Google Driveలో ఫోల్డర్‌లను షేర్ చేయండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

మీరు ఫోల్డర్‌లను ఇతరులతో షేర్ చేసిన తర్వాత, వారు వాటితో ఏం చేయగలరో ఇక్కడ చూడండి:

  • నిర్వహించగలరు, జోడించగలరు & ఎడిట్ చేయగలరు: Google ఖాతాకు సైన్ ఇన్ అయినప్పుడు వారు ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని తెరవడం, ఎడిట్ చేయడం, తొలగించడం లేదా తరలించడం చేయవచ్చు. వ్యక్తులు ఫోల్డర్‌కు ఫైల్స్‌ను కూడా జోడించగలరు.
  • కేవలం వీక్షించగలరు: వ్యక్తులు ఫోల్డర్‌ను చూడగలరు, అలాగే ఫోల్డర్‌లోని ఫైల్స్ అన్నిటినీ తెరవగలరు.

ఫోల్డర్ షేరింగ్ గురించి మరిన్ని విషయాలు:

  • మీరు ఫోల్డర్‌ను షేర్ చేసినప్పుడు లేదా అనుమతిని మార్చినప్పుడు, లోపల ఉన్న ఫైల్స్, అలాగే సబ్-ఫోల్డర్‌లు కొత్త షేరింగ్ సెట్టింగ్‌లతో అప్‌డేట్ చేయబడతాయి. తర్వాతి తేదీలో ఫోల్డర్‌కు జోడించిన ఫైల్స్, వాటికి నేరుగా జోడించబడిన ఏవైనా అనుమతులతో పాటుగా ఫోల్డర్ అనుమతులు సంక్రమిస్తాయి.
  • మీరు అధిక సంఖ్యలో ఫైల్‌లు లేదా సబ్-ఫోల్డర్‌లు కలిగి ఉండే ఫోల్డర్‌లను షేర్ చేస్తే, లేదా షేరింగ్ తీసివేస్తే, అనుమతులన్నీ మారడానికి సమయం పట్టవచ్చు. ఎడిట్ చేయడానికి, వీక్షించడానికి సంబంధించిన అనుమతులను మీరు అధిక సంఖ్యలో ఒకేసారి మారిస్తే, మార్పులు మీకు కనపడానికి సమయం పట్టవచ్చు.

చిట్కా: ఈలోగా, కొత్త సహకారులకు ఫోల్డర్ యాక్సెస్ ఇవ్వడానికి, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్ తాలూకు షేరింగ్ URLను ఉపయోగించండి.

  • ఫైల్‌ను అప్‌లోడ్ చేసిన వ్యక్తి స్టోరేజ్ లెక్కించబడుతుంది, ఫోల్డర్ ఓనర్‌ది కాదు.
  • పెద్ద ఫోల్డర్ స్ట్రక్చర్‌లను మేనేజ్ చేసేటప్పుడు, చైల్డ్, పేరెంట్ ఫోల్డర్ అనుమతులు వేరు వేరుగా ఉండవచ్చు. చైల్డ్ ఫోల్డర్‌లకు సంక్రమించిన అనుమతులను మీరు పేరెంట్ ఫోల్డర్ కంటే భిన్నంగా ఉండేలా ఓవర్‌రైడ్ చేయవచ్చు. మీరు చైల్డ్ ఫోల్డర్ నుండి పేరెంట్ అనుమతులను కూడా తొలగించవచ్చు.

