Google Driveకు ఫైల్స్ & ఫోల్డర్‌లను అప్‌లోడ్ చేయండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

మీరు Google Driveను ఉపయోగించి ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయవచ్చు, తెరవవచ్చు, షేర్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు. మీరు ఒక ఫైల్‌ను Google Driveకు అప్‌లోడ్ చేసినప్పుడు, మీరు దానిని వేరొకరికి చెందిన ఫోల్డర్‌కు అప్‌లోడ్ చేసినప్పటికీ అది మీ Driveలో ప్రదేశాన్ని వినియోగిస్తుంది.

ఫైల్‌ల రకాలు

  • డాక్యుమెంట్‌లు
  • చిత్రాలు
  • ఆడియో
  • వీడియో

ఫైళ్లు, ఫోల్డర్‌లను అప్‌లోడ్ చేయండి

మీ కంప్యూటర్‌లో, మీరు drive.google.com నుండి లేదా మీ డెస్క్‌టాప్ నుండి అప్‌లోడ్ చేయవచ్చు. మీరు ఫైల్‌లను ప్రైవేట్ లేదా షేర్ చేసిన ఫోల్డర్‌లకు అప్‌లోడ్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపున, కొత్తది ఆ తర్వాత  ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి లేదా ఫోల్డర్‌ను అప్‌లోడ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్ లేదా ఫోల్డర్‌ను ఎంచుకోండి.

ఫైళ్లను Google Driveలోకి లాగండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఫోల్డర్‌ను తెరవండి లేదా సృష్టించండి.
  3. ఫైళ్లు, ఫోల్డర్‌లను అప్‌లోడ్ చేయడానికి, వాటిని Google Drive ఫోల్డర్‌లోకి లాగండి.

డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి

  1. మీ కంప్యూటర్‌లో అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  2. మీ కంప్యూటర్‌లో "Google Drive" అనే ఫోల్డర్‌ను కనుగొంటారు.
  3. ఫైల్స్ లేదా ఫోల్డర్‌లను ఆ ఫోల్డర్‌లోకి లాగండి. అవి Drive‌లోకి అప్‌లోడ్ అవుతాయి, వాటిని మీరు drive.google.comలో కనుగొంటారు.

ప్రింట్ వీక్షణ నుండి సేవ్ చేయండి 

ముఖ్య గమనిక: మీరు Google Driveకు సేవ్ చేయండి ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేశారని నిర్ధారించుకోండి. 

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. మీరు ప్రింట్ చేయాలనుకుంటున్న పేజీ, ఇమేజ్, లేదా ఫైల్‌ను తెరవండి.
  3. ఎగువున, ఫైల్ ఆ తర్వాత ప్రింట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. విండోలో, Driveకు సేవ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి లేదా మరిన్ని చూడండి ఆ తర్వాత Driveకు సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  5. ప్రింట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

డాక్యుమెంట్‌లను Google ఫార్మాట్‌లలోకి మార్చండి

మీరు Microsoft Word డాక్యుమెంట్స్ వంటి ఫైళ్లను అప్‌లోడ్ చేయాలనుకుంటే, మీరు సెట్టింగ్‌ను 'ఫైళ్లను మార్చండి'కి మార్చవచ్చు.

ముఖ్య గమనిక: మీరు మీ కంప్యూటర్ నుండి మాత్రమే Google Drive సెట్టింగ్‌లను మార్చగలరు.

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి, drive.google.com/drive/settingsకు వెళ్లండి.
  2. "అప్‌లోడ్‌లను మార్చండి" పక్కన, బాక్స్‌ను ఎంచుకోండి.

ఫైళ్లను అదే పేరుతో అప్‌లోడ్ చేయండి

మీరు ఒక ఫైల్‌ను అదే పేరుతో అప్‌లోడ్ చేస్తే, Google Drive ఆ ఫైల్‌ను అప్పటికే Google Drive‌లో ఉన్న ఫైల్‌కు మునుపటి వెర్షన్‌గా అప్‌లోడ్ చేస్తుంది.

రెండు ఫైల్‌లను భద్రపరచడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
  3. వేరే ఫైల్‌గా ఉంచండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4189243029688652395
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false