైప్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  4. ట్రాష్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఎగువ కుడి వైపున, పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ ట్రాష్‌ను ఖాళీ చేయండి

ఏదైనా మెసేజ్ మీ ట్రాష్‌లో 30 రోజుల పాటు ఉండకూడదని భావిస్తున్నట్లయితే, మీరు దానిని శాశ్వతంగా తొలగించవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
  2. ఎగువ ఎడమ వైపు, మెనూ మెనూ ఆ తర్వాత ట్రాష్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువన, ట్రాష్‌ని ఇప్పుడే ఖాళీ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ ట్రాష్ నుండి మెసేజ్‌లను రికవర్ చేయండి

ముఖ్య విషయం:

  • మీరు గత 30 రోజులలో మీ ట్రాష్ నుండి తొలగించిన మెసేజ్‌లను మాత్రమే రికవర్ చేయవచ్చు. 
  • శాశ్వతంగా తొలగించిన మెసేజ్‌లను లేదా 30 రోజుల కంటే ఎక్కువ కాలం ట్రాష్‌లో ఉంచిన మెసేజ్‌లను మీరు రికవర్ చేయలేరు.
  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
  2. ఎగువ ఎడమ వైపు, మెనూ మెనూ ఆ తర్వాత ట్రాష్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు రికవర్ చేయాలనుకుంటున్న మెసేజ్ ఎడమ వైపు, సెండర్ ప్రొఫైల్ ఇమేజ్‌పై ట్యాప్ చేయండి.
  4. ఎగువన కుడి వైపు ఉన్న, మరిన్ని 더보기 ఆ తర్వాత మూవ్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  5. "మూవ్" మెనూలో, మీరు మెసేజ్‌లను ఎక్కడికి మూవ్ చేయాలనుకునేది ఎంచుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14293641518184177771
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false