Gmailలో సాధారణ HTML వీక్షణ నుండి స్టాండర్డ్ వీక్షణకు మారే స్క్రీన్ రీడర్ యూజర్‌లకు సంబంధించిన గైడ్

Gmailలోని ఆటోమేటిక్ సెట్టింగ్ స్టాండర్డ్ వీక్షణలో సాధారణ HTML వీక్షణ కంటే మరిన్ని ఫీచర్‌లు, వినియోగ సామర్ధ్య మెరుగుదలలు ఉన్నాయి. స్టాండర్డ్ వీక్షణలో, Gmail త్వరగా చర్యలను అమలు చేయడానికి, ఇంటర్‌ఫేస్‌ను నావిగేట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లతో కూడిన వెబ్ అప్లికేషన్‌గా రూపొందించబడింది. సైట్‌ను నావిగేట్ చేయడానికి, దానితో ఇంటరాక్ట్ అవ్వడానికి అప్లికేషన్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడాన్ని వెబ్ అప్లికేషన్ అంటారు, కాగా వెబ్ పేజీ అంటే స్క్రీన్ రీడర్ షార్ట్‌కట్‌లు (లేదా కమాండ్‌లు) పేజీని నావిగేట్ చేయడానికి, దానితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగించబడతాయి.

మీకు సాధారణ HTML వీక్షణలో Gmail గురించి బాగా తెలిసి ఉంటే, Gmailలో స్టాండర్డ్ వీక్షణను మీ స్క్రీన్ రీడర్‌తో వెబ్ పేజీగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఈ గైడ్‌ను ఉపయోగించండి.

చిట్కాలు:

మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి

మీరు సాధారణ HTML వీక్షణతో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగిస్తుంటే, స్టాండర్డ్ వీక్షణకు సంబంధించి మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి. 

Gmailలో "సంక్షిప్త" వీక్షణను ఉపయోగించండి

మీరు స్క్రీన్ మ్యాగ్నిఫైయర్‌ను కూడా ఉపయోగిస్తుంటే, సాధారణ HTML వీక్షణ మాదిరిగానే ఉండే మీ ఇన్‌బాక్స్ సంక్షిప్త వీక్షణను ఉపయోగించవచ్చు.

ఎగువున హెడర్‌లో, "క్విక్ సెట్టింగ్‌లు" మెనూను తెరవడానికి, Tabను నొక్కడం ద్వారా "సెట్టింగ్‌లు" బటన్‌కు వెళ్లి, Enterను నొక్కండి. మీరు స్క్రీన్ రీడర్ బటన్ నావిగేషన్ కమాండ్‌లను కూడా ఉపయోగించవచ్చు.

"క్విక్ సెట్టింగ్‌ల"ను తెరిచినప్పుడు, Tabను నొక్కడం ద్వారా రేడియో బటన్‌లకు వెళ్లి, "సంక్షిప్తమైనది" ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇన్‌బాక్స్ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి

అదనపు ఇన్‌బాక్స్ సెట్టింగ్‌లను గుర్తించడానికి:

  1. "క్విక్ సెట్టింగ్‌లు" మెనూను తెరవండి.
  2. "అన్ని సెట్టింగ్‌లను చూడండి" బటన్‌కు వెళ్లడానికి Tab (లేదా Shift + Tab)ను నొక్కండి.
  3. Enterను నొక్కండి.
    • ఇది సాధారణ HTML వీక్షణ కంటే ఎక్కువ సెట్టింగ్‌లు ఉన్న పేజీని తెరుస్తుంది.
    • "సాధారణం" ట్యాబ్‌కు ఫోకస్ సెట్ చేయబడి ఉంటుంది.
  4. "సాధారణం" నుండి, "ఇన్‌బాక్స్" ట్యాబ్‌కు వెళ్లడానికి రెండుసార్లు Tabను నొక్కండి.
  5. Enterను నొక్కండి.

