బల్క్ ఈమెయిల్ బెస్ట్ ప్రాక్టీసుల గురించి తెలుసుకోండి

మీరు వాణిజ్యపరమైన లేదా బల్క్ ఈమెయిల్‌లను పంపినప్పుడు, మీ గ్రహీత ఇన్‌బాక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బెస్ట్ ప్రాక్టీసులను అనుసరించడం, అలాగే స్థానిక నిబంధనలు, Gmail పాలసీలను అనుసరించడం ముఖ్యం.

సమర్థవంతమైన ఈమెయిల్ క్యాంపెయిన్‌ను రన్ చేయాలంటే, మీరు పంపే మెసేజ్‌లు మిమ్మల్ని, మీ గ్రహీతలను అర్ధవంతమైన మార్గంలో కనెక్ట్ చేయాలి. మీ బల్క్ ఈమెయిల్స్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి సిఫార్సుల కోసం దిగువున చెక్ చేయండి.

మీ స్వీకర్తల సమ్మతిని పొందండి

అనేక దేశాలు, ప్రాంతాల్లో, మీరు కస్టమర్‌లకు వాణిజ్యపరమైన ఈమెయిల్స్‌ను పంపే ముందు వారి సమ్మతిని పొందాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీరు వారికి ఈమెయిల్‌ను పంపే ముందు, కస్టమర్‌లు మీ ఈమెయిల్స్‌ను ఎంచుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం ద్వారా లేదా మీ ఈమెయిల్ లిస్ట్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోనివ్వడం ద్వారా వారి స్పష్టమైన సమ్మతిని పొందడం ఉత్తమం.

చాలా దేశాలు, ప్రాంతాల్లో స్వీకర్తలు సబ్‌స్క్రిప్షన్ తీసివేయడానికి వీలుండే విధంగా కూడా ఆవశ్యకతలు ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయడానికి, బిల్ట్ ఇన్‌గా ఉండే ఆప్షన్ ఉన్న వాణిజ్యపరమైన లేదా బల్క్ ఈమెయిల్స్‌ను పంపడానికి మీరు మెయిల్ విలీనం ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. మెయిల్ విలీనం గురించి మరింత తెలుసుకోండి.

చిట్కా: ఆర్డర్ నిర్ధారణలు, రసీదు మెసేజ్‌లు వంటి నిర్దిష్ట రకాల మెసేజ్‌ల నుండి కస్టమర్‌లు సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయలేరని గుర్తుంచుకోండి.

వర్తించే SPAM చట్టాలను ఫాలో చేయండి

అనేక దేశాలు, ప్రాంతాలలో, పంపినవారిని గుర్తించడానికి వాణిజ్యపరమైన, బల్క్ ఈమెయిల్స్‌లో తప్పనిసరిగా సమాచారం ఉండాలి.

మీరు Gmail లేఅవుట్‌లను ఉపయోగించే Google Workspace Individual సబ్‌స్క్రయిబర్ అయితే, మీరు వీటిని చేర్చడానికి ఫుటర్ కంటెంట్‌ను అనుకూలంగా మార్చవచ్చు:

  • బిజినెస్ పేరు
  • బిజినెస్ అడ్రస్
  • ఫోన్ నంబర్

Gmail లేఅవుట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మోసపూరిత కంటెంట్‌ను నివారించండి

మోసం అనేది ఖచ్చితంగా Gmail పాలసీకి విరుద్ధం, అలాగే దానిని ఆచరించే ప్రయత్నాలకు మేము వ్యతిరేకమని గట్టిగా చెబుతున్నాము. వాణిజ్యపరమైన లేదా బల్క్ ఈమెయిల్‌లు, వీటికి సంబంధించి మోసపూరితమైన మెసేజ్‌లను పంపడాన్ని నివారించాలి:

  • సబ్జెక్ట్ లైన్‌లు, కంటెంట్
  • మెసేజ్ శీర్షికలు
  • పంపేవారి పేర్లు
  • రిప్లయి పంపాల్సిన అడ్రస్‌లు

అవాంఛిత ఈమెయిల్‌ల నుండి సబ్‌స్క్రిప్షన్ తీసివేయడానికి వాటిని పొందే వ్యక్తులను అనుమతించండి

అనేక దేశాలు, ప్రాంతాల్లో కూడా స్వీకర్తలు సబ్‌స్క్రిప్షన్ తీసివేయడానికి వీలుగా సరైన మార్గాన్ని పంపేవారు అందించాలి. సబ్‌స్క్రిప్షన్ తీసివేయడంలో మీకు సహాయపడేందుకు, Gmailలో మెయిల్ విలీనం ఆప్షన్ బిల్ట్ ఇన్ చేయబడి ఉంటుంది. మెయిల్ విలీనంతో సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసే రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

స్పష్టమైన మెసేజ్‌ను ఈమెయిల్‌లో రాయండి

మీ లక్ష్యాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి స్పష్టమైన సబ్జెక్ట్ విషయాలను, హెడ్‌లైన్స్‌ను ఉపయోగించండి. మీరు మీ ప్రేక్షకులతో ఎంగేజ్ కావాలనుకుంటే, స్పష్టమైన కాల్ టు యాక్షన్ లేదా బటన్‌ను చేర్చండి.

మేము వీటిని కూడా చేయాలని మీకు సిఫార్సు చేస్తున్నాము:

  • మీ బ్రాండ్ లేదా వెబ్‌సైట్‌కు అనుగుణంగా ఉండేలా మెసేజ్‌ను తెలియజేయడం.
  • మోసపూరితం కానీ కంటెంట్‌ను క్రియేట్ చేయడం.
  • గమ్యస్థానాన్ని ఖచ్చితంగా వివరించే బటన్‌లు, లింక్‌లను ఉపయోగించడం.

ఈమెయిల్ ఫ్రీక్వెన్సీ కోసం అంచనాలను సెట్ చేయండి

మీ సబ్‌స్క్రయిబర్‌లకు ఉపయోగకరంగా లేని మెసేజ్‌లను క్రమం తప్పకుండా పంపితే, వారు సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయడం లేదా స్పామ్‌గా గుర్తించడం వంటివి చేసే అవకాశం ఉంది.

దీన్ని నివారించడంలో సహాయంగా, మేము వీటిని సిఫార్సు చేస్తున్నాము:

  • మీ ప్రేక్షకులు సమంజసంగా భావించే విధంగా మీరు మెసేజ్‌లను పంపారని నిర్ధారించుకోండి.
  • మీ కస్టమర్‌లు మీ నుండి ఎంత తరచుగా మెసేజ్‌లను స్వీకరిస్తారు అలాగే ఆ మెసేజ్‌లలో ఏమి ఉంటాయి అనే దాని గురించి మీరు స్పష్టమైన అంచనాలను సెట్ చేసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15977315947509503197
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false