వేరే చిరునామా లేదా అలియాస్ నుండి ఇమెయిల్‌లను పంపండి

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీరు మరొక ఇమెయిల్ చిరునామాను కలిగి ఉంటే, మీరు ఆ చిరునామాగా మెయిల్ పంపవచ్చు. ఉదాహరణకు:

 • Yahoo, Outlook, లేదా ఇతర Gmail యేతర చిరునామాలు
 • @yourschool.edu లేదా youralias@gmail.com వంటి మీ కార్యాలయం, పాఠశాల లేదా వ్యాపార డొమైన్ లేదా అలియాస్
 • మరొక Gmail చిరునామాను జోడించండి

చిట్కా: మీరు 99 వేర్వేరు ఇమెయిల్ చిరునామాల నుండి ఇమెయిల్‌లను పంపవచ్చు.

దశ 1: మీ స్వంత చిరునామాను జోడించండి

 1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
 2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
 3. ఖాతాలు, దిగుమతి లేదా ఖాతాలు ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
 4. "మెయిల్‌ను ఈ విధంగా పంపు" విభాగంలో, మరొక ఇమెయిల్ చిరునామాను జోడించును క్లిక్ చేయండి.
 5. మీ పేరు మరియు మీరు పంపదలచిన చిరునామాను నమోదు చేయండి.
 6. తర్వాతి దశ ఆ తర్వాత ధృవీకరణను పంపు క్లిక్ చేయండి.
 7. పాఠశాల లేదా కార్యాలయ ఖాతాల కోసం, SMTP సర్వర్ (ఉదాహరణకు, smtp.gmail.com లేదా smtp.yourschool.edu) మరియు ఆ ఖాతాలోని వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
 8. 'ఖాతాను యాడ్ చేయి' ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

దశ 2: చిరునామాను నిర్ధారించండి

 1. మీరు జోడించిన ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
 2. Gmail నుండి మీకు లభించిన నిర్ధారణ సందేశాన్ని తెరవండి.
 3. లింక్ క్లిక్ చేయండి.

దశ 3: "వీరి నుండి" చిరునామాను మార్చండి

 1. సందేశంలో, "వీరి నుండి" పంక్తిని క్లిక్ చేయండి.
  (మీకు ఇది కనిపించకపోతే, స్వీకర్త ఇమెయిల్ పక్కన ఉన్న స్థలాన్ని క్లిక్ చేయండి.)
 2. పంపడానికి చిరునామాను ఎంచుకోండి.
నా నిర్ధారణ ఇమెయిల్‌ను నేను కనుగొనలేకపోయాను
 • Send-as-noreply@google.com నుండి సందేశం కోసం మీ స్పామ్ లేదా బల్క్ మెయిల్ ఫోల్డర్‌లను తనిఖీ చేయండి.
 • మీరు మీ కార్యాలయం లేదా పాఠశాల ఖాతాను జోడించడానికి ప్రయత్నిస్తుంటే, మీ డొమైన్ అలియాస్ మరియు ఇమెయిల్ అలియాస్ను కాన్ఫిగర్ చేయమని మీ నిర్వాహకుడిని అడగండి.
నా స్వీకర్తలు నా Gmail చిరునామాను చూస్తారు

మీ స్వీకర్త Outlook లేదా మరొక మెయిల్ సేవను ఉపయోగిస్తుంటే, వారు "othername@otherdomain.com తరపున yourname@gmail.com నుండి" వంటివి చూడవచ్చు.

మీరు మీ స్వీకర్తలు మీ అసలు @ gmail.com చిరునామాను కూడా చూడవచ్చు:

ఈమెయిల్ అడ్రస్ లేదా మారుపేరును తీసివేయండి

మీరు మారుపేరు నుండి ఈమెయిల్‌లను పంపించకూడదు అని అనుకున్నా లేదా మారుపేరు చెల్లకున్నా, మీరు ఈమెయిల్‌ను లేదా మారుపేరును తీసివేయవచ్చు. మీరు చెల్లని మారుపేరు నుండి ఈమెయిల్‌ను పంపిస్తే, బౌన్స్ అయిన ఈమెయిల్‌ను మీరు అందుకుంటారు. 

 1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
 2. ఎగువున కుడి వైపున ఉన్న, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
 3. ఖాతాలు, దిగుమతి ట్యాబ్ లేదా ఖాతాలు ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
 4. "మెయిల్‌ను ఈ విధంగా పంపండి" అనే విభాగంలో, మీరు తీసివేయాలనుకున్న ఈమెయిల్ అడ్రస్ పక్కనున్న తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు ఒక చెల్లుబాటయ్యే ఈమెయిల్ అడ్రస్ నుండి బౌన్స్ ఈమెయిల్‌ను పొంది దాన్ని మళ్లీ వెరిఫై చేయాలనుకుంటే, మీరు తప్పకుండా "మెయిల్‌ను ఈ విధంగా పంపండి" అనే విభాగంలో, ఈమెయిల్ అడ్రస్‌ను తొలగించి ఆ తర్వాత మళ్లీ దాన్ని జోడించండి.

