Gmailలో ప్రాముఖ్యత మార్కర్లు

Gmail మీ ఇమెయిల్‌లను ఆటోమేటిక్‌గా ప్రాముఖ్యమైనవి లేదా ప్రాముఖ్యమైనవి కాదు అని గుర్తించడానికి అనేక సంకేతాలను ఉపయోగిస్తుంది.

ఎలాంటి ఇమెయిల్‌లు ముఖ్యమైనవో Gmail ఎలా నిర్ణయిస్తుంది

ఏ సందేశాన్ని ఆటోమేటిక్‌గా ప్రాముఖ్యమైనది అని గుర్తించాలో నిర్ణయించడానికి Gmail, ఈ కింది వాటితో సహా అనేక సంకేతాలను ఉపయోగిస్తుంది:

  • మీరు ఎవరికి ఇమెయిల్‌కు పంపుతారు, ఎంత తరచుగా పంపుతారు
  • మీరు ఏ ఇమెయిల్‌లను తెరుస్తారు
  • మీరు ఏ ఇమెయిల్‌లకు ప్రత్యుత్తరమిస్తారు
  • మీరు సాధారణంగా చదివే ఇమెయిల్‌లలోని కీవర్డ్‌లు
  • మీరు ఏ ఇమెయిల్‌లకు నక్షత్రం గుర్తు ఇస్తారు, వేటిని ఆర్కైవ్ చేస్తారు లేదా తొలగిస్తారు

ఒక ఇమెయిల్ ఎందుకు ప్రాముఖ్యమైనదిగా గుర్తించబడిందో చూడటానికి, ప్రాముఖ్యత మార్కర్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.

గమనిక: ఒక ఇమెయిల్ ప్రాముఖ్యమైనదిగా గుర్తించబడితే, కానీ మీరు అలా అవ్వకూడదు అనుకుంటే, దానిని మార్చడానికి ప్రాముఖ్యత మార్కర్‌ను క్లిక్ చేయండి. ఇది మీరు ఏ సందేశాలను ప్రాముఖ్యమైనవిగా పరిగణిస్తారో తెలుసుకోవడంలో కూడా Gmailకు సహాయపడుతుంది.

మీ ప్రాముఖ్యమైన ఇమెయిల్‌లను చూడండి

Gmail ప్రాముఖ్యమైనవి అని భావించే ఇమెయిల్‌ల పక్కన, మీకు పసుపు రంగు ప్రాముఖ్యత మార్కర్ కనిపిస్తుంది. ఒక ఇమెయిల్ ప్రాముఖ్యమైనదిగా గుర్తించబడకపోతే, ఆ మార్కర్ ఎలాంటి రంగుతో నింపబడుకుండా ఖాళీగా కనిపిస్తుంది.

ప్రాముఖ్యమైనవి అని గుర్తించబడిన ఇమెయిల్‌లు అన్నింటినీ చూడటానికి, Gmailలో is:importantఅని వెతకండి.

మీ ప్రాముఖ్యత మార్కర్‌ల సెట్టింగ్‌లను మార్చండి

ఏ ఇమెయిల్‌లు ప్రాముఖ్యమైనవో ఊహించడానికి గత చర్యలను ఉపయోగించవద్దు

  1. బ్రౌజర్‌ను ఉపయోగించి, Gmailను తెరవండి. మీరు ఈ సెట్టింగ్‌ను Gmail యాప్ నుండి మార్చలేరు, కానీ మీరు మీ కంప్యూటర్‌లో ఎంచుకునే సెట్టింగ్‌లు మీ యాప్‌నకు కూడా వర్తిస్తాయి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఇన్‌బాక్స్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "ప్రాముఖ్యత మార్కర్లు" విభాగంలో, ఏ సందేశాలు ప్రాముఖ్యమైనవో ఊహించడానికి నా గత చర్యలను ఉపయోగించవద్దును ఎంచుకోండి.
  5. పేజీ దిగువన, 'మార్పులను సేవ్ చేయి'ని క్లిక్ చేయండి.

Gmailలో ప్రాముఖ్యత మార్కర్లను కనిపించకుండా దాచండి

  1. బ్రౌజర్‌ను ఉపయోగించి, Gmailను తెరవండి. మీరు ఈ సెట్టింగ్‌ను Gmail యాప్ నుండి మార్చలేరు, కానీ మీరు మీ కంప్యూటర్‌లో ఎంచుకునే సెట్టింగ్‌లు మీ యాప్‌నకు కూడా వర్తిస్తాయి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఇన్‌బాక్స్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "ప్రాముఖ్యత మార్కర్‌లు" విభాగంలో, మార్కర్‌లేవీ వద్దును ఎంచుకోండి.
  5. పేజీ దిగువన, 'మార్పులను సేవ్ చేయి'ని క్లిక్ చేయండి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16489466936947026329
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false