Gmail విడ్జెట్‌ను మేనేజ్ చేయండి

మీ మొదటి స్క్రీన్‌కు Gmail యాప్ విడ్జెట్‌ను జోడించండి

ముఖమైనది: ఈ ఫీచర్ iOS 14 ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లను కలిగి ఉన్న iPhoneలు, iPadలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీ పరికరం మొదటి స్క్రీన్‌పై Gmail యాప్ విడ్జెట్‌ను జోడించడానికి సూచనలను పాటించండి. పలు ఖాతాలకు విడ్జెట్‌ను జోడించడానికి, ఖాతాలను ఎలా మార్చాలనే దానిపై సూచనలను పాటించండి.

మీరు ఇటీవలే Gmail యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లయితే, విడ్జెట్ గ్యాలరీలో విడ్జెట్ కనిపించకముందే మీరు యాప్‌ను తెరవాల్సి ఉంటుంది.

Gmail యాప్ విడ్జెట్‌ను జోడించడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, మొదటి స్క్రీన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. ఎగువ ఎడమ భాగంలో, 'Plusను జోడించండి'ని ట్యాప్ చేయండి.
  3. Gmail యాప్‌ను ట్యాప్ చేయండి.
  4. Tap విడ్జెట్‌ను జోడించును ట్యాప్ చేయండి.
  5. మొదటి స్క్రీన్‌పై విడ్జెట్‌ను ఉంచండి.
  6. పూర్తయిందిని ట్యాప్ చేయండి.

ఖాతాలను మార్చడం ఎలా

  1. మీ iPhone లేదా iPad మీద, Gmail యాప్ విడ్జెట్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. ఎడిట్ ఆ తర్వాత ఖాతాను మార్చండిని ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.

మీ లాక్ స్క్రీన్ విడ్జెట్‌ను జోడించండి, కాన్ఫిగర్ చేయండి

ముఖ్యమైనది: 

  • ఈ ఫీచర్ iOS 16 ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది
  • ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా మీ iOS పరికరంలో Gmail యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
  1. మీ లాక్ స్క్రీన్‌పై, గడియారాన్ని ట్యాప్ చేసి ఉంచండి.
  2. దిగువున, అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  3. అనుకూలీకరణను జోడించడానికి, లాక్ స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.
  4. విడ్జెట్‌లను జోడించండి అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  5. విడ్జెట్ గ్యాలరీలో, మీరు జోడించాలనుకుంటున్న విడ్జెట్‌ను కనుగొనండి.
  6. విడ్జెట్‌ను ట్యాప్ చేయండి లేదా గడియారం కింద ఉన్న విడ్జెట్ బార్‌కు లాగండి.
  7. విడ్జెట్ బార్‌లో, మీరు కాన్ఫిగ‌ర్ చేయాలనుకుంటున్న విడ్జెట్‌ను ట్యాప్ చేయండి.
  8. మీ ప్రాధ్యాన కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోండి.
  9. పూర్తయింది ఆ తర్వాత వాల్‌పేపర్ పెయిర్‌గా సెట్ చేయండిని ట్యాప్ చేయండి.
  10. అనుకూలీకరణను ముగించడానికి, లాక్ స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.

ఇప్పటికే ఉన్న లాక్ స్క్రీన్ విడ్జెట్‌ను కాన్ఫిగ‌ర్ చేయండి

  1. మీ లాక్ స్క్రీన్‌పై, గడియారాన్ని ట్యాప్ చేసి ఉంచండి.
  2. దిగువున, అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  3. అనుకూలీకరణను జోడించడానికి, లాక్ స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.
  4. విడ్జెట్ బార్‌లో, ఇప్పటికే ఉన్న విడ్జెట్‌ను రెండు సార్లు ట్యాప్ చేయండి.
  5. మీ ప్రాధ్యాన కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోండి.
  6. పూర్తయింది ఆ తర్వాత వాల్‌పేపర్ పెయిర్‌గా సెట్ చేయండిని ట్యాప్ చేయండి.
  7. అనుకూలీకరణను ముగించడానికి, లాక్ స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16151411500486776008
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false