మీ Gmail బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చండి

మీరు Gmail బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి ఒక థీమ్‌ను ఎంచుకోవచ్చు. కంప్యూటర్‌లో, ఈ కింది వాటిని మీ బ్యాక్‌గ్రౌండ్‌గా తయారు చేసుకోవచ్చు: 

  • ఆటోమేటిక్ సెట్టింగ్ థీమ్
  • డార్క్ థీమ్
  • అందుబాటులో ఉన్న ఇతర థీమ్‌లు
  • మీ Google Photosకు ఒక ఫోటో అప్‌లోడ్ చేయబడింది

ముఖ్య గమనికలు:

  • మీ బ్యాక్‌గ్రౌండ్‌గా, అప్‌లోడ్ చేసిన ఫోటోను ఉపయోగించడానికి, Google Photosకు ఫోటోను జోడించండి. ఫోటోలను, వీడియోలను ఎలా బ్యాకప్ చేయాలో తెలుసుకోండి.
  • కొన్ని థీమ్‌లు, టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి, మూలలను డార్క్‌గా చేయడానికి లేదా బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ఆప్షన్‌లు అందుబాటులో లేకపోతే, మీరు ఎంచుకున్న థీమ్‌కు మార్పులు చేయలేరు.
  • బ్యాటరీని ఆదా చేయడానికి, మొబైల్‌లో మెసేజ్‌లను చూడటాన్ని సులభతరం చేయడానికి, డార్క్ థీమ్‌కు మార్చండి.

బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. "థీమ్" పక్కనున్న, అన్నీ చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. థీమ్ విండోలో, ఒక థీమ్‌ను ఎంచుకోండి. 
    • ఆటోమేటిక్ సెట్టింగ్ థీమ్ కోసం, ఆటోమేటిక్ సెట్టింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • డార్క్ థీమ్ కోసం, డార్క్‌ను ఎంచుకోండి.
    • ముందుగా అప్‌లోడ్ చేసిన థీమ్ కోసం, ఏదైనా థీమ్‌ను ఎంచుకోండి.
  5. ఆప్షనల్: అందుబాటులో ఉంటే, థీమ్ విండో దిగువున, మీరు థీమ్‌ను మార్చవచ్చు. 
    • టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి, టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ Text Backgroundను క్లిక్ చేయండి.
    • మూలలను డార్క్ చేయడానికి, రూపచిత్రణను Vignette క్లిక్ చేయండి.
    • బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ను బ్లర్ చేయడానికి, బ్లర్ Blur ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ బ్యాక్‌గ్రౌండ్‌గా ఫోటోను సెట్ చేయండి

ప్రారంభించడానికి, మీరు కొత్త లేదా ఇప్పటికే ఉన్న ఆల్బమ్‌లో ఉపయోగించాలనుకుంటున్న ఇమేజ్‌ను photos.google.comలో అప్‌లోడ్ చేశారని నిర్ధారించుకోండి. Google Photosతో ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmail‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. "థీమ్" పక్కన ఉన్న, అన్నీ చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. థీమ్ విండో‌కు దిగువున ఎడమ వైపు ఉన్న, నా ఫోటోలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ విండోలో, ఫీచర్ చేయబడినవి లేదా నా ఫోటోలు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. ఒక ఫోటోను ఎంచుకోండి.
    • ఫోటో బ్లర్‌గా కనిపిస్తే, పెద్ద ఫోటోను ఎంపిక చేసుకోండి.
  7. దిగువున ఎడమ వైపున ఉన్న, ఎంచుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  8. ఆప్షనల్: థీమ్ విండో దిగువున, మీరు థీమ్‌ను మార్చవచ్చు.
    1. టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి, టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ Text Backgroundను క్లిక్ చేయండి.
    2. మూలలను డార్క్ చేయడానికి, రూపచిత్రణను Vignette క్లిక్ చేయండి.
    3. బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ను బ్లర్ చేయడానికి, బ్లర్ Blurను క్లిక్ చేయండి.
  9. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత ఆర్టికల్

మీ Gmail ప్రొఫైల్‌లలో ఫోటోను మార్చడం

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5490042444079204227
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false