మెయిల్ విలీనం ఫీచర్‌తో వ్యక్తిగతీకరించిన ఈమెయిల్స్‌ను పంపండి

మీరు Gmailలో మెయిల్ విలీనం ఫీచర్‌ను ఉపయోగించి, ఎక్కువ సంఖ్యలో యూజర్‌లకు, వ్యక్తిగతీకరించిన ఈమెయిల్ క్యాంపెయిన్‌లను, న్యూస్ లెట‌ర్‌లను ఇంకా అనౌన్స్‌మెంట్‌లను పంపవచ్చు.

ముఖ్యమైనది: మెయిల్ విలీనం ఫీచర్, Gmailలో మల్టీ-సెండ్ మోడ్‌ను రీప్లేస్ చేస్తుంది. ఒక మెసేజ్‌ను కంపోజ్ చేస్తున్నప్పుడు, "వీరికి:" అనే లైన్ పక్కనున్న, 'మెయిల్ విలీనం‌ను ఉపయోగించండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మెయిల్ విలీనం ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి

Gmailలో 'మెయిల్ విలీనం'

  • మెయిల్ విలీనం ఫీచర్, @మొదటిపేరు ఇంకా @చివరిపేరు వంటి విలీనం ట్యాగ్‌లతో మీరు మెసేజ్‌లను వ్యక్తిగతీకరించడానికి వీలు కల్పిస్తుంది. మీరు మెసేజ్‌ను పంపినప్పుడు, ప్రతి స్వీకర్త ఒక ఈమెయిల్ కాపీని విడిగా అందుకుంటారు, దీనిలో విలీనం ట్యాగ్‌లు మీ వివరాలతో రీప్లేస్ చేయబడతాయి.
  • స్వీకర్తలు, మీరు ఇంకా ఎవరెవరికి మెసేజ్‌ను పంపారో, చెక్ చేయలేరు. సంభాషణలను సులభంగా మేనేజ్ చేయడానికి, మీరు ప్రత్యేక థ్రెడ్‌లలో స్వీకర్త రిప్లయి‌లను పొందుతారు.
  • మీకు పెద్ద మొత్తంలో స్వీకర్తలు ఉన్నట్లయితే, మీరు వారి కాంటాక్ట్ సమాచారాన్ని కలిగి ఉన్న స్ప్రెడ్‌షీట్‌ను లింక్ చేయవచ్చు. స్ప్రెడ్‌షీట్‌లోని ఏదైనా నిలువు వరుసను మీ మెసేజ్‌లో విలీనం ట్యాగ్‌గా ఉపయోగించవచ్చు. ఇది మీ మెసేజ్‌ను వ్యక్తిగతీకరించడానికి ప్రతి స్వీకర్త కోసం అనుకూల వివరాలను కలిగి ఉంటుంది.

మెయిల్ విలీనం కోసం మీ అర్హతను చెక్ చేసుకోండి

మెయిల్ విలీనంను ఉపయోగించడానికి, అర్హత ఉన్న Google Workspace ప్లాన్‌తో ఖాతాకు సైన్ ఇన్ చేయండి:

  • Workspace Individual
  • Business Standard
  • Business Plus
  • Enterprise Standard
  • Enterprise Plus
  • Education Standard
  • Education Plus

మీ మెసేజ్‌కు నేరుగా స్వీకర్తలను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున, కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు ఇప్పటికే ఉన్న డ్రాఫ్ట్‌ను కూడా తెరవవచ్చు.
  3. "వీరికి:" అనే లైన్‌లో, స్వీకర్త‌లను జోడించండి.
  4. "వీరికి:" అనే లైన్‌కు కుడి వైపు, 'మెయిల్ విలీనం‌ను ఉపయోగించండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మెయిల్ విలీనం అనే ఫీచర్‌ను ఆన్ చేయండి.
  6. మీ మెసేజ్‌లో, @ అనే చిహ్నాన్ని ఎంటర్ చేయండి.
  7. విలీనం ట్యాగ్‌ను ఎంచుకోండి:
    • @మొదటి పేరు
    • @చివరి పేరు
    • @పూర్తిపేరు
    • @ఈమెయిల్
  8. విలీనం ట్యాగ్‌ను ఇన్‌సర్ట్ చేయడానికి, Enter కీని నొక్కండి.

