ఫైల్‌లో అనామక లేదా అజ్ఞాత వ్యక్తులు

మీరు గుర్తించని పేరుతో లేదా "అనామక జంతువుల" రూపంలో మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను చూస్తుండటం గమనించవచ్చు. డాక్యుమెంట్‌ను పబ్లిక్‌గా లేదా లింక్‌ను కలిగి ఉన్న ఎవరితోనైనా షేర్ చేసినప్పుడు ఇలా జరగవచ్చు.

మీకు తెలియనివారు ఎవరైనా కనిపిస్తే

క్రింది కారణాల వలన మీకు తెలియని ఎవరైనా ఒకరు మీ ఫైల్‌ను చూస్తూ ఉండవచ్చు:

  • మెయిలింగ్ జాబితాతో ఫైల్ షేర్ చేయబడింది.
  • Google ఖాతా లేని లేదంటే దానికి సైన్ ఇన్ చేయని ఒకరితో ఫైల్ షేర్ చేయబడింది.
  • మీ ఫైల్‌ను ఎడిట్ చేయగల లేదా లింక్‌ను కలిగి ఉన్న ఒకరు దాన్ని ఇతర వ్యక్తులతో షేర్ చేసారు.
  • ఎవరో ఒకరు వారి Google ఖాతా పేరును మార్చారు. మీరు మీ ఫైల్‌లో షేర్ చేయి ఆ తర్వాత అధునాతనం ఎంపికను క్లిక్ చేసినప్పుడు వారి ఇమెయిల్ చిరునామాను చూడవచ్చు.

వ్యక్తులు మీ ఫైల్‌ను వీక్షించగల విధానాన్ని పరిమితం చేయండి

మీరు ఎడిట్ చేయగల ఫైల్‌ను షేర్ చేయడం ఆపివేయాలనుకుంటే, ఎలా చేయాలో మీరు తెలుసుకోవచ్చు:

"అనామక జంతువులు"

మీరు లింక్‌తో ఫైల్‌ను షేర్ చేస్తే లేదా తెరిస్తే, దాన్ని వీక్షించే వ్యక్తుల పేర్లు మీకు కనిపించకపోవచ్చు.

  • మీరు విడిగా ఆహ్వానించని వ్యక్తులు ఫైల్‌లో ఉన్నప్పుడు అనామక జంతువుల రూపంలో చూపబడతారు.
  • మీరు విడిగా ఆహ్వానించిన వ్యక్తులు ఫైల్‌లో ఉన్నప్పుడు పేరుతో చూపబడతారు.

మీరు ఇతర వ్యక్తులకు ఫైల్‌ను వీక్షించడానికి విడిగా అనుమతి ఇచ్చినప్పుడు లేదా మెయిలింగ్ జాబితాలో వారు భాగమైనప్పుడు మాత్రమే వారి పేర్లను చూడగలరు.

ప్రైవేట్ ఫైల్‌లో అనామక జంతువులు

మీరు లింక్ షేరింగ్‌ను ఆఫ్ చేసినప్పటికీ, క్రింది సందర్భాలలో బహుళ అనామక జంతువులను చూడవచ్చు:

  • ఎవరైనా ఒకరు ఫైల్‌ను అనేకసార్లు తెరిచినప్పుడు. ఇప్పుడు వీక్షించని వ్యక్తులు కనిపించకుండా పోవడానికి కొంత సమయం పట్టవచ్చు.
  • ఎవరైనా ఒకరు సందేశ సేవ ద్వారా లింక్‌ను తెరిచినప్పుడు. కొన్ని సేవలు ఫిషింగ్, వైరస్ దాడులు లేదా మాల్వేర్ కోసం లింక్‌లను తనిఖీ చేస్తాయి.
  • ఆటోమేటిక్‌గా లింక్‌ను అనుసరించే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ లేదా స్క్రిప్ట్‌ను ఎవరైనా ఒకరు ఉపయోగించినప్పుడు.
అనామక జంతువులు మరియు కార్యాలయం లేదా పాఠశాల కోసం Google యాప్‌లు

మీరు కార్యాలయం లేదా పాఠశాల ద్వారా Google యాప్‌లను ఉపయోగిస్తే, మీ డొమైన్‌లోని వ్యక్తులు మీ ఫైల్‌ను వీక్షిస్తున్నప్పుడు పేరుతో ఎల్లప్పుడూ చూపబడతారు.

మీ నిర్వాహకుడు ఫైల్‌లను మీ డొమైన్ వెలుపల షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తే, సైన్ ఇన్ చేయని వ్యక్తులు అనామక జంతువుల రూపంలో చూపబడతారు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15900330473142200267
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false