ఇన్‌బాక్స్ కేటగిరీలను తీసివేయండి

"ఇన్‌బాక్స్" ట్యాబ్‌లో:

  1. చెక్‌బాక్స్‌లను నావిగేట్ చేయడానికి మీ స్క్రీన్ రీడర్ వర్చువల్ కర్సర్‌ను లేదా బ్రౌజ్ మోడ్‌ను ఉపయోగించండి.
  2. ఎంపికను తీసివేయడానికి Spaceను నొక్కండి:
    • "ప్రమోషన్‌లు"
    • "సోషల్"
    • "అప్‌డేట్‌లు"
    • "ఫోరమ్‌లు"

మీరు ఇన్‌బాక్స్ కేటగిరీలను తీసివేసిన తర్వాత, ఈమెయిల్స్ అన్నీ ప్రధాన ఇన్‌బాక్స్‌లో గ్రూప్ చేయబడతాయి.

చిట్కా: మీరు ఈమెయిల్‌ను ఈ కేటగిరీలలోకి గ్రూప్ చేయాలనుకుంటే, ఇన్‌బాక్స్ కేటగిరీలను ఎలా సెటప్ చేయాలో తెలుసుకోండి.

రీడింగ్ పేన్‌ను ఆఫ్ చేయండి

మీ సంభాషణ లిస్ట్‌లోని మెసేజ్‌పై ఫోకస్ ఉన్నప్పుడు, మెసేజ్‌లోని కంటెంట్‌లను రీడింగ్ పేన్ చూపుతుంది. ప్రతిస్పందనను మెరుగుపరచడానికి, నావిగేషన్‌ను సరళీకరించడానికి, మీరు రీడింగ్ పేన్‌ను ఆఫ్ చేయాలి.

"ఇన్‌బాక్స్" ట్యాబ్‌లో:

  1. "రీడింగ్ పేన్‌ను ఎనేబుల్ చేయండి" చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tabను నొక్కండి.
  2. ఎంపికను తీసివేయడానికి Spaceను నొక్కండి.

ప్రాముఖ్యత మార్కర్‌ను ఆఫ్ చేయండి

మీరు ప్రాముఖ్యత మార్కర్‌లను ఆన్‌లో వదిలివేస్తే, స్టాండర్డ్ వీక్షణలో ప్రాముఖ్యత స్టేటస్ ప్రకటించబడుతుంది, అలాగే సంభాషణ లిస్ట్‌కు అదనపు చెక్‌బాక్స్‌ను జోడిస్తుంది. ఆటోమేటిక్ సెట్టింగ్ విరామ చిహ్నాల స్థాయి రీడింగ్ కారణంగా సాధారణ HTML వీక్షణలో ప్రాముఖ్యత మార్కర్‌లు ప్రకటించబడనందున, మీరు వాటిని ఆఫ్ చేయవచ్చు.

"ఇన్‌బాక్స్" ట్యాబ్‌లో:

  1. "మార్కర్‌లను చూడండి" రేడియో బటన్‌కు వెళ్లడానికి Tabను నొక్కండి.
  2. "మార్కర్‌లు వద్దు" ఆప్షన్‌ను ఎంచుకోవడానికి, కింది వైపు బాణం కీని నొక్కండి.

మార్పులను సేవ్ చేయండి

మీ ఇన్‌బాక్స్ సెట్టింగ్‌లను మీరు అప్‌డేట్ చేసిన తర్వాత, Tabను నొక్కడం ద్వారా "సేవ్ చేయండి" బటన్‌కు వెళ్లి, Enterను నొక్కండి. Gmail సంభాషణల లిస్ట్‌కు ఫోకస్ తిరిగి వస్తుంది.

స్క్రీన్ రీడర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయండి

ఆధునిక స్క్రీన్ రీడర్‌లు, Gmail వంటి వెబ్ అప్లికేషన్‌లు కదులుతున్నప్పుడు కీబోర్డ్ ఫోకస్‌ను ఫాలో అవ్వడం ద్వారా వాటికి ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతాయి. ఇది సహాయకరంగానే ఉన్నప్పటికీ, Gmailను వెబ్ పేజీగా నావిగేట్ చేయడానికి ఉపయోగించే స్క్రీన్ రీడర్‌కు చెందిన సింగిల్ లెటర్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను కూడా ఇది డిజేబుల్ చేస్తుంది.