చిట్కాలు:

  • మీ మెసేజ్ సరైన స్వీకర్త పేరును ఉపయోగిస్తుందని నిర్ధారించుకోవడానికి, Google Contactsలో వారి పేరును చెక్ చేయండి.
  • ఒకరి కంటే ఎక్కువమంది స్వీకర్తలను జోడించడానికి, Google Contactsలో, గ్రూప్ స్వీకర్తలలో ఒక లేబుల్‌ను క్రియేట్ చేయండి. మీరు Gmailలోని "వీరికి:" అనే లైన్‌లో లేబుల్‌ను జోడించినప్పుడు, గ్రూప్ చేయబడిన స్వీకర్తలు ఆటోమేటిక్‌గా ఆటో-ఫిల్ చేయబడతారు. లేబుల్స్‌తో కూడిన కాంటాక్ట్‌లను ఆర్గనైజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
  • ఒకవేళ స్వీకర్త Google Contactsలో లేకుంటే, మెయిల్ విలీనం అనేది, మీరు "వీరికి:" అనే లైన్‌లో ఎంటర్ చేసిన దాని ఆధారంగా మొదటి పేరును, చివరి పేరును ఆటో-ఫిల్ చేస్తుంది.
    • ఉదాహరణకు, మీరు “Lisa Rodriguez <lisa@example.com>” అనే పేరును స్వీకర్తగా ఎంటర్ చేస్తే, Gmail దానిలో, “Lisa”ను @మొదటిపేరుగా, “Rodriguez”ను @చివరిపేరుగా ఉపయోగిస్తుంది.

మీ మెసేజ్‌కు స్ప్రెడ్‌షీట్ నుండి స్వీకర్తలను జోడించండి

ముఖ్యమైనది: కాంటాక్ట్ సమాచారం తప్పనిసరిగా మీ స్ప్రెడ్‌షీట్‌లోని మొదటి ట్యాబ్‌లో ఉండాలి, ఆ సమాచారంలో టెక్స్ట్‌ మాత్రమే ఉండాలి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున, కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు ఇప్పటికే ఉన్న డ్రాఫ్ట్‌ను కూడా తెరవవచ్చు.
  3. "వీరికి:" అనే లైన్‌కు కుడి వైపు, 'మెయిల్ విలీనం‌ను ఉపయోగించండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మెయిల్ విలీనం అనే ఫీచర్‌ను ఆన్ చేయండి.
  5. స్ప్రెడ్‌షీట్ నుండి జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. స్ప్రెడ్‌షీట్‌ను ఎంచుకోండి.
  7. ఇన్‌సర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  8. విండో‌లో, మీ స్ప్రెడ్‌షీట్ నుండి స్వీకర్త సమాచారం ఉన్న నిలువు వరుసలను ఎంచుకోండి:
    • ఈమెయిల్
    • మొదటి పేరు
    • చివరి పేరు (ఆప్షనల్)
  9. పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీ స్ప్రెడ్‌షీట్, మెసేజ్‌లోని “వీరికి:” అనే లైన్‌కు జోడించబడుతుంది.
  10. మీ మెసేజ్‌లో, @ అనే చిహ్నాన్ని ఎంటర్ చేయండి.
  11. విలీనం ట్యాగ్‌ను ఎంచుకోండి.
    • విలీనం ట్యాగ్‌లు, మీ స్ప్రెడ్‌షీట్‌లోని నిలువు వరుస హెడర్‌ల ద్వారా గుర్తించబడతాయి.
  12. విలీనం ట్యాగ్‌ను ఇన్‌సర్ట్ చేయడానికి, Enter కీని నొక్కండి.

