Gemini యాప్స్ గోప్యతా హబ్

చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: ఏప్రిల్ 15, 2025

విషయ పట్టిక

Gemini యాప్స్ గోప్యతా ప్రకటన

చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: మార్చి 6, 2025

Gemini Apps విషయంలో మీ డేటా

మీరు Geminiతో ఇంటరాక్ట్ అయినప్పుడు Google, మీ డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్న అంశాన్ని ఈ నోటీస్, అలాగే మా గోప్యతా పాలసీ వివరిస్తాయి. ఈ నోటీస్, పాలసీ రెండూ ఇక్కడ లిస్ట్ చేసిన యాప్‌లు, సర్వీస్‌లు (“Gemini యాప్స్” లేదా క్లుప్తంగా “Gemini”) ద్వారా ఈ వివరాలను వెల్లడిస్తాయి. Gemini మీ వ్యక్తిగత AI అసిస్టెంట్, దీన్ని Google అందిస్తోంది.

ఐరోపా ఆర్థిక మండలిలో, స్విట్జర్లాండ్‌లో, Gemini యాప్స్‌ను Google Ireland Limited అందిస్తోంది. ఇతర దేశాల్లో/ప్రాంతాల్లో Gemini యాప్స్‌ను Google LLC అందిస్తోంది. Google Ireland Limited, Google LLCని కలిపి మేము దిగువున Google అని పిలుస్తాము.

ఏ డేటా సేక‌రించ‌బ‌డుతుంది, అది ఎలా ఉప‌యోగించ‌బ‌డుతుంది

Google ఇక్కడ పేర్కొన్న సమాచారాన్ని సేకరిస్తుంది (కలెక్ట్ చేస్తుంది): మీ చాట్‌లు (వీటిలో మీ Gemini Live ఇంటరాక్షన్‌లకు సంబంధించిన రికార్డింగ్‌లు కూడా ఉంటాయి); మీరు Gemini యాప్స్‌తో షేర్ చేసేవి (ఫైళ్లు, ఇమేజ్‌లు, స్క్రీన్‌లు వంటివి); సంబంధిత ప్రోడక్ట్ వినియోగ సమాచారం; మీ ఫీడ్‌బ్యాక్; మీ లొకేషన్ సమాచారం. మీ లొకేషన్‌కు సంబంధించిన సమాచారంలో మీ పరికరంలోని జనరల్ ఏరియా, IP అడ్రస్, లేదా మీ Google ఖాతాలోని ఇల్లు / వర్క్ ప్లేస్ అడ్రస్‌ వంటి సమాచారం కూడా ఉంటుంది. g.co/privacypolicy/locationలో లొకేషన్ డేటా గురించి మరింత తెలుసుకోండి.

ఈ డేటాను Google, మా గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగిస్తుంది. Googleకు చెందిన ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ప్రొవైడ్ చేయడానికి, మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి వినియోగిస్తుంది. ఈ టెక్నాలజీల్లో Google Cloud వంటి Google ఎంటర్‌ప్రయిజ్ ప్రోడక్ట్‌లు కూడా ఉంటాయి.

మీకు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే, Gemini యాప్స్ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది. 18 ఏళ్ల లోపు ఉన్న యూజర్లు దీన్ని ఆన్ చేసుకోవచ్చు. మీ Gemini యాప్స్ యాక్టివిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, Google, మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీ Google ఖాతాలో 18 నెలల పాటు స్టోర్ చేస్తుంది. దీన్ని మీరు Gemini యాప్స్ యాక్టివిటీ సెట్టింగ్‌లో 3 నెలలకు లేదా 36 నెలలకు మార్చుకోవచ్చు.