మీ స్క్రీన్ రీడర్‌ను Gmailకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవ్వకుండా నివారించడానికి:

  • JAWS: ఆటోమేటిక్ Forms మోడ్‌ను ఆఫ్ చేయడానికి సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.
  • NVDA: ఫోకస్, కేరెట్ కదలికకు ప్రతిస్పందనను ఆఫ్ చేయడానికి బ్రౌజ్ మోడ్ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.

ఈ మార్పులతో, మీరు ఇప్పటికీ Gmailను స్టాండర్డ్ వీక్షణలో JAWS లేదా NVDAతో వెబ్ పేజీగా ఉపయోగించగలరు.

ChromeVox, VoiceOver కోసం, Gmailను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించడానికి, Gmailను స్క్రీన్ రీడర్‌గా ఉపయోగించండి అనే విభాగానికి వెళ్లండి.

మీరు ఈ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసిన తర్వాత, మీ స్క్రీన్ రీడర్ దాని వర్చువల్ లేదా బ్రౌజ్ ఫోకస్‌ను Gmailలో పేజీ ఎగువ భాగానికి రీసెట్ చేయవచ్చు. ఇలా జరిగినప్పుడు, మీ మునుపటి లొకేషన్‌కు తిరిగి నావిగేట్ చేయండి.

కొత్త కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఆన్ చేసి, అన్వేషించండి

స్టాండర్డ్ వీక్షణలో మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఆన్ చేసి, ఉపయోగించండి. స్క్రీన్ రీడర్ వర్చువల్ కర్సర్ లేదా బ్రౌజ్ మోడ్ ఆఫ్‌లో ఉందని, ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్ లేదని నిర్ధారించుకోండి.

Gmailలో కీబోర్డ్ షార్ట్‌కట్‌ల డైలాగ్‌ను డిస్‌ప్లే చేయడానికి:

  1. Shift + స్లాష్‌ను నొక్కండి.
    • ఎనేబుల్ చేయబడిన లేదా డిజేబుల్ చేయబడిన కీబోర్డ్ షార్ట్‌కట్‌లకు సంబంధించి మీరు అలర్ట్‌ను వినవచ్చు.
  2. "ఎనేబుల్ చేయండి" లేదా "డిజేబుల్ చేయండి" అని పేర్కొన్న లింక్‌కు నావిగేట్ చేయడానికి, Tabను నొక్కండి.
    • "డిజేబుల్ చేయండి" అని లింక్ పేర్కొంటే, కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఉపయోగించడానికి అందుబాటులో ఉంటాయి.
    • "ఎనేబుల్ చేయండి" అని లింక్ పేర్కొంటే, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఆన్ చేయడానికి Enterను నొక్కండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌ల లిస్ట్‌ను కొత్త విండోలో తెరవడానికి:

  1. అదే పేజీ నుండి, "కొత్త విండోలో తెరవండి" అని పేర్కొన్న లింక్‌కు వెళ్లడానికి Tabను నొక్కండి.
  2. Enterను నొక్కండి.
    • ఇది Gmail కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు అనే టైటిల్‌తో ఉన్న సహాయ కేంద్రం పేజీని తెరుస్తుంది.
    • సహాయ కేంద్రం పేజీలో పలు కుదించగల విభాగాలు ఉంటాయి. సహాయ కేంద్రం పేజీలో ఒక విభాగాన్ని విస్తరించడానికి, విభాగం పేరుతో ఉన్న బటన్‌కు నావిగేట్ చేసి, Enterను నొక్కండి.

మీ స్క్రీన్ రీడర్ వెబ్ రీడింగ్ కమాండ్‌లతో కీబోర్డ్ షార్ట్‌కట్‌ల డైలాగ్‌ను కూడా మీరు అన్వేషించవచ్చు:

  • కంటెంట్, పలు టేబుల్స్‌లో ప్రదర్శించబడుతుంది, అందులో మొదటి నిలువు వరుస కీబోర్డ్ షార్ట్‌కట్ కాగా, రెండవ నిలువు వరుస అది అమలు చేసే చర్య.
  • కొన్ని షార్ట్‌కట్‌లు విరామ చిహ్న అక్షరాలను ఉపయోగిస్తాయి. మీ స్క్రీన్ రీడర్‌కు చెందిన విరామ చిహ్న సెట్టింగ్‌లను మీరు సర్దుబాటు చేయాల్సి రావచ్చు.
  • మీరు అక్షరం వారీగా ప్రతి షార్ట్‌కట్‌ను కూడా జాగ్రత్తగా రివ్యూ చేయవచ్చు.
  • "ఎనేబుల్ చేయండి" / "డిజేబుల్ చేయండి" లింక్ తర్వాత, మీరు ఉపయోగించడానికి ఆన్ చేయాల్సిన షార్ట్‌కట్‌ల లిస్ట్‌ను కనుగొనవచ్చు. ఈ షార్ట్‌కట్‌లలో చాలా వరకు మీ స్క్రీన్ రీడర్ వెబ్ నావిగేషన్‌కు విరుద్ధంగా ఉండే ఒకే అక్షరాలుగా ఉంటాయి. ఉదాహరణకు, "X" అనే అక్షరం, చెక్‌బాక్స్ వారీగా నావిగేట్ చేయడానికి స్క్రీన్ రీడర్ కమాండ్‌కు బదులుగా, సంభాషణ ఎంపికను టోగుల్ చేస్తుంది.

స్టాండర్డ్ వీక్షణలో Gmailను నావిగేట్ చేయండి

సాధారణ HTML వీక్షణతో పోల్చితే, స్టాండర్డ్ వీక్షణలో మీరు Gmailను నావిగేట్ చేసే విధానంలో కొన్ని తేడాలు ఉన్నాయి.

సంభాషణ లిస్ట్‌లు

మీ ఇన్‌బాక్స్ లాగానే, సంభాషణ లిస్ట్‌లు ప్రతి సంభాషణ మొదటి నిలువు వరుసలో చెక్‌బాక్స్‌తో, టేబుల్‌లో ప్రదర్శించబడతాయి. అయితే, అదే సమాచారం ఇప్పుడు మరిన్ని నిలువు వరుసలలో ప్రదర్శించబడుతుంది:

  • ఎంపిక చెక్‌బాక్స్ తర్వాత "స్టార్" ఉంటుంది (మునుపు ఇది చెక్‌బాక్స్‌తో కలిపి ఉండేది). "మరిన్ని చర్యలు" ఆప్షన్‌కు నావిగేట్ చేయడానికి బదులుగా, మీరు నేరుగా నిలువు వరుసలో "స్టార్" బటన్‌ను టోగుల్ చేయవచ్చు.
  • ఈమెయిల్స్ పంపే వారి ఫీల్డ్‌లో విరామ చిహ్నంగా చూపడానికి బదులుగా, "స్టార్" తర్వాత "ప్రాముఖ్యత" ఉంటుంది. డిజేబుల్ చేయకపోతే, మీరు నిలువు వరుసలోని "ప్రాముఖ్యత" చెక్‌బాక్స్‌ను టోగుల్ చేయవచ్చు.
  • "సబ్జెక్ట్"తో కలిపి ఉంచడానికి బదులుగా, "సబ్జెక్ట్" తర్వాత "అటాచ్‌మెంట్" ఉంటుంది.

"పంపబడినవి", "డ్రాఫ్ట్‌లు", లేదా "అన్ని మెయిల్స్" వంటి మరొక సంభాషణల సెట్‌ను రివ్యూ చేయడానికి, మీరు లింక్‌ల లిస్ట్‌ను నావిగేట్ చేయడానికి స్క్రీన్ రీడర్ కమాండ్‌ను ఉపయోగించవచ్చు, ఆపై సంబంధిత లింక్‌ను యాక్టివేట్ చేయవచ్చు. 

నేరుగా నావిగేట్ చేయడానికి వెబ్ అప్లికేషన్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు కూడా ఉన్నాయి:

  • అన్ని మెయిల్స్: g, ఆపై a
  • పంపబడినవి: g, ఆపై t
  • ఇన్‌బాక్స్: g, ఆపై i

మరింత తెలుసుకోవడానికి, మెయిల్‌ను ఆర్గనైజ్ చేయడానికి లేబుల్స్‌ను ఉపయోగించండి అనే విభాగానికి వెళ్లండి.

