ఈ సందేశం వీరు పంపి ఉండకపోవచ్చు...

ఒక సందేశానికి అది Gmail ద్వారా పంపబడిందని నిర్ధారించడానికిప్రామాణీకరణ డేటా లేనప్పుడు, మీ సమాచారాన్ని రక్షించడానికి మేము మిమ్మల్ని హెచ్చరిస్తాము.

హెచ్చరిక సందేశం ఎందుకు కనిపిస్తుంది

పంపినవారి చిరునామా name@gmail.comగా అనిపించినప్పటికీ, మేము ఆ ఇమెయిల్ ఖచ్చితంగా ఆ Gmail ఖాతా నుండి వస్తుంది అని మేము ధృవీకరించలేని సందర్భంలో మీకు ఈ హెచ్చరిక కనిపిస్తుంది.

పంపినవారు ఈ కింది చర్యలు చేస్తే ఇది జరగవచ్చు:

  • నకిలీ Gmail ఖాతా నుండి పంపడం
  • ఒక వెబ్‌సైట్ నుండి మీకు ఇమెయిల్ చేసినప్పుడు (ఉదాహరణకు, ఒక వార్తా కథనాన్ని షేర్ చేయడానికి)
  • ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అయిన ఇమెయిల్ పంపినప్పుడు (ఉదాహరణకు, మీ పాఠశాల ఖాతా నుండి మీ వ్యక్తిగత Gmailకు)

1వ ఎంపిక: సందేశం అనుమానాస్పదంగా ఉంది

సందేశం మీకు కనిపిస్తున్న Gmail చిరునామా నుండి వచ్చినదే అని మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు, ఈ కింది దశలను పాటించండి.

  1. హెచ్చరిక సందేశంలో, ఫిషింగ్‌ను రిపోర్ట్ చేయిను క్లిక్ చేయండి.
  2. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దు లేదా ఇమెయిల్‌లోని లింక్‌లు వేటినీ క్లిక్ చేయవద్దు.

2వ ఎంపిక: సందేశాన్ని పంపినవారు నమ్మకమైనవారు

మీకు పంపినవారు నమ్మకమైనవారు అని తెలిస్తే, మీరు వారి సందేశం నుండి హెచ్చరికను భవిష్యత్తులో తొలగించవచ్చు.

పంపినవారిలో ఒక్కొక్కరి నుండి హెచ్చరిక సందేశాన్ని ఒక్కొక్క పర్యాయంలో తీసివేయండి
  1. మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
  2. ఎగువున ఉన్న సెర్చ్ బాక్స్‌లో, సెర్చ్ ఆప్షన్‌లను చూడండి photos tuneని క్లిక్ చేయండి.
  3. "నుండి" ఫీల్డ్‌లో, పంపినవారి ఈమెయిల్ అడ్రస్‌ను టైప్ చేయండి.
  4. దిగువున కుడి వైపున ఉన్న, ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. దీనిని ఎప్పటికీ స్పామ్‌కు పంపించవద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఫార్వర్డ్ చేయబడిన సందేశాల నుండి హెచ్చరికను తీసివేయండి

మీరు వేరొక ఇమెయిల్ చిరునామా నుండి సందేశాలను ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేస్తే, మీరు ఆ సందేశాల నుండి హెచ్చరికను తీసివేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఎగువన, 'ఖాతాలు, దిగుమతి' లేదా ఖాతాలు ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "మెయిల్‌ను ఈ విధంగా పంపు" విభాగంలో, మరొక ఇమెయిల్ చిరునామాను జోడించును క్లిక్ చేయండి.
  5. మీ స్క్రీన్‌పై కనిపించే దశలను పాటించండి.

మీరు ఫార్వర్డ్ చేసే మెసేజ్‌లలోని హెచ్చరిక స్థానంలో మీకు "anotherdomain.com ద్వారా sender@gmail.com" లాంటిది కనిపిస్తుంది.

నేను ఇమెయిల్ పంపించే వ్యక్తులకు హెచ్చరికను చూపించవద్దు

మీరు ఈ హెచ్చరికను మీ సందేశాన్ని స్వీకరించేవారికి కనిపించకుండా ఆపవచ్చు. ప్రారంభించడానికి, మీరు Gmail సందేశాలను పంపించే విధానాన్ని ఎంచుకోండి:

ఫోన్ లేదా టాబ్లెట్

మీరు మీ మొబైల్ పరికరం కోసం Gmail యొక్క సెటప్ మార్గదర్శకాలును అనుసరించారని నిర్ధారించుకోండి.

"మెయిల్‌ను ఈ విధంగా పంపించు": Yahoo! మెయిల్, AOL, Outlook, లేదా ఇతర Google-కాని ఖాతా

మీరు Gmailకు సైన్ ఇన్ చేసి, Google-కాని ఖాతా నుండి పంపడానికి "మెయిల్‌ను ఈ విధంగా పంపించు"ను ఉపయోగిస్తుంటే, మీరు Google SMTP సర్వర్‌లనును ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

Outlook, Apple మెయిల్ లేదా ఇతర మెయిల్ సేవ

మీరు మీ Gmailను IMAP లేదా POPతో సెటప్ చేశారని నిర్ధారించుకోండి.

కార్యాలయ లేదా పాఠశాల ఖాతా

ఇమెయిల్ ప్రామాణీకరణను సెటప్ చేయడానికి మీ నిర్వాహకుని సంప్రదించండి.

ఈ చర్యలు పనిచేయకపోతే, మీరు సమస్యను రిపోర్ట్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2763856144429399175
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false