Googleకు చెందిన AI టెక్నాలజీలను రివ్యూవ‌ర్‌లు ఎలా మెరుగుప‌రుస్తారు

క్వాలిటీ విషయంలో సహాయపడటంతో పాటు, మా ప్రోడక్ట్‌లను (Gemini యాప్స్‌కు శక్తినిచ్చే జెనరేటివ్ మెషిన్-లెర్నింగ్ మోడల్స్ వంటి వాటిని) మెరుగుపరచడానికి, Gemini యాప్స్‌తో మీరు జరిపిన సంభాషణలను (థర్డ్-పార్టీలతో సహా) రివ్యూవర్‌లు చదవుతారు, అదనపు గమనికలు జోడిస్తారు, అలాగే వాటిని ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా మీ గోప్యతను కాపాడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము. దీనిలో భాగంగా, Gemini యాప్స్‌తో మీరు జరిపిన సంభాషణలను రివ్యూవర్‌లు చూడటానికి ముందు లేదా వారు అదనపు గమనికలను జోడించడానికి ముందు, వాటిని మీ Google ఖాతా నుండి డిస్‌కనెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీ సంభాషణలలో గోప్యమైన సమాచారాన్ని ఎంటర్ చేయకండి లేదా రివ్యూవర్ చూడకూడదని మీరు అనుకుంటున్న లేదా మా ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి Google ఉపయోగించకూడదు అని మీరు భావించే ఎటువంటి డేటానూ ఎంటర్ చేయవద్దు.

మీ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం

మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి, అలాగే మీ గోప్యతను సంరక్షించడానికి వీలు కల్పించే సెట్టింగ్‌లను, టూల్స్‌ను యాక్సెస్ చేయడానికి మీ Google ఖాతాకు వెళ్లండి.

భవిష్యత్తులో సంభాషణలను రివ్యూ చేయకుండా లేదా Google మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఉపయోగించకుండా ఆపడానికి, Gemini యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేయండి. మీరు Gemini యాప్స్ యాక్టివిటీలో గత సంభాషణలను కూడా రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు.

మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీరు తొలగించినప్పుడు, రివ్యూవర్‌లు రివ్యూ చేసిన లేదా అదనపు గమనికలు జోడించిన సంభాషణలు (వాటితో పాటు, మీ భాష, పరికర రకం, లొకేషన్ సమాచారం వంటి సంబంధిత డేటా లేదా ఫీడ్‌బ్యాక్) తొలగించబడవు. ఎందుకంటే, అవి విడిగా ఉంటాయి, మీ Google ఖాతాకు కనెక్ట్ చేసి ఉండవు. బదులుగా, అవి మూడు సంవత్సరాల వరకు స్టోర్ అయ్యి ఉంటాయి.

Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉన్నా కూడా, మీ సంభాషణలు గరిష్ఠంగా 72 గంటల పాటు మీ ఖాతాలో సేవ్ అవుతాయి. ఇందువల్ల ఈ సర్వీస్‌ను అందించడానికి, అలాగే ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను ప్రాసెస్ చేయడానికి Googleకు వీలవుతుంది. ఈ యాక్టివిటీ మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు. మరింత తెలుసుకోండి.

Gemini యాప్స్ యాక్టివిటీ ఇత‌ర స‌ర్వీస్‌లు, సెట్టింగ్‌ల‌లో ఎలా వ‌ర్క్ చేస్తుంది

మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేసినా లేదా మీ Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించినా, ఇతర Google సెట్టింగ్‌లు మారవు. మీరు ఇతర Google సర్వీస్‌లను వినియోగిస్తున్న‌ప్పుడు, వెబ్ & యాప్ యాక్టివిటీ లేదా లొకేషన్ హిస్టరీ వంటి ఇతర సెట్టింగ్‌లు లొకేషన్‌ను, ఇతర డేటాను సేవ్ చేయడం కొనసాగించే అవకాశం ఉంది. మీరు Gemini యాప్స్‌ను ఇతర Google సర్వీస్‌లతో కూడా ఇంటిగ్రేట్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు. మీరు అలా చేసినప్పుడు, ఆ సర్వీసులు మీ డేటాను వాటి పాలసీలకు, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా సేవ్ చేసుకుంటాయి. ఆ డేటాను వాటి సర్వీసులను అందించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగించుకుంటాయి. ఒకవేళ మీరు Gemini యాప్స్‌ను ఉపయోగించి థర్డ్-పార్టీ సర్వీసులతో ఇంటరాక్ట్ అయినట్లయితే, సదరు సర్వీసులు వాటి సొంత గోప్యతా పాలసీలకు అనుగుణంగా మీ డేటాను ప్రాసెస్ చేస్తాయి.

