Gmail లోడ్ కావడం లేదు

Gmail నెమ్మదిగా ఉంటే లేదా మీ బ్రౌజర్‌లో సరిగ్గా లోడ్ కాకపోతే, మీరు సమస్యలు ఏమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం మీ బ్రౌజర్, ఇంటర్నెట్ కనెక్షన్ లేదా పరికరాన్ని చెక్ చేయాల్సి రావచ్చు.

మీరు ప్రారంభించడానికి ముందు

Gmail లోడ్ అవ్వకపోవడంలోని సమస్యలను పరిష్కరించండి

మీ బ్రౌజర్‌ను చెక్ చేయండి
  1. సపోర్ట్ చేసే బ్రౌజర్‌ను ఉపయోగించండి.
    • చాలా బ్రౌజర్‌లు Gmailకు సపోర్ట్ చేస్తున్నాయి. మీ బ్రౌజర్‌లో Gmailను ఉపయోగించడం మీకు సమస్యగా ఉంటే ఈ విధంగా చేయండి:
      • మీ బ్రౌజర్ వెర్షన్‌ను ఇటీవలి వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
      • మరొక బ్రౌజర్‌ను ట్రై చేయండి.
  2. మీ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లను లేదా అప్లికేషన్‌లను చెక్ చేయండి.
    • మీ బ్రౌజర్‌లోని కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు లేదా యాడ్-ఆన్‌లు, లేదా మీ కంప్యూటర్‌లో అప్లికేషన్‌లు, Gmail పని చేయకపోవడానికి కారణం కావచ్చు.
    • ఎక్స్‌టెన్షన్‌లను ఆఫ్ చేయండి, అప్లికేషన్‌లను ఒక్కొక్కటిగా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆపై, అది సమస్యను పరిష్కరించిందో లేదో చెక్ చేయడానికి Gmailను మళ్లీ తెరవండి.
    • అది అందుబాటులో ఉంటే, మీ బ్రౌజర్ అజ్ఞాత మోడ్ లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించి ట్రై చేయండి.
  3. మీ బ్రౌజర్ కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేసి, ఆపై Gmailను మళ్లీ తెరవండి.
మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయండి
  1. మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి.
  2. మీ Wi-Fi లేదా మొబైల్ డేటా కనెక్షన్‌ను ఆఫ్ చేసి, ఆపై దాన్ని మళ్లీ ఆన్ చేయండి.
    • చిట్కా: Wi-Fi కోసం, Gmail ఇప్పటికీ లోడ్ కాకపోతే, మీ రూటర్‌ను రీస్టార్ట్ చేయండి. దీన్ని ఎలా రీస్టార్ట్ చేయాలి అనే సూచనల కోసం మీ రూటర్ మాన్యువల్‌ను చెక్ చేయండి.
  3. మరొక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి.
మీరు ఈ దశలను పూర్తి చేసిన తర్వాత కూడా మీకు కనెక్టివిటీ సమస్యలు ఉంటే, మీ సర్వీస్ ప్రొవైడర్ లేదా మీ Wi-FI నెట్‌వర్క్ హోస్ట్‌ను కాంటాక్ట్ చేయండి.
మరొక పరికరంలో ట్రై చేయండి
పాత పరికరాల్లోని బ్రౌజర్‌లలో Gmail లోడ్ కాకపోవచ్చు. Gmail సరిగ్గా లోడ్ అవుతుందో లేదో చెక్ చేయడానికి మరొక పరికరాన్ని ఉపయోగించి ట్రై చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10096772937064514498
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false