మీ సంభాషణలను నావిగేట్ చేయండి

టేబుల్‌లోని ప్రతి సంభాషణ ఐటెమ్‌కు స్టాండర్డ్ వీక్షణలో ఇప్పటికీ చెక్‌బాక్స్‌లు ఉన్నాయి, కాబట్టి చెక్‌బాక్స్ నావిగేషన్ ఇప్పటికీ ప్రతి మెసేజ్‌కు వెళ్తుంది. ఈమెయిల్స్ పంపే వారిని, సబ్జెక్ట్‌ను, మెసేజ్ టెక్స్ట్ ప్రివ్యూతో పాటు మెసేజ్ ఎప్పుడు పంపబడిందో కూడా చెక్‌బాక్స్ నావిగేషన్ చదువుతుంది.

  • మీ మెసేజ్‌లను త్వరగా స్కాన్ చేయడానికి, సబ్జెక్ట్‌కు కూడా నావిగేట్ చేయడానికి బదులుగా, చెక్‌బాక్స్ వారీగా నావిగేట్ చేయండి.
  • చర్య తీసుకోవడానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చెక్‌బాక్స్‌లను టోగుల్ చేయండి. 
  • మెసేజ్‌కు సంబంధించిన 'చదవనివి' స్టేటస్ కూడా చదవబడుతుందని గుర్తుంచుకోండి.

సంభాషణను తెరవడానికి:

  1. సబ్జెక్ట్‌కు మీ స్క్రీన్ రీడర్‌కు చెందిన "తర్వాత లింక్" నావిగేషన్‌ను ఉపయోగించండి.
  2. లింక్‌ను యాక్టివేట్ చేయడానికి, Enterను నొక్కండి.

యాక్షన్ బటన్‌లను ఉపయోగించండి

సాధారణ HTML వీక్షణలో లాగానే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెసేజ్‌లను ఎంచుకున్న తర్వాత, మెసేజ్‌ల టేబుల్‌కు ముందు యాక్షన్ బటన్‌ల సెట్ కనిపిస్తుంది.

స్టాండర్డ్ వీక్షణలో, టేబుల్ తర్వాత యాక్షన్ బటన్‌లు ఉండవు, అలాగే ఇప్పుడు మెసేజ్‌కు "స్టార్" పెట్టడానికి ప్రతి సంభాషణలో బటన్ ఉంటుంది. ఈ యాక్షన్ బటన్‌లను ఉపయోగించడానికి, టేబుల్ ఎగువ భాగానికి నావిగేట్ చేయండి, ఆపై యాక్షన్ బటన్‌లను పొందడానికి మునుపటి బటన్‌లను నావిగేట్ చేయండి.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెసేజ్‌లలో చర్యలను అమలు చేయడానికి సులభమైన మార్గం:

  1. మెసేజ్‌ను ఎంచుకోవడానికి, చెక్‌బాక్స్‌ను టోగుల్ చేయండి.
  2. సంబంధిత మెనూను తెరవడానికి, Shift + F10ను నొక్కండి.
  3. చర్యను ఎంచుకోవడానికి, మెనూలో, కింది వైపు బాణాన్ని నొక్కండి. 
  4. Enterను నొక్కండి.

చిట్కా: మీ స్క్రీన్ రీడర్ సెట్టింగ్‌లను బట్టి, చర్యను అమలు చేసిన తర్వాత, మీరు వర్చువల్ లేదా బ్రౌజ్ మోడ్‌కు టోగుల్ చేసి, తిరిగి టేబుల్‌కు నావిగేట్ చేయాల్సి ఉంటుంది.

మీరు లేబుల్‌ను "ఇలా లేబుల్ చేయండి" లేదా "ఇక్కడికి తరలించండి" అని ఎంచుకుంటే, ఎంట్రీ ఫీల్డ్‌కు ఫోకస్ తరలించబడుతుంది. లేబుల్‌లోని భాగాన్ని టైప్ చేసి, ఆపై మ్యాచ్‌లను చూడటం కోసం కింది వైపు బాణాన్ని ఉపయోగించండి, లేదా కొత్త లేబుల్ పూర్తి పేరు కోసం టైప్ చేయడాన్ని కొనసాగించండి. లేదా, మీరు "లేబుల్స్‌ను మేనేజ్ చేయండి" ఆప్షన్ కోసం పై వైపు బాణాన్ని నొక్కి, కొత్త లేబుల్‌ను క్రియేట్ చేయవచ్చు.

