మీ ఫైల్‌కు వేరొకరిని ఓనర్‌గా చేయండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

మీరు Google Driveలో క్రియేట్ చేసే లేదా అప్‌లోడ్ చేసే ఫైళ్లు మీ స్వంత ఫైళ్లుగా ఉంటాయి. మీకు చెందిన ఫైల్స్, ఫోల్డర్‌ల యాజమాన్య హక్కును మరొక ఖాతాకు బదిలీ చేయవచ్చు.

మీరు యాజమాన్య హక్కును బదిలీ చేసే ముందు

మీరు ఆఫీస్ లేదా స్కూల్ కోసం Google ఖాతాను ఉపయోగిస్తే:

  • మీరు మీ సంస్థలోని ఎవరికైనా మాత్రమే ఫైళ్లు, ఫోల్డర్‌ల యాజమాన్య హక్కును బదిలీ చేయవచ్చు.
  • బదిలీకి సంబంధించిన రిక్వెస్ట్‌ను కొత్త ఓనర్ అంగీకరించాల్సిన అవసరం లేదు.

మీరు యాజమాన్య హక్కును బదిలీ చేసిన తర్వాత

మీరు యాజమాన్య హక్కు బదిలీ రిక్వెస్ట్‌ను పంపినప్పుడు:

  • వారు బదిలీ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, పెండింగ్ ఓనర్‌కు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది, అలాగే వారు ఫైల్ ఓనర్ అవుతారు. అప్పటి వరకు, మీరు ఓనర్‌గా ఉంటారు.
  • పెండింగ్ ఓనర్ ఇప్పటికే ఎడిటర్‌గా ఉంటే తప్ప, వారు ఎడిటర్‌గా అప్‌గ్రేడ్ చేయబడతారు.
  • పెండింగ్ ఓనర్ అంగీకరిస్తే, మీరు ఎడిటర్‌గా డౌన్‌గ్రేడ్ చేయబడతారు. కొత్త ఓనర్ మిమ్మల్ని తీసివేయగలరు.
  • పెండింగ్ ఓనర్ తిరస్కరిస్తే, మీరే ఓనర్‌గా ఉంటారు.

Google Driveలో ఓనర్‌లను మార్చండి

ముఖ్య గమనిక: మీరు మునుపు ఫైల్‌ను షేర్ చేసిన వ్యక్తికి ఫైల్ యాజమాన్య హక్కును బదిలీ చేయవచ్చు. Google Driveలో ఫైళ్లను షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Google Driveను తెరవండి.
  2. మీరు బదిలీ చేయాలనుకుంటున్న ఫైల్‌ను కనుగొని, ఆపై దానిపై కుడి క్లిక్ చేయండి.
  3. షేర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి > షేర్ చేయండి షేర్ చేయిని క్లిక్ చేయండి.
  4. స్వీకర్తల పేరు పక్కన, కింది వైపు బాణం కిందికి బాణం ఆ తర్వాత యాజమాన్య హక్కును బదిలీ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Docs, Sheets, లేదా Slides ఫైల్‌లో ఓనర్‌ను మార్చండి

ముఖ్య గమనిక: మీరు మునుపు ఫైల్‌ను షేర్ చేసిన వ్యక్తికి ఫైల్ యాజమాన్య హక్కును బదిలీ చేయవచ్చు. Google Driveలో ఫైళ్లను షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి. 

Google Docs, Sheets, లేదా Slidesలో యాజమాన్య హక్కును బదిలీ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Drive ఆప్షన్‌ను తెరవండి.
  2. Google Docs, Sheets, అలాగే Slides ఫైళ్లను తెరవండి.
  3. పైన కుడి మూలలో, షేర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. స్వీకర్త పేరు పక్కన, కింది వైపు బాణం దిగువకు ఆ తర్వాత యాజమాన్య హక్కును బదిలీ చేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

బదిలీను రద్దు చేయండి

ముఖ్య గమనిక: కొత్త ఓనర్ రిక్వెస్ట్‌ను ఆమోదించిన తర్వాత మీరు బదిలీని రద్దు చేయలేరు. 

Google Docs, Sheets, లేదా Slidesలో ఫైల్ యాజమాన్య హక్కు బదిలీను రద్దు చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, ఫైల్‌ను తెరవండి.
  2. పైన కుడి మూలలో, షేర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. స్వీకర్త పేరు పక్కన, కింది వైపు బాణం దిగువకు ఆ తర్వాత రద్దు చేయండి యాజమాన్య హక్కు బదిలీ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

యాజమాన్య హక్కు బదిలీ రిక్వెస్ట్‌ను అంగీకరించండి లేదా తిరస్కరించండి

ఎవరైనా ఫైల్ బదిలీని రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు ఇమెయిల్ వస్తుంది. మీరు ఆహ్వానాన్ని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. యాజమాన్య హక్కు బదిలీ రిక్వెస్ట్‌కు ప్రతిస్పందన పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల కోసం మీరు Driveలో కూడా సెర్చ్ చేయవచ్చు.

  1. Google Driveను తెరవండి.
  2. ఎగువున సెర్చ్ బార్‌లో, pendingowner:me అని ఎంటర్ చేయండి.
  3. మీరు ప్రతిస్పందించాలనుకుంటున్న ఫైల్ లేదా ఫైళ్లపై కుడి క్లిక్ చేయండి.
  4. షేర్ చేయండి షేర్ చేయి ఆ తర్వాత యాజమాన్య హక్కును అంగీకరించాలనుకుంటున్నారా? ఆ తర్వాత అంగీకరించండి లేదా తిరస్కరించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ముఖ్య గమనిక:

  • పెండింగ్ ఓనర్ మీ రిక్వెస్ట్‌ను అంగీకరించే వరకు మీరు ఫైల్ ఓనర్‌గానే ఉంటారు. బదిలీ అయిన తర్వాత, మీ అనుమతులు మారే వరకు మీరు ఫైల్‌ను ఎడిట్ చేయవచ్చు.
  • మీరు మీ వ్యక్తిగత Google ఖాతా నుండి ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తున్న వ్యక్తికి ఫైల్‌ను బదిలీ చేయలేరు.
  • మీరు వ్యక్తిగత ఖాతాకు యాజమాన్య హక్కు బదిలీ రిక్వెస్ట్‌ను పంపి, ఆ ఖాతా ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాగా మారితే, పెండింగ్ ఓనర్, రిక్వెస్ట్‌ను అంగీకరించలేరు.
  • మీరు యాజమాన్య హక్కు బదిలీ రిక్వెస్ట్‌ను పంపిన తర్వాత మీ వ్యక్తిగత ఖాతా ఆఫీస్ లేదా స్కూల్‌కు చెందిన ఖాతాగా మారితే, పెండింగ్ ఓనర్, రిక్వెస్ట్‌ను అంగీకరించలేరు.
  • మీరు రిక్వెస్ట్‌ను రద్దు చేయవచ్చు.
  • పెండింగ్ ఓనర్, రిక్వెస్ట్‌ను తిరస్కరించవచ్చు.
  • మీరు ఫైల్ యాజమాన్య హక్కును బదిలీ చేసినప్పుడు, అది ఇకపై నా డ్రైవ్‌లో ఉండదు, అలాగే మీ స్టోరేజ్‌గా పరిగణించబడదు. ఇది కొత్త ఓనర్ స్టోరేజ్‌గా పరిగణించబడుతుంది.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1143211471889389709
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false