ఎల్లప్పుడూ వేరే చిరునామా నుండి పంపండి

మీరు ఎల్లప్పుడూ మీ ఇతర చిరునామా నుండి పంపాలనుకుంటే, మీరు మీ డిఫాల్ట్ "వీరి నుండి" మరియు "దీనికి ప్రత్యుత్తరం" చిరునామా రెండింటినీ మార్చాలి. మీరు "వీరి నుండి" చిరునామాను మాత్రమే మార్చుకుంటే, ప్రత్యుత్తరాలు మీ అసలు Gmail చిరునామాకు డిఫాల్ట్‌గా వెళ్తాయి.

డిఫాల్ట్ "వీరి నుండి" చిరునామాను మార్చండి

ఎల్లప్పుడూ వేరే చిరునామా లేదా అలియాస్ నుండి ఇమెయిల్ పంపడానికి:

 1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
 2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
 3. ఖాతాలు, దిగుమతి లేదా ఖాతాలు ట్యాబ్‌ని క్లిక్ చేయండి.
 4. మీరు ఉపయోగించాలనుకుంటున్న చిరునామాకు కుడి వైపున ఉన్న "మెయిల్ పంపండి" విభాగంలో ఆటోమేటిక్ సెట్టింగ్‌గా చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
డిఫాల్ట్ "దీనికి ప్రత్యుత్తరం" చిరునామాను మార్చండి

మీరు సందేశాన్ని పంపినప్పుడు, ప్రత్యుత్తరాలు మీ అసలు Gmail చిరునామాకు వెళ్తాయి. వేరే చిరునామాను ఎంచుకోవడానికి, ఈ దశలను అనుసరించండి.

 1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
 2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
 3. ఖాతాలు, దిగుమతి లేదా ఖాతాలు ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
 4. "ఇలా మెయిల్ పంపు" విభాగంలో మీ ఇమెయిల్ చిరునామా పక్కన సమాచారాన్ని సవరించును క్లిక్ చేయండి.
 5. విభిన్న "దీనికి ప్రత్యుత్తరం" చిరునామాను పేర్కొనండి క్లిక్ చేయండి.
 6. "దీనికి ప్రత్యుత్తరం" చిరునామాను జోడించండి.
 7. అవసరమైతే, తర్వాతి దశ.ను క్లిక్ చేయండి
 8. మార్పులను సేవ్ చేయి క్లిక్ చేయండి.

"సర్వర్‌ను చేరుకోవడం సాధ్యపడలేదు," "TLS నావిగేషన్ విఫలమైంది" ఎర్రర్

ఈ ఎర్రర్ మెసేజ్‌లలో మీరు ఒక దాన్ని చూసినట్లయితే, మీరు వేరే పోర్ట్ సంఖ్య మరియు ప్రామాణీకరణ రకాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. మీరు మీ ప్రొవైడర్ కోసం సరైన అవుట్‌గోయింగ్ మెయిల్ సర్వర్‍‌ను ఉపయోగించినట్లు నిర్ధారించుకోండి. సరైన సెట్టింగ్‌ల కోసం మీరు మీ థర్డ్ పార్టీ ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించవలసి ఉండవచ్చు.

సురక్షిత కనెక్షన్‌ను ఎంచుకోండి

వారు సిఫార్సు చేసిన పోర్ట్ సంఖ్య, ప్రామాణీకరణ రకం లేదా అవుట్‌గోయింగ్ మెయిల్ సర్వర్ కోసం మీ ఇతర మెయిల్ సర్వీస్‌తో చెక్ చేయండి. మీ థర్డ్ పార్టీ ప్రొవైడర్ చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌తో SSL లేదా TLSను సపోర్ట్ చేస్తుందని నిర్ధారించుకోండి.

ఇక్కడ కొన్ని సాధారణ కలయికలు ఉన్నాయి:

 • పోర్ట్ 465తో SSL
 • పోర్ట్ 25 లేదా 587తో TLS
నా ఇతర మెయిల్ సేవ SSL లేదా TLS కి మద్దతు ఇవ్వదు

మీ ఇమెయిల్‌ను సురక్షిత (ఎన్‌క్రిప్ట్ చేసిన) కనెక్షన్ ద్వారా పంపమని మేము సిఫార్సు చేస్తున్నాము.