కంటెంట్ తీసివేతను రిక్వెస్ట్ చేయ‌డం, మీ డేటాను ఎగుమతి చేయ‌డం

ఏదైనా కంటెంట్ మా పాలసీలకు లేదా వర్తించే చట్టాలకు అనుగుణంగా లేదని మీరు భావిస్తే, దాన్ని తీసివేయాల్సిందిగా మీరు రిక్వెస్ట్‌ను సమర్పించవచ్చు. అంతే కాక, మీ సమాచారాన్ని మీరు ఎగుమతి చేసుకోవచ్చు.

Androidలో Geminiని మీ డివైజ్ అసిస్టెంట్‌గా ఉపయోగించడం

  • అదనపు డేటా హ్యాండ్లింగ్ . Gemini, మీ డివైజ్ అసిస్టెంట్‌గా, మీరు చెబుతున్నది అర్థం చేసుకోవడానికి, సమాధానం ఇవ్వడానికి, పనులు పూర్తి చేయడంలో మీకు సహాయం చేయడానికి, మీ పరికరాల్లో, సర్వీసుల్లో ఉన్న సమాచారాన్ని కూడా ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మా గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు Gemini, Google Assistant ద్వారా అందే డేటాతో సహా కొన్ని నిర్దిష్టమైన సిస్టమ్ అనుమతులను, డేటాను యాక్సెస్ చేస్తుంది. ఇందులో డయలర్, కాల్ లాగ్స్, మెసేజ్ లాగ్స్, కాంటాక్ట్‌లు (కనెక్ట్ అయి ఉండటంలో మీకు సహాయపడటానికి) ఉంటాయి. గడియారం వంటి ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్‌లు, Geminiతో మాట్లాడటంలో మీకు సహాయపడటానికి భాషా ప్రాధాన్యతలు, కంటెంట్‌పై ఏదైనా చర్య తీసుకోవడంలో మీకు సహాయపడటానికి స్క్రీన్ మీద ఉండే కంటెంట్‌ కూడా యాక్సెస్ పొందే డేటాలో ఉంటాయి. Gemini, Google Assistantల కోసం మీరు ఉపయోగించే పరికరాల నుండి, సర్వీసుల నుండి Gemini, సందర్భోచిత సమాచారాన్ని (స్మార్ట్ హోమ్ పరికర పేర్లు, ప్లేలిస్ట్‌ల వంటి వాటిని) కూడా యాక్సెస్ చేస్తుంది. Gemini కోసం మీ యాప్ అనుమతులను (పరికర లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా వంటివి) ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.
  • Google Assistant నుండి సహాయం. నిర్దిష్టమైన పనులు చేసేందుకు Gemini, Google Assistant నుండి సహాయం తీసుకున్నప్పుడు, వ్యక్తిగత ఫలితాల వంటి సంబంధిత Google Assistant సెట్టింగ్‌లు వర్తిస్తాయి. కనెక్ట్ చేసిన యాప్‌ల ద్వారా Gemini చర్యలను పూర్తి చేసినప్పుడు, ఆ Google Assistant సెట్టింగ్‌లు వర్తించవు. Gemini, ఇంకా Google Assistant కలిసి ఎలా పని చేస్తాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి. మీరు Google Assistant నుండి Geminiకి అప్‌గ్రేడ్ అయినప్పుడు కమ్యూనికేషన్‌ల క్వాలిటీని మెరుగు పరచడానికి, కొన్ని ప్రాంతాలలో మీ ఇటీవలి Google Assistant కమ్యూనికేషన్‌ల రిక్వెస్ట్ హిస్టరీ (ఉదాహరణకు, “ప్రసాద్‌కు మెసేజ్ పంపండి”), Gemini యాప్స్ యాక్టివిటీకి ఇంపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. మరింత తెలుసుకోండి.
  • Geminiతో మాట్లాడుతున్నారు. మీ సెట్టింగ్‌లలో “Ok Google” & వాయిస్ మ్యాచ్‌ (Google Assistant ఆధారితం) ఆన్‌లో ఉంటే, మీరు Geminiతో లేదా Google Assistantతో హ్యాండ్స్ ఫ్రీగా (రెండింటిలో ఏది యాక్టివ్‌గా ఉంటే దానితో) మాట్లాడవచ్చు. యాక్టివేట్ కావాలని మీరు అనుకోని సమయంలో Gemini యాక్టివేట్ కావచ్చు. ఉదాహరణకు “Ok Google” లాంటి శబ్దం వచ్చినప్పుడు లేదా మీరు పొరపాటున తాకడం వల్ల యాక్టివేట్ అయ్యి ఉండవచ్చు. Gemini సమాధానం ఇస్తే, అది మీ ఇన్‌పుట్‌ను సాధారణ యాక్టివేషన్ మాదిరిగానే పరిగణిస్తుంది. మీ Gemini యాప్స్ యాక్టివిటీ సెట్టింగ్ గనుక ఆన్‌లో ఉంటే, ఈ డేటా, ఈ నోటీస్‌కు, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుంది. రివ్యూవర్‌ల సహాయంతో Google AIని మెరుగుపరచడం కూడా ఈ వినియోగంలో ఉంటుంది.

