మద్దతు ఉన్న బ్రౌజర్‌లు

మీరు Gmailను Chrome, Firefox, ఇంకా Safari లాంటి ప్రముఖ బ్రౌజర్‌లలో ఉపయోగించవచ్చు.

Gmailకు సపోర్ట్ అందించే బ్రౌజర్‌లు

గమనిక: మీరు ఉపయోగించే బ్రౌజర్ ఏదైనప్పటికీ, దాని కుక్కీలను, JavaScriptను ఆన్ చేయాల్సి ఉంటుంది.

Gmail ఈ బ్రౌజర్‌ల తాజా వెర్షన్‌లో, దాని కంటే ముందు వెర్షన్‌లో అత్యుత్తమంగా పని చేస్తుంది:

మీ బ్రౌజర్‌లో Gmailకు వెళ్లండి

  1. మీ కంప్యూటర్‌లో, gmail.com లింక్‌కు వెళ్లండి.
  2. Gmailకు సైన్ ఇన్ చేయండి.

బ్రౌజర్ ఎర్రర్‌లను పరిష్కరించండి

బ్రౌజర్ సపోర్ట్ చేయదు

"ఈ బ్రౌజర్ సపోర్ట్ చేయదు."

మీరు Gmailకు సపోర్ట్ చేయని బ్రౌజర్‌ను ఉపయోగిస్తూ, ఈ ఎర్రర్ మెసేజ్ కనిపిస్తే, సమస్యకు కారణం ఎక్స్‌టెన్షన్ కావచ్చు. మీ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లను ఆఫ్ చేయడానికి ట్రై చేయండి.

మీరు Chromeను ఉపయోగిస్తున్నట్లయితే, ఎక్స్‌టెన్షన్‌లను మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

JavaScript ఎర్రర్

"Gmailకు లాగిన్ చేయడానికి, కుక్కీలను సెట్ చేయడానికి JavaScriptను అనుమతించేలా మీ బ్రౌజర్ తప్పనిసరిగా సెట్ చేయబడాలి."

మీరు ఈ మెసేజ్‌ను చూసినట్లయితే, మీ బ్రౌజర్ సెక్యూరిటీ సెట్టింగ్‌లను తెరిచి, మీ విశ్వసనీయ సైట్‌లకు https://mail.google.com సైట్‌ను జోడించండి.

"అయ్యో! మీ వెబ్ బ్రౌజర్‌లో JavaScript డిజేబుల్ చేసినందున Gmail పని చేయదు."

మీరు ఈ మెసేజ్‌ను చూసినట్లయితే, JavaScriptను ఆన్ చేసి, ఆ తర్వాత పేజీని రిఫ్రెష్ చేయండి. మీ JavaScript సెట్టింగ్‌లను మార్చేందుకు గల సూచనలు బ్రౌజర్ వారీగా మారవచ్చు, కాబట్టి సరైన సహాయ కేంద్రం పేజీని కనుగొనడం కోసం JavaScript, మీ బ్రౌజర్ పేరు కోసం సెర్చ్ చేయండి.

మీరు Chromeను ఉపయోగిస్తున్నట్లయితే, సైట్ సెట్టింగ్‌లను మార్చడం ఎలాగో తెలుసుకోండి.

కుక్కీ ఎర్రర్

"మీ బ్రౌజర్‌కు సంబంధించిన కుక్కీ ఫంక్షనాలిటీ ఆఫ్ చేయబడింది. దయచేసి దాన్ని ఆన్ చేయండి."

మీరు ఈ మెసేజ్‌ను చూసినట్లయితే, సూచనలను కనుగొనడానికి మీ బ్రౌజర్ పేరు, కుక్కీల కోసం సెర్చ్ చేయండి. మీరు Chromeను ఉపయోగిస్తున్నట్లయితే, కుక్కీలను ఎనేబుల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7913579617059229379
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false