చిట్కా: స్వీకర్త సమాచారం కోసం స్ప్రెడ్‌షీట్‌ను మీరు ఉపయోగిస్తున్నప్పుడు, మీ నిలువు వరుస హెడర్‌లలో, ఈమెయిల్ అడ్రస్‌లలో ఉపయోగించిన టెక్స్ట్ అక్షరాలను చెక్ చేయండి.

  • ఒకవేళ నిలువు వరుసలో పేరు, లెటర్‌లు లేదా నంబర్‌లు కాకుండా ప్రత్యేక అక్షరాలు ఉంటే, మీరు Gmailలోని సంబంధిత విలీనం ట్యాగ్, దాని పొజిషన్ ద్వారా గుర్తించవచ్చు. ఉదాహరణకు, మొదటి నిలువు వరుస “@A” అని పిలవబడుతుంది.
  • ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లు చెల్లనివిగా పరిగణించబడతాయి.

విలీనం ట్యాగ్‌ల కోసం, ఆటోమేటిక్ సెట్టింగ్ విలువల గురించి తెలుసుకోండి

విలీనం ట్యాగ్‌కు సంబంధించి, మిస్ అయిన సమాచారంతో కూడిన స్వీకర్తను మీరు కలిగి ఉంటే, మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఉదాహరణకు, మీరు “Sam <sam@example.com>”కు ఈమెయిల్‌ను పంపడానికి ట్రై చేస్తూ, @మొదటిపేరు లేదా @చివరిపేరు విలీనం ట్యాగ్‌ను ఉపయోగిస్తుంటే, మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే "Sam" అనేది ఆ వ్యక్తి మొదటి పేరు లేదా చివరి పేరు అని Gmail ఖచ్చితంగా నిర్ధారించలేదు.

ఇలాంటి సందర్భంలో, మీరు ఇలా చేయవచ్చు:

  • ఎర్రర్ మెసేజ్‌లో ఆటోమేటిక్ సెట్టింగ్ విలువను ఎంటర్ చేయండి.
    • ఉదాహరణకు, మొదటి పేరు ఉండని స్వీకర్తలకు, “హాయ్ @మొదటిపేరు”ను “హాయ్ ఫ్రెండ్” అని ఉపయోగించవచ్చు.
  • తిరిగి డ్రాఫ్ట్‌కు వెళ్లి, ఇలా చేయండి:
    • Google Contactsలోని "వీరికి:" అనే లైన్‌లో, లేదా మీరు లింక్ చేసిన స్ప్రెడ్‌షీట్‌లో మిస్ అయిన విలువను జోడించండి.
    • "వీరికి:" అనే లైన్ లేదా మీరు లింక్ చేసిన స్ప్రెడ్‌షీట్ నుండి మిస్ అయిన విలువలతో ఉన్న ఎవరైనా స్వీకర్తను తీసివేయండి.

మీరు పంపిన మెసేజ్‌లను కనుగొనండి

మీరు పంపిన మెసేజ్‌లను కనుగొనడానికి, Gmailలో "పంపినవి" అనే ఫోల్డర్‌ను తెరవండి. మెసేజ్‌లో, మీకు "మెయిల్ విలీనం ద్వారా పంపబడింది" అనే బ్యానర్‌ కనిపిస్తుంది.

