Gmail ఖాతాను సృష్టించండి

Gmail కోసం సైన్ అప్ చేయడానికి, Google ఖాతాను సృష్టించండి. Gmailకు ఇంకా YouTube, Google Play ఇంకా Google Drive వంటి ఇతర Google ప్రోడక్ట్‌లకు సైన్ ఇన్ చేయడానికి మీరు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చు.

Gmail ఖాతా కోసం సైన్ అప్ చేయండి

  1. Google ఖాతా సైన్ ఇన్ పేజీకి వెళ్లండి.
  2. ఖాతాను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ ఖాతాను సెటప్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.
  4. Gmailకు సైన్ ఇన్ చేయడానికి మీరు క్రియేట్ చేసిన ఖాతాను ఉపయోగించండి.

ఖాతాను క్రియేట్ చేయండి

నాకు కావాలనుకున్న వినియోగదారు పేరు ఇప్పటికే ఉంది

కింది పరిస్థితుల్లో మీరు నిర్దిష్ట Gmail చిరునామాను పొందలేరు, అభ్యర్థించిన వినియోగదారు పేరు :

  • ఇప్పటికే ఉపయోగించబడుతున్నప్పుడు
  • ఇప్పటికే ఉన్న వినియోగదారు పేరును దాదాపు పోలి ఉన్నప్పుడు (ఉదాహరణకు, example@gmail.com ఇప్పటికే ఉంటే, మీరు examp1e@gmail.comను ఉపయోగించలేరు)
  • గతంలో ఒకరు ఇదే వినియోగదారు పేరును ఉపయోగించి, తర్వాత తొలగించినప్పుడు
  • స్పామ్ లేదా దుర్వినియోగాన్ని నిరోధించడానికి Google రిజర్వ్ చేసినప్పుడు

మరొకరు నాలా నటిస్తున్నారు

ఒకరు మీ గుర్తింపును అనుకరించే ప్రయత్నంలో Gmail చిరునామాను సృష్టించారని మీరు విశ్వసిస్తే, మీరు వీటిని చేయవచ్చు:

దురదృష్టవశాత్తు, మరొక వ్యక్తిలా నటించి, మోసం చేసే పరిస్థితులకు సంబంధించి మూడవ పక్షాలు పాల్గొన్న మధ్యవర్తిత్వాలలో Gmail పాల్గొనదు. Gmail వినియోగ నిబంధనలులో మరింత తెలుసుకోండి.

మీ వ్యాపారం కోసం Gmailని ఉపయోగించండి

మీరు మీ బిజినెస్ కోసం Gmailను ఉపయోగించాలనుకుంటే, వ్యక్తిగత Google ఖాతా కంటే Google Workspace ఖాతా మీకు ఉత్తమమైనది కావచ్చు. Google Workspace‌లో ఇవి ఉంటాయి:

  • మీ కంపెనీ డొమైన్ పేరు, susan@example.com వంటి వాటితో కూడిన ప్రొఫెషనల్, యాడ్-రహిత Gmail ఖాతా.
  • ఉద్యోగుల ఖాతాల యాజమాన్యం కాబట్టి మీరు మీ కంపెనీ ఖాతాలు, ఇమెయిల్‌లు ఇంకా ఫైల్‌ల నియంత్రణలోనే ఉంటారు.
  • అసలైన వ్యక్తి నుండి 24/7 ఫోన్, ఇమెయిల్ మరియు చాట్ సపోర్ట్.
  • పెరిగిన Gmail, Google Drive స్టోరేజ్
  • మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి, కోల్పోయిన పరికరాలనుండి రిమోట్ విధానంలో తొలగించే సామర్థ్యం వంటి మొబైల్ పరికర నిర్వహణ ఉంది.
  • అధునాతన భద్రత మరియు నిర్వహణ నియంత్రణలు.

Google Workspace గురించి మరింత తెలుసుకోండి లేదా ఛార్జీ విధించబడని ట్రయల్‌ను ప్రారంభించండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4756976475369690368
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false