ఈమెయిల్‌ను చదవండి

మీ స్క్రీన్ రీడర్‌తో ఈమెయిల్‌ను తెరవడానికి Tabను ఉపయోగించి ఆపై Enterను నొక్కడానికి బదులుగా, "తర్వాత లింక్" కమాండ్‌ను ఉపయోగించి, Enterను నొక్కండి. ఈమెయిల్ సబ్జెక్ట్ ఇప్పటికీ లింక్‌గానే ఉంటుంది, కానీ పేజీ చుట్టూ నావిగేట్ చేయడాన్ని సులభతరం చేయడానికి అది ట్యాబ్ నుండి తొలగించబడుతుంది.

మీరు సంభాషణ లిస్ట్‌ను వెబ్ అప్లికేషన్‌గా నావిగేట్ చేస్తే, సంభాషణను చూడటం కోసం కింది వైపు బాణాన్ని ఉపయోగించండి, ఈమెయిల్‌ను తెరవడానికి Enterను నొక్కండి.

వెబ్ అప్లికేషన్ షార్ట్‌కట్‌లతో సంభాషణలో కొత్త మెసేజ్‌లను ఎలా చదవాలో తెలుసుకోవడానికి, ఈమెయిల్‌ను చదవండి అనే విభాగానికి వెళ్లండి. ఆ సంభాషణలను వెబ్ పేజీగా నావిగేట్ చేయడం, చదవడం ఎలాగో కూడా ఆర్టికల్ వివరిస్తుంది.

ఈమెయిల్‌కు రిప్లయి ఇవ్వండి

మీరు ఈమెయిల్‌ను చదివినప్పుడు, ఎగువున, ఈమెయిల్‌ను పంపినవారి హెడింగ్ తర్వాత "రిప్లయి" బటన్ ఉంటుంది. ఈమెయిల్‌ను ఫార్వర్డ్ చేయడానికి, తొలగించడానికి, లేదా దానిలో ఇతర చర్యలను అమలు చేయడానికి, Tabను నొక్కడం ద్వారా "రిప్లయి" బటన్ పక్కన ఉన్న "మరిన్ని" బటన్‌కు వెళ్లి, Enterను నొక్కండి.

ముఖ్య గమనిక: స్టాండర్డ్ వీక్షణలో ఇకపై "క్విక్ రిప్లయి" అందుబాటులో ఉండదు. రిప్లయి ఇవ్వడానికి, ఫార్వర్డ్ చేయడానికి, ఇంకా మరిన్నింటి కోసం ఇప్పుడు అప్లికేషన్ నిర్వచించిన సింగిల్ లెటర్ షార్ట్‌కట్‌లు ఉన్నాయి, పాత షార్ట్‌కట్‌లు ఇకపై అందుబాటులో ఉండవు.

ఈమెయిల్ పంపడానికి అడ్రస్‌ను జోడించండి

మీరు ఈమెయిల్‌కు రిప్లయి ఇచ్చినప్పుడు, ఫార్వర్డ్ చేసినప్పుడు, లేదా కొత్త ఈమెయిల్ రాసినప్పుడు, కొత్త స్వీకర్తను జోడించడానికి పలు మార్గాలు ఉన్నాయి. సెర్చ్ ఫీల్డ్‌లో ఫోకస్ ఉన్నప్పుడు, మీరు పేరు లేదా ఈమెయిల్ అడ్రస్‌లోని కొంత భాగాన్ని టైప్ చేసి, ఆపై మ్యాచ్ అయ్యే వ్యక్తిని చూడటం కోసం కింది వైపు బాణాన్ని ఉపయోగించవచ్చు. ఆ వ్యక్తి మీ కాంటాక్ట్‌లు, సేకరించిన అడ్రస్‌లు, లేదా కంపెనీ డైరెక్టరీలో ఉన్నవారు కావచ్చు.

  • ఫోకస్‌ను "CC" ఫీల్డ్‌కు తరలించడానికి, Ctrl + Shift + c షార్ట్‌కట్‌ను నొక్కండి.
  • "BCC" ఫీల్డ్‌కు తరలించడానికి, Ctrl + Shift + b షార్ట్‌కట్‌ను నొక్కండి.

