Gmailలో బ్లాక్ చేయబడిన ఫైల్ రకాలు

మీరు Gmailలో, "ఈ మెసేజ్‌లోని కంటెంట్, సెక్యూరిటీ సమస్యను కలగజేసే అవకాశం ఉన్నందున ఇది బ్లాక్ చేయబడింది" అనే ఎర్రర్‌ను మీరు చూస్తున్నారంటే, దానికి పలు రకాల కారణాలు ఉండవచ్చు. ఎగ్జిక్యూట్ అయ్యే ఫైళ్లు లేదా నిర్దిష్ట లింక్‌లతో కూడి వైరస్‌ను వ్యాప్తి చేసే మెసేజ్‌లను Gmail బ్లాక్ చేస్తుంది.

అటాచ్‌మెంట్‌లతో కూడిన మెసేజ్‌లు

హాని కలిగించే వైరస్‌లు, హానికారక సాఫ్ట్‌వేర్ నుండి మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, కింద పేర్కొన్న వాటిని జోడించడానికి Gmail అనుమతించదు:

  • వాటి కుదించబడిన ఆకృతి (.gz లేదా .bz2 ఫైల్‌లు వంటి)తో కూడిన లేదా (.zip లేదా .tgz ఫైళ్ల వంటి) ఆర్కైవ్‌లలో కనుగొనబడే నిర్దిష్ట ఫైళ్ల రకాలు
  • హానికరమైన సాఫ్ట్‌వేర్ మ్యాక్రోలతో కూడిన డాక్యుమెంట్‌లు
  • ఆర్కైవ్ చేయబడిన కంటెంట్‌ను కలిగి ఉండే పాస్‌వర్డ్‌లతో రక్షింపబడిన ఆర్కైవ్‌లు

చిట్కా: మీరు చాలా పెద్దదిగా ఉన్న డాక్యుమెంట్‌ను జోడించేందుకు ట్రై చేస్తే, మీ మెసేజ్ పంపబడదు. అటాచ్‌మెంట్‌లు, ఫైల్ సైజ్, పరిమితులు గురించి మరింత తెలుసుకోండి.

మీరు అటాచ్‌మెంట్‌లుగా జోడించలేని ఫైల్ రకాలు

మీ ఖాతాను రక్షించేందుకు, Gmail నిర్దిష్ట రకాల ఫైళ్లను జోడించేందుకు అనుమతించదు. Gmail నిరంతరంగా మారుతూ ఉండేటటువంటి హానికారక సాఫ్ట్‌వేర్‌లతో తరచుగా అప్‌డేట్ చేయబడే రకాల ఫైళ్లను అనుమతించదు.

Gmail బ్లాక్ చేసిన ఫైల్ రకాలు:

.ade, .adp, .apk, .appx, .appxbundle, .bat, .cab, .chm, .cmd, .com, .cpl, .diagcab, .diagcfg, .diagpkg, .dll, .dmg, .ex, .ex_, .exe, .hta, .img, .ins, .iso, .isp, .jar, .jnlp, .js, .jse, .lib, .lnk, .mde, .mjs, .msc, .msi, .msix, .msixbundle, .msp, .mst, .nsh, .pif, .ps1, .scr, .sct, .shb, .sys, .vb, .vbe, .vbs, .vhd, .vxd, .wsc, .wsf, .wsh, .xll,

చిట్కా: ఫైల్ సురక్షితమైనదేనని మీరు భావించినట్లయితే, ఫైల్‌ను Google Driveకు అప్‌లోడ్ చేయమని మీరు పంపేవారిని కోరవచ్చు. తర్వాత దానిని డ్రైవ్ అటాచ్‌మెంట్‌గా పంపండి.

అటాచ్‌మెంట్‌లను కలిగి ఉండని మెసేజ్‌లు

కొన్ని సార్లు మీరు ఎటువంటి అటాచ్‌మెంట్‌లను చేర్చనప్పుడు, మెసేజ్‌లు బ్లాక్ చేయబడతాయి.

మీరు వైరస్‌లను షేర్ చేసే అవకాశం ఉన్న కంటెంట్, ఇమేజ్‌లు లేదా లింక్‌లను చేర్చడం వలన ఇలా జరగవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16711072544490965280
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false