నాకు Gmailలో ఎర్రర్ వచ్చింది

మీరు Gmailను ఉపయోగిస్తున్నప్పుడు, మీకు "తాత్కాలిక ఎర్రర్" లేదా "అయ్యో" వంటి ఎర్రర్ కనిపిస్తే, సమస్యను పరిష్కరించడంలో సహాయానికి ఈ పేజీని ఉపయోగించండి.

"కనెక్షన్ లేదు"

మీకు మీ iPhone లేదా iPadలో ఈ ఎర్రర్ కనిపిస్తే, క్రింది దశలను అనుసరించండి:

"తాత్కాలిక ఎర్రర్"

మీరు Gmailకు సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు "తాత్కాలిక ఎర్రర్ (502)" సందేశం కనిపిస్తే, మీ మెయిల్ తాత్కాలికంగా అందుబాటులో లేదు. సాధారణంగా ఈ ఎర్రర్ త్వరగానే పోతుంది, కాబట్టి కొన్ని నిమిషాల్లో మళ్లీ సైన్ ఇన్ చేసి ప్రయత్నించండి. ఆ సమయంలో మీరు సైన్ ఇన్ చేయలేకపోయినప్పటికీ, మీ సందేశాలు మరియు వ్యక్తిగత సమాచారం అప్పటికీ సురక్షితంగానే ఉంటాయి.

"అయ్యో" లేదా ఇతర ఎర్రర్

ఈ ఎర్రర్‌లలో మీకు ఏదైనా కనిపిస్తే లేదా ఇక్కడ జాబితా చేయబడని మరొకటి కనిపిస్తే, సమస్యను పరిష్కరించేందుకు దిగువ దశలను ప్రయత్నించండి:

  • "చెడ్డ అభ్యర్థన: మీ క్లయింట్ తప్పుగా ఆకృతీకరించిన లేదా న్యాయవిరుద్ధ అభ్యర్థనను జారీ చేసారు"
  • "అయ్యో" (602, 500, 102, 009, 103)

దశ 1: మీరు Gmailతో పనిచేసే బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారని సరిచూసుకోండి

Gmail మద్దతు కలిగిన బ్రౌజర్‌లు గురించి మరింత తెలుసుకోండి.

దశ 2: మీ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు లేదా యాప్‌లను తనిఖీ చేయండి

కొన్నిసార్లు మీరు మీ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఎక్స్‌టెన్షన్‌లు లేదా యాడ్-ఆన్‌లు లేదా మీరు మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు Gmailను పని చేయనీకుండా నిరోధించవచ్చు.

ఈ ఎక్స్‌టెన్షన్‌లు మరియు యాప్‌లను ఒక్కొక్కటిగా తాత్కాలికంగా ఆఫ్ చేయండి, ఆ తర్వాత అలా చేయడం వల్ల సమస్య పరిష్కరించబడిందేమో చూసేందుకు మళ్లీ Gmailను ఉపయోగించి ప్రయత్నించండి.

ఎటువంటి ఎక్స్‌టెన్షన్‌లు లేకుండా Gmailను ఉపయోగించడం ప్రయత్నించడానికి, మీ బ్రౌజర్ యొక్క అజ్ఞాతం లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఉపయోగించి Gmailను తెరవండి.

3వ దశ: మీ బ్రౌజర్ కాష్ & కుక్కీలను తీసివేయండి

మీ బ్రౌజర్ కాష్ మరియు కుక్కీలను తీసివేయండి ఆపై సమస్య పరిష్కరించబడిందేమో చూసేందుకు మళ్లీ Gmailను ఉపయోగించి ప్రయత్నించండి.

దశ 4: మీ Gmail అధునాతన సెట్టింగ్‌లు తనిఖీ చేయండి

మీరు ఏవైనా ఫీచర్‌లను ఆన్ చేస్తే, మీ అధునాతన సెట్టింగ్‌లను పరిశీలించండి.

  1. Gmailను తెరవండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు  ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. అధునాతనం ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ప్రారంభించిన ఏవైనా ఫీచర్‌ల పక్కనే, నిలిపివేయి ఎంచుకోండి.
  5. పేజీ దిగువన, 'మార్పులను సేవ్ చేయి'ని క్లిక్ చేయండి.

ఎగువ పేర్కొన్న దశలు సహాయకరంగా లేవు

సమస్య ఇప్పటికీ పరిష్కారించబడకుంటే, Gmailలో తెలిసిన సమస్య ఏదైనా ఉందేమో చూసేందుకు Google Workspace స్టేటస్ డ్యాష్‌బోర్డ్‌ను చెక్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6242535037408448395
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false