ట్యాబ్ క్రమంలో, సెర్చ్ ఫీల్డ్‌లకు ముందు "To", "CC", ఇంకా "BCC" బటన్‌లు కూడా ఉంటాయి. మీరు ఈ బటన్‌లను యాక్టివేట్ చేసినప్పుడు, అది ఫీల్డ్‌ను ఆటో-ఫిల్ చేయడానికి ఉపయోగించగల "కాంటాక్ట్‌లను ఎంచుకోండి" అనే డైలాగ్‌ను డిస్‌ప్లే చేస్తుంది.

మీరు సెర్చ్ ఫీల్డ్‌కు కాంటాక్ట్‌ను జోడించిన తర్వాత, అది తొలగించగల, ఎడిట్ చేయడానికి యాక్టివేట్ చేయగల బటన్‌గా మారుతుంది. అడ్రస్‌లోని ప్రతి అక్షరం ద్వారా నావిగేట్ చేయడానికి బదులుగా, ఎడమ వైపు, కుడి వైపు బాణం 'కీ'లు ప్రతి కాంటాక్ట్‌కు నావిగేట్ చేస్తాయి.

మీరు మెసేజ్ బాడీలో స్వీకర్తను జోడించారని ఉద్ఘాటించడానికి.

  1. పేరు లేదా ఈమెయిల్ అడ్రస్‌లోని కొంత భాగం తర్వాత ప్లస్ చిహ్నాన్ని ఎంటర్ చేయండి.
  2. మ్యాచ్ అయ్యే వ్యక్తిని చూడటం కోసం కింది వైపు బాణాన్ని ఉపయోగించండి.
    • మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్, లింక్‌గా మారి, మీ స్వీకర్తను "To" లైన్‌కు జోడిస్తుంది.

చిట్కా: ఎవరినైనా "CC" లైన్‌కు జోడించడానికి, ప్లస్ చిహ్నం స్థానంలో @ చిహ్నాన్ని ఉపయోగించవచ్చు.

కొత్త ఈమెయిల్ రాయండి

వెబ్ అప్లికేషన్ షార్ట్‌కట్‌ల కోసం, కొత్త ఈమెయిల్ రాయండి & ఈమెయిల్స్‌కు రిప్లయి ఇవ్వండి అనే విభాగానికి వెళ్లండి.

మీరు Gmailను వెబ్ పేజీగా నావిగేట్ చేస్తే, "కొత్త ఈమెయిల్ రాయండి" అనేది "నావిగేషన్" ల్యాండ్‌మార్క్ (ఏరియా)లో మొదటి బటన్. 

మీరు కొత్త ఈమెయిల్ రాసిన తర్వాత:

  • ఈమెయిల్‌ను పంపడానికి, Ctrl + Enterను నొక్కండి.
  • డ్రాఫ్ట్‌ను విస్మరించడానికి, Ctrl + Shift + d నొక్కండి.

మెసేజ్ దిగువున, "పంపండి", "విస్మరించండి" అనేవి బటన్‌లుగా అందుబాటులో ఉంటాయి. "పంపండి", "విస్మరించండి" బటన్‌ల మధ్య అదనపు ఫార్మాటింగ్ ఆప్షన్ బటన్‌లను కూడా మీరు యాక్సెస్ చేయవచ్చు.

సెర్చ్ చేయండి, ఫిల్టర్ చేయండి

అదనపు చిట్కాల కోసం, మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయండి అనే విభాగానికి వెళ్లండి.

మీ స్క్రీన్ రీడర్‌తో, సెర్చ్ ఫీల్డ్‌కు నావిగేట్ చేయడానికి, "మునుపటి ఎడిట్ ఫీల్డ్" కమాండ్‌ను ఉపయోగించండి.

"సెట్టింగ్‌ల"లోని "ఫిల్డర్ చేయండి" విభాగానికి లింక్‌ను ఉపయోగించడానికి బదులుగా, మీరు స్టాండర్డ్ వీక్షణలో సెర్చ్‌ను ఫిల్టర్‌గా మార్చవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11621640074247959712
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false