ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి

మీరు Google సేవా నిబంధనలు లేదా ప్రోగ్రామ్ విధానాల ఉల్లంఘనగా పరిగణించే ప్రవర్తన గురించి రిపోర్ట్ చేయవచ్చు. ఇలాంటి ఉల్లంఘనలు:

  • స్పామ్, మాల్‌వేర్, ఫిషింగ్
  • హింస
  • ద్వేష‌పూరిత ప్ర‌సంగం
  • ఉగ్రవాద సంబంధిత కంటెంట్
  • వేధింపు, జులుం చలాయించడం, బెదిరింపులు
  • అనుచితమైన లైంగిక అంశాలు
  • పిల్లలపై దాడి
  • మరొక వ్యక్తిలా నటించడం
  • వ్యక్తిగత మరియు గోప్యమైన సమాచారం
  • చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు
  • బహిరంగ ప్రసారం
  • కాపీరైట్ ఉల్లంఘన
  • కంటెంట్‌ను వినియోగించడం, సమర్పించడం

దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి

మీ కంప్యూటర్ నుండి దుర్వినియోగ కంటెంట్‌ను మీరు రిపోర్ట్ చేయవచ్చు.

Google Docs, Sheets, Slides లేదా Forms

Google Docs, Sheets లేదా Slides

ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి:

  1. ఫైల్‌ను తెరవండి.
  2. సహాయం మెనూను క్లిక్ చేయండి.
  3. దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఫైల్‌లో కనుగొన్న దుర్వినియోగ రకాన్ని ఎంచుకోండి. ప్రతి దుర్వినియోగ రకానికి ఒక వివరణ ఉంటుంది, దాని సహాయంతో మా విధానాలను ఫైల్ ఉల్లంఘిస్తుందో లేదో మీరు నిశ్చయించుకోవచ్చు.
  5. 'దుర్వినియోగ నివేదికను సమర్పించు' ఎంపికను క్లిక్ చేయండి.

Google Forms

ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి:

  1. ఫారమ్ దిగువున, దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
  2. ఫారమ్‌లో కనుగొన్న దుర్వినియోగ రకాన్ని ఎంచుకోండి.
  3. 'దుర్వినియోగ నివేదికను సమర్పించు' ఎంపికను క్లిక్ చేయండి.
Google సైట్‌లు

'Google Sites'తో రూపొందించిన, 'Google Drive'లో హోస్ట్ చేసిన వెబ్‌సైట్‌లలోని దుర్వినియోగ కంటెంట్‌ను మీరు రిపోర్ట్ చేయవచ్చు. మా ప్రోగ్రామ్ విధానాలకు సంబంధించిన కొన్ని ఉల్లంఘనలు:

దుర్వినియోగం గురించి నేరుగా Google సైట్ నుండి రిపోర్ట్ చేయడానికి, పేజీ దిగువున ఉన్న 'దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.

Google Drive

Google Driveలో స్టోర్ చేయబడిన PDFలు, ఇమేజ్‌లు లేదా ఇతర కంటెంట్‌ను మీరు రిపోర్ట్ చేయవచ్చు. 

ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి:

  1. కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రిపోర్ట్ చేయాలనుకుంటున్న ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. రిపోర్ట్ చేయండి లేదా బ్లాక్ చేయండి  > రిపోర్ట్ చేయండి ని క్లిక్ చేయండి.
  4. ఫైల్‌లో కనుగొన్న దుర్వినియోగ రకాన్ని ఎంచుకోండి. ప్రతి దుర్వినియోగ రకానికి ఒక వివరణ ఉంటుంది, దాని సహాయంతో మా విధానాలను ఫైల్ ఉల్లంఘిస్తుందో లేదో మీరు నిశ్చయించుకోవచ్చు.
  5. దుర్వినియోగ రిపోర్ట్‌ను సమర్పించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు Android లేదా iOS పరికరంలో షేరింగ్ లేదా కామెంట్ నోటిఫికేషన్ నుండి కూడా ఉల్లంఘనను రిపోర్ట్ చేయవచ్చు.

  • రిపోర్ట్ చేయడానికి, షేరింగ్ లేదా కామెంట్ నోటిఫికేషన్‌ను విస్తరించి, రిపోర్ట్ చేసి, బ్లాక్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 

రిపోర్ట్ చేయడం వలన ఫైల్ తీసివేయబడుతుంది అని లేదా Google తరఫున ఏదో ఒక చర్య తీసుకోబడుతుందని ఎటువంటి హామీ లేదు. మీరు విభేదించే కంటెంట్ లేదా అనుచితంగా భావించే కంటెంట్ అన్ని వేళలా Google సేవా నిబంధనలు లేదా ప్రోగ్రామ్ విధానాలను ఉల్లంఘించదు.

దుర్వినియోగ అంశాలపై మేము తీసుకోగల చర్యలు

  • ఖాతా నుండి ఫైల్‌ను తీసివేయడం.
  • ఫైల్ షేరింగ్‌ను పరిమితం చేయడం.
  • ఫైల్‌ను ఎవరు వీక్షించాలనేది పరిమితం చేయడం.
  • ఒకటి లేదా మరిన్ని Google ఉత్పత్తులకు యాక్సెస్‌ను డిజేబుల్ చేయడం.
  • Google ఖాతాను తొలగించడం.
  • చట్టవిరుద్ధమైన అంశాల గురించి సముచిత న్యాయ పరిరక్షణ వ్యవస్థలకు రిపోర్ట్ చేయడం.

ఉల్లంఘన గురించి అప్పీల్ చేయండి

మీకు చెందిన పైల్‌కు ఉల్లంఘన నోటీసు వచ్చి ఉంటే, ఆ ఉల్లంఘన గురించి సమీక్షను అభ్యర్థించవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
532908069939350750
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false