ఎవరితో షేర్ చేయాలో ఎంచుకోండి

నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయండి
  1. Google Driveకు వెళ్లండి.
  2. మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌ను ఎంచుకోండి.
  3. షేర్ చేయండి ఆమోద వ్యక్తిని జోడించండి ని ఎంచుకోండి.
  4. మీరు ఫైల్‌ను ఏ ఈమెయిల్ అడ్రస్ లేదా Google గ్రూప్‌తో షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్‌ను లేదా Google గ్రూప్‌ను ఎంటర్ చేయండి. మీరు వర్క్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తుంటే, సూచించబడిన స్వీకర్తలతో మీరు షేర్ చేయవచ్చు.
    • చిట్కా: సూచించబడిన స్వీకర్తలను ఆఫ్ చేయడానికి, మీ Drive సెట్టింగ్‌లకు సెట్టింగ్‌లు వెళ్లండి. “షేరింగ్ డైలాగ్‌లో సూచించబడిన స్వీకర్తలను చూడండి” ఆప్షన్ ఎంపికను తీసివేయండి.
  5. మీ ఫోల్డర్‌కు సంబంధించి వ్యక్తులకు ఏ యాక్సెస్ రోల్‌ను అసైన్ చేయాలో నిర్ణయించడానికి, వీక్షకులు, కామెంట్ చేయగల వ్యక్తి, లేదా ఎడిటర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. మీరు అర్హత గల వర్క్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తే, గడువు ముగింపు తేదీని జోడించడానికి గడువు ముగింపు తేదీని జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా:  నా డ్రైవ్‌లో వీక్షకుడు, అలాగే కామెంట్ చేయగల వ్యక్తి రోల్స్‌కు ఫోల్డర్‌ల గడువు ముగింపు తేదీలు అందుబాటులో ఉన్నాయి.
  7. వ్యక్తులకు తెలియజేయడాన్ని ఎంచుకోండి.
    • మీరు వ్యక్తులతో ఐటెమ్‌ను షేర్ చేశారనే విషయాన్ని వారికి తెలియజేయాలనుకుంటే, "వ్యక్తులకు తెలియజేయండి" ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి. మీరు వ్యక్తులకు తెలియజేయాలని ఎంచుకుంటే, మీరు ఎంటర్ చేసే ప్రతి ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్‌లో చేర్చబడుతుంది. ఒకవేళ వ్యక్తులకు తెలియజేయకూడదని అనుకుంటే, బాక్స్ ఎంపికను తీసివేయండి.
  8. పంపండి లేదా షేర్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీరు 'నా డ్రైవ్' నుండి షేర్ చేసిన ఫైల్‌కు సంబంధించిన అనుమతులను అప్‌డేట్ చేసి, ఎవరితో అయితే మీరు ఫైల్‌ను షేర్ చేశారో ఆ వ్యక్తికి అనుమతులు లేనప్పుడు, మీరు కింద పేర్కొన్న వాటి కోసం అనుమతులను అప్‌డేట్ చేయవచ్చు:

  • ఫైల్ ఉన్న ఫోల్డర్
  • ఫైల్ మాత్రమే
నిర్దిష్ట వ్యక్తుల గ్రూప్‌తో షేర్ చేయండి

Google Groupతో షేర్ చేయండి

Google Driveలో మీరు నిర్దిష్ట వ్యక్తులకు బదులుగా Google Groupsతో ఫోల్డర్‌లను షేర్ చేయవచ్చు. మీరు వీటిని చేసినప్పుడు:

  • గ్రూప్‌నకు మెంబర్‌ను జోడించడం: గ్రూప్ కలిగి ఉన్న ఫైళ్లు, ఫోల్డర్‌లను యాక్సెస్ చేయడానికి ఆ వ్యక్తి అనుమతి పొందుతారు.
  • గ్రూప్ నుండి మెంబర్‌ను తీసివేసినప్పుడు: గ్రూప్ కలిగి ఉన్న ఫైళ్లు, ఫోల్డర్‌లను యాక్సెస్ చేయడానికి ఆ వ్యక్తి అనుమతిని కోల్పోతారు.

మీ Google గ్రూప్‌తో ఫోల్డర్‌ను షేర్ చేయడానికి:

  1. Google Groupను క్రియేట్ చేయండి.
  2. మీ గ్రూప్‌నకు మెంబర్‌లను జోడించండి.
  3. మీ గ్రూప్‌తో ఫోల్డర్‌ను షేర్ చేయండి.

చిట్కా: మీ "నాతో షేర్ చేసినవి" ఫోల్డర్‌లో ఫోల్డర్ కనిపించడానికి ముందు, మీరు ఆ ఫోల్డర్‌ను ఆహ్వానం లేదా లింక్ నుండి తప్పక తెరవాలి.

Chat స్పేస్‌తో షేర్ చేయండి

Google Driveలో, Chat స్పేస్‌తో ఫోల్డర్‌లను షేర్ చేయడానికి, మీరు నేరుగా ఆ Chat స్పేస్‌కు షేర్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌ను జోడించవచ్చు లేదా Google Drive ఫోల్డర్‌కు లింక్‌ను షేర్ చేయవచ్చు. 