అనుబంధ ఫీచర్‌లు

Gemini యాప్స్‌లో మీరు పలు రకాల సప్లిమెంటరీ (అనుబంధ) Gems వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు. ఈ సప్లిమెంటరీ (అనుబంధ) ఫీచర్లను ఉపయోగించినప్పుడు, మీరు ఇచ్చే అదనపు డేటాను (Gem పేర్లు, అనుకూల సూచనల వంటి వాటిని) కూడా సేకరిస్తాము. దీన్ని ఈ నోటీసుకు, మా గోప్యతా పాలసీకి అనుగుణంగా, రివ్యూవర్‌ల సహాయంతో Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తాము.

తెలుసుకోవాల్సిన విషయాలు

  • Gemini యాప్స్ నిరంతరంగా ఎవాల్వ్ అవుతూ (అభివృద్ధి చెందుతూ) వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి, Google అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే తప్పు సమాచారాన్ని, అభ్యంతరకరమైన, లేదా అనుచితమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉందని గమనించండి.
  • Gemini ఇచ్చే సమాధానాలను వైద్యపరమైన, చట్టపరమైన, ఆర్థికపరమైన, లేదా ఇతర వృత్తిపరమైన సలహాలుగా భావించకూడదు.
  • మీ ఫీడ్‌బ్యాక్ Gemini యాప్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మరింత తెలుసుకోవడానికి Gemini యాప్స్ FAQలను, Gemini యాప్స్ గోప్యతా హబ్ను చూడండి.

సర్వీస్ నియమాలు

గమనిక: Google నియమాలు ఇంకా జెనరేటివ్ AI నిషేధిత వినియోగ పాలసీ Gemini యాప్స్‌కు వర్తిస్తాయి.

మీరు కొరియాకు చెందిన కన్జ్యూమర్ అయితే, మీరు Gemini యాప్స్‌ను వినియోగించడం అనేది కొరియన్ లొకేషన్ సర్వీస్ నియమాలకు కూడా లోబడి ఉంటుందని అంగీకరిస్తున్నారు.

గోప్యతా ప్రశ్నలు

చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: ఏప్రిల్ 15, 2025

సాధారణం

లొకేషన్, ఇతర అనుమతుల సమాచారం

అప్‌లోడ్ చేసిన ఫైల్స్

 

Geminiలో కనెక్ట్ అయి ఉన్న యాప్స్

Gemini Live

Gemలు

సంబంధిత రిసోర్స్‌లు

Gemini మొబైల్ యాప్స్‌కు సంబంధించిన మరిన్ని రిసోర్స్‌లు

2090185483767044953
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5295044
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
false
false
false
false