పంపడంపై పరిమితులను అర్థం చేసుకోండి
మెయిల్ విలీనంతో, మీరు వీటిని చేయవచ్చు:
  • మీరు ప్రతి మెసేజ్‌కు, "వీరికి" అనే లైన్‌లో గరిష్ఠంగా 1,500 మంది స్వీకర్తలను జోడించవచ్చు
  • మీరు రోజుకు, గరిష్ఠంగా 1,500 మంది స్వీకర్తలకు ఈమెయిల్స్‌ను పంపవచ్చు
    • మెయిల్ విలీనం ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా, మీరు ఒక మెసేజ్‌ను 1,000 మంది స్వీకర్తలకు, మరొక మెసేజ్‌ను 500 మంది స్వీకర్తలకు పంపవచ్చు.
ఆఫీస్, పాఠశాల ఇంకా Workspace Individual ఖాతాలు రోజుకు గరిష్ఠంగా 2,000 మెసేజ్‌లకు పరిమితం చేయబడ్డాయి, కాబట్టి మీరు మెయిల్ విలీనం ఫీచర్ ద్వారా రోజుకు గరిష్టంగా 1,500 మంది స్వీకర్తలకు మెసేజ్‌లను పంపవచ్చు, అంతే కాకుండా రోజుకు మరో 500 సాధారణ మెసేజ్‌లను పంపవచ్చు.
మీరు మెయిల్ విలీనంతో, ఒక నెలకు నిర్దిష్టంగా ఎంతమంది స్వీకర్తలను కాంటాక్ట్ చేయవచ్చు అనేదానిపై ఎలాంటి పరిమితి లేదు.
cc, ఇంకా bcc స్వీకర్తల విషయంలో సెట్ చేసిన పరిమితులను అర్థం చేసుకోండి
మెయిల్ విలీనం ఫీచర్‌తో కూడిన ప్రతి మెసేజ్‌లో "Cc" లేదా "Bcc" ఫీల్డ్‌లో మీరు ఒక స్వీకర్తను మాత్రమే చేర్చగలరు. "cc" లేదా "bcc" ఫీల్డ్‌లో ఎవరైనా స్వీకర్తను జోడిస్తే, వారి పేరు ప్రతి ఒక్క అవుట్‌గోయింగ్ ఈమెయిల్‌లో కాపీ చేయబడుతుంది.
  • ఉదాహరణకు, మీరు "Bcc"లో "support@company.com" ఈమెయిల్ అడ్రస్‌ను ఉంచి 500 మంది స్వీకర్తలకు ఒక మెసేజ్‌ను పంపితే, "support@company.com" అనే ఈమెయిల్ అడ్రస్‌కు, ఆ మెసేజ్‌కు సంబంధించి 500 కాపీలు అందుతాయి. ఈ మెసేజ్ విషయానికి వస్తే, మీరు ఒకరోజుకు పంపగల ఈమెయిల్స్ కోటా నుండి 1,000 ఉపయోగించినట్లు అవుతుంది, ఎందుకంటే "cc" లేదా "bcc" ఫీల్డ్‌లో జోడించబడిన స్వీకర్తలకు పంపే ఈమెయిల్స్ కూడా మీ రోజువారీ పంపే పరిమితిలో భాగంగానే లెక్కించబడతాయి.
ముఖ్యమైనది: మీరు స్ప్రెడ్‌షీట్ నుండి స్వీకర్తలను జోడించినట్లయితే, మీ మెసేజ్‌కు "Cc" లేదా "Bcc" ఫీల్డ్‌లలో స్వీకర్తలను జోడించలేరు.
సబ్‌స్క్రిప్షన్ తీసివేయబడిన స్వీకర్తలు
మీరు మెయిల్ విలీనం ఫీచర్‌ను ఆన్ చేసినప్పుడు, ప్రతి ఈమెయిల్ కింద, ప్రత్యేకంగా ఒక సబ్‌స్క్రిప్షన్ తీసివేసే లింక్ ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. స్వీకర్తలు, ఈ లింక్‌ను ఉపయోగించి మీ ఈమెయిల్స్‌కు చేసుకొన్న సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయవచ్చు లేదా తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.
ఎవరైనా స్వీకర్త, మీ ఈమెయిల్స్‌కు చేసుకొన్న సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసినప్పుడు లేదా తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు, మీకు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ అందుతుంది. కానీ మీరు, సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసిన స్వీకర్తలందరి లిస్ట్‌ను మాత్రం పొందలేరు.
