Gmailలో ఈవెంట్‌లను షెడ్యూల్ చేయండి

Gmailలో ఎవరితోనైనా నేరుగా కలవడానికి ఈవెంట్‌లను షెడ్యూల్ చేయండి, అలాగే మీటింగ్ సమయాలను చర్చించండి.

Gmail మెసేజ్ నుండి ఈవెంట్‌ను క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. ఎగువన, మెసేజ్ పైన ఉన్న, మరిన్ని ఆ తర్వాత ఈవెంట్‌ను క్రియేట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీ బ్రౌజర్‌లో Calendar కోసం కొత్త ట్యాబ్ తెరవబడుతుంది.
  4. ఈవెంట్ టైటిల్, ఆహ్వానితులు, సమయం, అలాగే ఇతర వివరాలను నిర్ధారించండి.
    • Calendar:
      • ఈవెంట్‌ను క్రియేట్ చేయండి.
      • Gmail సబ్జెక్ట్, మెసేజ్ టెక్స్ట్‌ను కాపీ చేస్తుంది.
      • ఆటోమేటిక్‌గా Gmail మెసేజ్‌లో స్వీకర్తను ఆహ్వానితులుగా జోడిస్తుంది.
    • మరింత మంది వ్యక్తులను ఆహ్వానించడానికి, వారి ఈమెయిల్ అడ్రస్‌లను జోడించండి.
  5. పూర్తయిన తర్వాత, సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: ఈవెంట్ టైటిల్, వివరణ Gmail సబ్జెక్ట్, ఈమెయిల్ మెసేజ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.

Gmail మెసేజ్‌లో ఈవెంట్‌ను క్రియేట్ చేయండి & ఇన్‌సర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఈమెయిల్‌ను క్రియేట్ చేయండి లేదా దానికి రిప్లయి ఇవ్వండి.
  3. దిగువున, మీట్ అవడానికి సమయాన్ని సెటప్ చేయండి ఆ తర్వాత ఈవెంట్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: మీట్ అవడానికి సమయాన్ని సెటప్ చేయండి అనే ఆప్షన్‌ను కనుగొనలేకపోతే, దిగువున, మరిన్ని ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. కుడి వైపున, ఈవెంట్ టైటిల్‌ను, ఆహ్వానితులను, సమయం ఇంకా ఇతర వివరాలను నిర్ధారించండి.
    • Calendar:
      • ఈవెంట్‌ను క్రియేట్ చేయండి.
      • ఈవెంట్ టైటిల్‌గా Gmail సబ్జెక్ట్‌ను ఉపయోగిస్తుంది.
      • ఆటోమేటిక్‌గా Gmail మెసేజ్‌లో స్వీకర్తను ఆహ్వానితులుగా జోడిస్తుంది.
    • మరింత మంది వ్యక్తులను ఆహ్వానించడానికి, వారి ఈమెయిల్ అడ్రస్‌లను జోడించండి.
  5. సేవ్ చేయండి ఆ తర్వాత పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • ఈవెంట్‌కు సంబంధించిన సారాంశం ఈమెయిల్ మెసేజ్‌కు ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది.
  • మీరు మెసేజ్ నుండి ఈవెంట్ సారాంశాన్ని తొలగిస్తే, Calendar నుండి ఈవెంట్ తొలగించబడదు.

మీట్ కావడానికి అందుబాటులో ఉన్న సమయాలను Gmail మెసేజ్‌లో ఆఫర్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఈమెయిల్‌ను క్రియేట్ చేయండి లేదా దానికి రిప్లయి ఇవ్వండి.
  3. మీ మెసేజ్ దిగువున ఉన్న, మీట్ అయ్యే సమయాన్ని సెటప్ చేయండి ఆ తర్వాత మీరు ఖాళీగా ఉండే సమయాలను ఆఫర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    చిట్కా: మీరు 'మీట్ అయ్యే సమయాన్ని సెటప్ చేయండి' అనే ఆప్షన్‌ను కనుగొనలేకపోతే , మరిన్ని ఆప్షన్‌లు ను క్లిక్ చేయండి.
  4. కుడి వైపున, ఈవెంట్ వ్యవధిని ఎంచుకోండి.
  5. క్యాలెండర్ గ్రిడ్‌లో పలు సమయాలను ఎంచుకోండి. మీరు వేర్వేరు రోజులలో సమయాలను ఎంచుకోవచ్చు.
  6. తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. ఈవెంట్ టైటిల్‌ను జోడించండి.
    • వివరాలను జోడించడానికి "మరింత సమాచారం" అనే బాక్స్‌ను విస్తరించండి.
  8. ఈమెయిల్‌కు జోడించండి ఆ తర్వాత పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • స్వీకర్త ఈవెంట్ కోసం సమయాన్ని ఎంచుకున్నప్పుడు, ఈవెంట్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయబడి, మీ క్యాలెండర్‌కు జోడించబడుతుంది. ఈవెంట్ వివరాలతో కూడిన నిర్ధారణ ఈమెయిల్ కూడా పంపబడుతుంది.

      ముఖ్యమైనది: ఈ ఫీచర్ 1:1 మీటింగ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ ఈమెయిల్‌లో పలు స్వీకర్తలు కాపీ చేయబడితే, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే మొదటి వ్యక్తి మాత్రమే ఈవెంట్‌కు జోడించబడతారు. అదనపు పార్టిసిపెంట్‌లను తప్పనిసరిగా విడిగా జోడించాలి.

చిట్కాలు:

  • మీరు మీట్ అవ్వడానికి అందుబాటులో ఉన్న సమయాలను అందిస్తే, ఇతరులు బుకింగ్ పేజీ ద్వారా వాటిని 30 రోజుల పాటు చూడవచ్చు, బుక్ చేసుకోవచ్చు.
  • ఈవెంట్ అనుమతులు ఆటోమేటిక్‌గా "గెస్ట్ లిస్ట్‌ను చూడండి"కి సెట్ చేయబడతాయి. స్వీకర్త ఈవెంట్‌ను నిర్ధారించిన తర్వాత మీరు గెస్ట్ అనుమతులను సవరించవచ్చు.
  • Gmail మెసేజ్‌లో ప్రతిపాదిత సమయాలు ఈవెంట్ క్రియేటర్ టైమ్‌జోన్‌లో చూపబడతాయి. బుకింగ్ పేజీలో, సమయాలు స్వీకర్త టైమ్‌జోన్‌లో చూపబడతాయి. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత, Calendarలో ఈవెంట్ లోకల్ టైమ్ జోన్‌లో చూపబడుతుంది. ఆపై, ప్రతి పార్టిసిపెంట్ టైమ్‌జోన్‌లో ఈవెంట్ వివరాలతో కూడిన నిర్ధారణ ఈమెయిల్స్ పంపబడతాయి.
  • మీ ప్రాథమిక క్యాలెండర్‌లో మాత్రమే బుక్ చేసిన సమయాలు షెడ్యూల్ చేయబడతాయి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3702718217434341130
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false