Google Chatలో Chat స్పేస్‌తో ఫోల్డర్‌ను షేర్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు వెళ్లండి.
  2. మీరు ఫోల్డర్‌ను ఏ Chat స్పేస్‌తో షేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి.
  3. దిగువ ఎడమ వైపున, ఇంటిగ్రేషన్ మెనూ  ఆ తర్వాత Drive ను క్లిక్ చేయండి.
  4. మీరు Chat స్పేస్‌తో ఏ ఫోల్డర్‌ను షేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి.
  5. ఇన్‌సర్ట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Driveలోని లింక్ నుండి ఫోల్డర్‌ను షేర్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Driveకు వెళ్లండి.
  2. మీరు Chat స్పేస్‌తో షేర్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌ను కుడి క్లిక్ చేయండి.
  3. లింక్‌ను పొందండి ఆ తర్వాత లింక్‌ను కాపీ చేయండి ఆ తర్వాత పూర్తయింది ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. Google Chatకు వెళ్లండి.
  5. మీరు ఫోల్డర్‌ను షేర్ చేయాలనుకుంటున్న Chat స్పేస్‌ను ఎంచుకోండి.
  6. మెసేజ్ ఫీల్డ్‌లో, మీరు కాపీ చేసిన లింక్‌ను పేస్ట్ చేయండి.

చిట్కాలు:

  • మీరు Chat స్పేస్‌కు ఫోల్డర్‌ను పంపినప్పుడు, యాక్సెస్‌ను మంజూరు చేయమని ప్రాంప్ట్ కనిపిస్తుంది.
    • మీరు ఆ Chat స్పేస్‌కు యాక్సెస్‌ను మంజూరు చేస్తే, స్పేస్‌లో చేరిన వ్యక్తులు తర్వాత షేర్ చేసిన ఫోల్డర్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు.
  • వ్యక్తులు Chat స్పేస్ నుండి నిష్క్రమించినప్పుడు, వారికి షేరింగ్ యాక్సెస్ లేకపోతే, ఆ Chat స్పేస్‌లోని ఫోల్డర్‌లకు యాక్సెస్‌ను కోల్పోతారు:
    • ఒక వ్యక్తిగా
    • మరొక గ్రూప్‌లోని మెంబర్‌గా
  • ఫోల్డర్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి, మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌లో తప్పనిసరిగా ఎడిట్ యాక్సెస్‌ను కలిగి ఉండాలి.
ఫోల్డర్‌కు సాధారణ యాక్సెస్‌ను అనుమతించండి

మీ ఫోల్డర్ సాధారణంగా అందుబాటులో ఉండాలా లేదా యాక్సెస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడాలా అని మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు లింక్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ యాక్సెస్‌ను అనుమతిస్తే, లింక్‌ను కలిగి ఉన్న ఎవరైనా మీ ఫోల్డర్‌ను యాక్సెస్ చేయగలరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Driveకు వెళ్లండి.
  2. మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.
  3. షేర్ చేయండి ఆమోద వ్యక్తిని జోడించండి ని క్లిక్ చేయండి.
  4. "సాధారణ యాక్సెస్" కింద, కింది వైపు బాణం కిందికి బాణం గుర్తును క్లిక్ చేయండి.
  5. ఫోల్డర్‌ను ఎవరెవరు యాక్సెస్ చేయవచ్చో ఎంచుకోండి.
    • చిట్కా: మీరు మీ Google ఖాతాను ఆఫీస్ లేదా స్కూల్ కోసం ఉపయోగిస్తే, మీరు మీ డిపార్ట్‌మెంట్ వంటి నిర్దిష్ట వ్యక్తులతో మాత్రమే ఫైల్స్, ఫోల్డర్‌లను షేర్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. మీరు గ్రూప్ పేరుపై మౌస్ కర్సర్ ఉంచినప్పుడు, మీరు ప్రతి ప్రేక్షకుల వివరణను చూడవచ్చు.
  6. మీ ఫోల్డర్‌కు సంబంధించి వ్యక్తులకు ఏ యాక్సెస్ రోల్‌ను అసైన్ చేయాలో నిర్ణయించడానికి, వీక్షకులు, కామెంట్ చేయగల వ్యక్తి, లేదా ఎడిటర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