అయితే, మీ ఇతర మెయిల్ సర్వీస్ ఈ సురక్షిత కనెక్షన్‌లను సపోర్ట్ చేయకపోతే లేదా చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌ను ఉపయోగించకపోతే, మీరు పోర్ట్ 25ని ఎంచుకోవచ్చు, ఆపై కనిపించే సురక్షితం కాని కనెక్షన్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

మీరు ఇలా చేస్తే, మీ రక్షణ కోసం మీ సమాచారం ఎన్‌క్రిప్ట్ చేయబడదు.

Gmail అలియాస్‌లను ఉపయోగించండి

మీ Gmail అలియాస్ ఉపయోగించి ఫిల్టర్ చేయండి

మీ ఇమెయిల్‌ను క్రమీకరించడానికి సులభమైన మార్గం మీ వినియోగదారు పేరు తర్వాత వర్గాలను జోడించడం.

ఉదాహరణకు, కింది అలియాస్‌లకు పంపిన సందేశాలు అన్నీ janedoe@gmail.comకు వెళ్తాయి:

 • janedoe+school@gmail.com
 • janedoe+notes@gmail.com
 • janedoe+important.emails@gmail.com

దశ 1: అలియాస్‌లను ఎంచుకోండి

మీరు మీ ఇమెయిల్‌ను ఎలా క్రమీకరించాలనుకుంటున్నారో ఆలోచించండి, ఆపై ప్రతి వర్గానికి అలియాస్‌ను ఎంచుకోండి. ఉదాహరణకు:

 • కార్యాలయ ఇమెయిల్‌ల కోసం మీ పేరు+work@gmail.comను ఉపయోగించండి.
 • వార్తాలేఖల కోసం సైనప్ చేయడానికి మీ పేరు+news@gmail.com ఉపయోగించండి.
 • ఆన్‌లైన్ రిటైలర్‌తో ఖాతాను సృష్టించడానికి మీ పేరు+shopping@gmail.com ఉపయోగించండి.

దశ 2: మీ సందేశాలను ఫిల్టర్ చేయండి

ఇటువంటి ఆటోమేటిక్ చర్యలు తీసుకోవడానికి ఫిల్టర్‌లను సృష్టించండి:

 • లేబుల్ లేదా నక్షత్రాన్ని జోడించడం
 • మరొక ఖాతాకు ఫార్వర్డ్ చేయడం
 • ఆర్కైవ్ చేయడం లేదా తొలగించడం
కార్యాలయం లేదా పాఠశాల సమూహం అలియాస్ నుండి పంపండి

మీరు మీ కార్యాలయం లేదా పాఠశాల ఖాతాతో Gmail ఉపయోగిస్తే, మీరు సమూహ అలియాస్ నుండి పంపవచ్చు. సమూహ అలియాస్ నుండి పంపడానికి ధృవీకరణ ఇమెయిల్‌ను స్వీకరించడానికి, మీరు సమూహానికి ప్రతినిధులకు యాక్సెస్ ఇవ్వాలి.

ముఖ్యమైనది:అలియాస్‌లు అనేవి ప్రైవేట్ కాదు, కొన్నిసార్లు అవి ఇతరులకు కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు bill@school.edu నుంచి వచ్చిన మెసేజ్‌ల కోసం Gmailను వెతికితే, alias@school.edu కు సంబంధించిన మెసేజ్‌లు మీకు కనిపించవచ్చు.

ఇతర సభ్యుల యాక్సెస్ మార్చడానికి మీకు సమూహం యొక్క అనుమతులకు యాక్సెస్ అవసరం.

 1. Google గుంపులును తెరవండి.
 2. నా గుంపులును క్లిక్ చేయండి.
 3. మీరు పంపించదలిచిన సమూహం పేరు క్రింద, నిర్వహించు క్లిక్ చేయండి.
 4. ఎడమ వైపున, అనుమతులు ఆ తర్వాత పోస్ట్ చేయడానికి అనుమతులు క్లిక్ చేయండి.
 5. "పోస్ట్" విభాగంలో, కిందికి ఉన్న బాణంని కిందికి బాణం క్లిక్ చేయండి.
 6. వెబ్ లో ఎవరైనాని ఎంపిక చేయండి.
 7. సేవ్ చేయి క్లిక్ చేయండి.
చిట్కా: గ్రూప్ అనుమతులలో "వెబ్‌లో ఉన్న ఎవరైనా" అందుబాటులో లేకపోతే, "మీ డొమైన్ కోసం సంస్థ వెలుపలి నుండి వచ్చే ఈమెయిల్‌ను గ్రూప్ ఓనర్‌లు అనుమతించవచ్చు" ఆప్షన్‌ను మీ అడ్మినిస్ట్రేటర్ ఎనేబుల్ చేయవలసి ఉంటుంది.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17