మీ Gmail భాషా సెట్టింగ్‌లను మార్చండి

మీరు Gmail చూడటానికి ఉపయోగించే భాషను మార్చవచ్చు మరియు ఇతర భాషలలో టైప్ చేయడానికి ప్రత్యేక కీబోర్డులను ఉపయోగించవచ్చు.  

Gmail చూడటానికి మీరు ఉపయోగించే భాషను మార్చండి

  1. Gmailని తెరవండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  4. "భాష" విభాగంలో, డ్రాప్-డౌన్ మెను నుండి భాషను ఎంచుకోండి.
  5. పేజీ దిగువన, మార్పులను సేవ్ చేయిని క్లిక్ చేయండి.

మరొక భాషలో టైప్ చేయండి

ప్రత్యేక కీబోర్డులతో సహా ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించి మీరు హిందీ, అరబిక్ లేదా చైనీస్ వంటి భాషలలో టైప్ చేయవచ్చు. వివిధ భాషల కోసం వివిధ రకాల ఇన్‌పుట్ సాధనాలు ఉన్నాయి.

  1. Gmailని తెరవండి. మీరు బ్రౌజర్ నుండి మాత్రమే ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించగలరు, Gmail యాప్‌లో చేయలేరు.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  4. "భాష" విభాగంలో, భాష ఎంపికలను అన్నింటినీ చూపించును క్లిక్ చేయండి.
  5. "ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించు" పక్కన ఉన్న పెట్టెను ఎంచుకోండి.
  6. మీరు ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించాలనుకుంటున్న భాషలను మరియు మీరు ఏ విధమైన కీబోర్డ్‌ను ఉపయోగించాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  7. సరే క్లిక్ చేయండి.
  8. పేజీ దిగువన, మార్పులను సేవ్ చేయిని క్లిక్ చేయండి.
  9. మీ ఇన్‌బాక్స్‌ను తెరవండి
  10. కుడి ఎగువన, సెట్టింగ్‌లుకు పక్కన, భాష చిహ్నాన్ని క్లిక్ చేయండి. మీకు పలు ఇన్‌పుట్ సాధనాలు ఉంటే, వాటిలో మారడానికి క్రింది బాణాన్ని ఉపయోగించండి.

వచనం దిశను మార్చండి

  1. Gmailని తెరవండి. మీరు బ్రౌజర్ నుండి మాత్రమే ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించగలరు, Gmail యాప్‌లో చేయలేరు.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  4. "భాష" విభాగంలో, కుడి నుండి ఎడమ సవరణ మద్దతు ఆన్ క్లిక్ చేయండి.
  5. పేజీ దిగువన, మార్పులను సేవ్ చేయిని క్లిక్ చేయండి.

మీరు కొత్త ఇమెయిల్‌ను ప్రారంభించినప్పుడు, మీరు మళ్లీ దిశను మార్చాలి. ఇమెయిల్‌ని రాసే విండో దిగువ ఎడమవైపు, ఆకృతీకరణ ఎంపికలు ఆ తర్వాత కుడి నుండి ఎడమకును క్లిక్ చేయండి.

ఇమెయిల్‌లలో తికమక వచనాన్ని పరిష్కరించండి

మీరు మీ ఇమెయిల్‌లలో తప్పు భాష నుండి అక్షరాలను చూస్తుంటే, మీరు సెట్టింగ్‌ని మార్చాలి.

  1. Internet Explorer లేదా Firefox వంటి మీ బ్రౌజర్ తెరవండి.
  2. మీ బ్రౌజర్ ఎగువన, వీక్షణ ఆ తర్వాత ఎన్‌కోడింగ్ (Internet Explorer) లేదా వచన ఎన్‌కోడింగ్ (Safari, Firefox)ని ఎంపిక చేయండి.
  3. జాబితా నుండి, మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
907647819310741713
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false