షేర్ చేసిన ఫోల్డర్‌లకు చెందిన షేరింగ్ అనుమతులను మార్చండి

షేర్ చేసిన ఫైళ్లను ఎడిట్ చేయండి, కామెంట్ చేయండి, లేదా చూడండి

మీరు ఒక ఫోల్డర్‌ను షేర్ చేసినప్పుడు, దాని లోపల ఉండే ఫైళ్లు, సబ్-ఫోల్డర్‌లు కొత్త షేరింగ్ సెట్టింగ్‌లతో అప్‌డేట్ అవుతాయి. మీరు ఫోల్డర్‌ను ఎలా షేర్ చేశారనే దాని బట్టి, మీరు షేర్ చేసిన వ్యక్తులు దీని లోపలి ఫైళ్లకు యాక్సెస్‌ను పొందుతారు:

  • ఎడిటర్: వ్యక్తులు ఫోల్డర్‌లోని ఏవైనా ఫైళ్లను తెరవగలరు, ఎడిట్ చేయగలరు, తొలగించగలరు, లేదా తరలించగలరు. వ్యక్తులు ఫోల్డర్‌కు ఫైళ్లను కూడా జోడించగలరు.
  • కామెంటర్: వ్యక్తులు ఫోల్డర్‌లోని ఫైళ్లలో కామెంట్‌లు, సూచనలు చేయగలరు, కానీ ఫోల్డర్‌లోని ఐటెమ్‌లను మార్చలేరు లేదా ఇతరులతో షేర్ చేయలేరు.
  • వీక్షకులు: వ్యక్తులు ఫోల్డర్‌ను చూడగలరు, అలాగే వారు ఆ ఫోల్డర్‌లోని అన్ని ఫైళ్లను తెరవగలరు.

మీరు ఫోల్డర్‌ను షేర్ చేసిన తర్వాత, దాని లోపల ఉన్న ఫైళ్లను ఎలా షేర్ చేయాలన్నది మీరు మార్చవచ్చు.

గడువు ముగింపు తేదీని జోడించండి
వేరొక వ్యక్తిని ఫోల్డర్ ఓనర్‌గా చేయండి

మీరు ఫోల్డర్ యొక్క యాజమాన్య హక్కును బదిలీ చేసినప్పుడు, దాని లోపల ఉన్న ఫైల్‌లను వాటి అసలైన ఓనర్ కలిగి ఉంటారు. ఒక ఫోల్డర్ కంటే ఎక్కువ వాటి ఓనర్‌లను మార్చడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు ఓనర్‌లను మార్చాలనుకుంటున్న ఫోల్డర్‌ను ఎంచుకోండి.
    • పలు ఫోల్డర్‌లను ఎంచుకోవడానికి, Shift నొక్కి పట్టుకొని, మీరు కోరుకునే ఫోల్డర్‌లను క్లిక్ చేయండి.
  3. ఎగువున కుడి వైపున, షేర్ చేయండి ఆమోద వ్యక్తిని జోడించండి ని క్లిక్ చేయండి.
  4. వ్యక్తి పేరుకు కుడి వైపున, కింది వైపు బాణం కిందికి బాణం గుర్తును క్లిక్ చేయండి.
  5. యాజమాన్య హక్కును బదిలీ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. అవును ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు వేరొకరిని ఫోల్డర్‌కు ఓనర్‌గా చేసిన తర్వాత, కొత్త ఓనర్ మీ యాక్సెస్‌ను మార్చాలని నిర్ణయించుకునే వరకు మీరు ఫోల్డర్‌ను ఎడిట్ చేయగలరు.

షేర్ చేసిన ఫోల్డర్‌ల నుండి ఫైల్స్ తొలగించబడ్డాయి

ఎవరైనా షేర్ చేసిన ఫోల్డర్ నుండి ఫైల్‌ను తొలగించినప్పుడు, కేవలం ఓనర్ మాత్రమే దానిని యాక్సెస్ చేయగలరు.

షేర్ చేసిన ఫోల్డర్ నుండి తొలగించబడిన ఫైల్‌ను తిరిగి పొందడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. పైభాగంలో, 'Drive‌లో వెతుకు' ఎంపికను క్లిక్ చేయండి.
  3. ఫైల్ యొక్క పేరును టైప్ చేయండి.
  4. ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
  5. నా డ్రైవ్‌కు జోడించండి నా డిస్క్‌కు జోడించుని క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11025319232310459087
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false