మీరు ఒక మెసేజ్‌ను పంపిన తర్వాత, కనిపించే నిర్ధారణ బాక్స్‌లో, సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసిన కారణంగా ఈ ఈమెయిల్‌ను అందుకోలేని మొత్తం స్వీకర్తల సంఖ్య మీకు కనిపిస్తుంది.
ముఖ్యమైనది: సబ్‌స్క్రిప్షన్ తీసివేయబడిన స్వీకర్తలు, ఇప్పటికీ మీ నుండి పంపిన మెసేజ్‌లను 'మెయిల్ విలీనం' ఫీచర్‌ను ఆన్ చేయకుండానే అందుకోగలరు లేదా అదే డొమైన్‌లోని ఇతర ఖాతాల నుండి మెయిల్ విలీనంతో పంపబడిన మెసేజ్‌లను అందుకోగలరు. ఉదాహరణకు, వారు "support@company.com" నుండి సబ్‌స్క్రిప్షన్ తీసివేసినప్పటికీ, "marketing@company.com" నుండి వచ్చే ఈమెయిల్స్‌ను అందుకోగలరు.
మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే:
  • యూజర్ ఖాతాను తొలగించినప్పుడు, మేము సబ్‌స్క్రిప్షన్ తీసివేయబడిన యూజర్‌ల డేటాను విస్మరించము.
  • స్వీకర్తలు తమ సంస్థలోని పంపినవారి నుండి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయలేరు.
మీ మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించకుండా ఎలా నివారించాలి
మీరు ఒకేసారి బల్క్‌లో ఈమెయిల్స్‌ను పంపుతున్నప్పుడు, మీ స్వీకర్త ఇన్‌బాక్స్‌ను గౌరవించే విధంగా ఉండే బెస్ట్ ప్రాక్టీసులను ఫాలో అవ్వడం ఎంతో ముఖ్యం, అలాగే మీ స్థానిక నియంత్రణ చట్టాలను, Gmail పాలసీలను ఫాలో కావడం చాలా ముఖ్యం.
సమర్థవంతమైన ఈమెయిల్ క్యాంపెయిన్‌ను రన్ చేయడానికి, మీరు పంపే మెసేజ్‌ల ద్వారా మీకు, మీ గ్రహీతలకు మధ్య ఒక అర్థవంతమైన సంబంధం ఏర్పడాలి. బల్క్ ఈమెయిల్ బెస్ట్ ప్రాక్టీసుల గురించి మరింత తెలుసుకోండి.
మెయిల్ విలీనం పరిమితులను అర్థం చేసుకోండి
కింద పేర్కొన్న రకాల మెసేజ్‌లతో మెయిల్ విలీనాన్ని ఉపయోగించడం సాధ్యం కాదు:
  • రిప్లయి ఇవ్వండి
  • ఫార్వర్డ్ చేయండి
  • పంపడాన్ని షెడ్యూల్ చేయండి
  • కాన్ఫిడెన్షియల్ మోడ్
మీరు ఒక అటాచ్‌మెంట్‌ను జోడిస్తే, ఆ అటాచ్‌మెంట్ ప్రతి స్వీకర్త మెసేజ్ కాపీలో చేర్చబడుతుంది. ఈ కారణంగా, అవి చాలా స్టోరేజ్ స్పేస్‌ను తీసుకోవచ్చు.
  • ఉదాహరణకు, మీరు 10MB అటాచ్‌మెంట్‌తో 500 మంది స్వీకర్తలకు మెసేజ్‌ను పంపితే, మీరు మీ స్టోరేజ్‌లో దాదాపు 5GBని ఉపయోగించాలి.

చిట్కా: స్టోరేజ్ స్పేస్‌ను సేవ్ చేయడానికి, ఫైల్‌ను అటాచ్ చేయకుండా, Google Driveకు అప్‌లోడ్ చేసి, మీ మెసేజ్‌లో దాని లింక్‌ను చేర్చండి. Google Drive నుండి ఫైల్స్‌ను షేర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీరు వీటిలో విలీనం ట్యాగ్‌లను ఉపయోగించలేరు:
  • సబ్జెక్ట్ లైన్‌లు
  • హైపర్‌లింక్ చేసిన టెక్స్ట్

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18178960958494644951
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false