యాక్టివిటీ, ఫైల్ వెర్షన్‌లను చెక్ చేయండి

Driveలో మీ ఫైళ్లకు చేసిన మార్పులను యాక్సెస్ చేయండి, అలాగే ఆ మార్పులు ఎవరు చేశారో ట్రాక్ చేయండి. ఎవరైనా వీటిని చేసినప్పుడు మీకు మార్పులు కనిపించవచ్చు:

  • ఫైల్‌లో ఎడిట్‌లు లేదా కామెంట్‌లు
  • ఫైల్ లేదా ఫోల్డర్ పేరు మార్చడం
  • ఫైల్ లేదా ఫోల్డర్‌ను తరలించడం లేదా తీసివేయడం
  • ఫోల్డర్‌లోకి కొత్త ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం
  • ఐటెమ్‌ను షేర్ చేయడం లేదా షేరింగ్‌ను తీసివేయడం

ముఖ్య గమనిక: Google Docs, Sheets, Slidesకు సంబంధించిన వెర్షన్ హిస్టరీ అనేది .pdf ఫైళ్లు, ఇమేజ్‌లు, Driveలో స్టోర్ అయిన ఇతర ఫైళ్లకు సంబంధించిన హిస్టరీ కంటే భిన్నమైనది. Google ఫైల్స్‌కు సంబంధించిన మార్పుల హిస్టరీని యాక్సెస్ చేయడం ఎలాగో తెలుసుకోండి

గత యాక్టివిటీని యాక్సెస్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఎడమ వైపు, 'నా డ్రైవ్' ఎంపికను క్లిక్ చేయండి.
  3. ఎగువున కుడి వైపున, సమాచారం సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఇటీవలి మార్పులను యాక్సెస్ చేయడానికి, యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. నిర్దిష్ట ఫైల్ లేదా ఫోల్డర్ యాక్టివిటీని యాక్సెస్ చేయడానికి, ఫైల్ లేదా ఫోల్డర్‌ను క్లిక్ చేయండి.
  6. ఇటీవలి మార్పులను యాక్సెస్ చేయడానికి, కుడి వైపున కిందికి స్క్రోల్ చేయండి.

తాజా వెర్షన్‌లను సేవ్ చేసి, రీస్టోర్ చేయండి

ఎప్పటికీ ఇలాగే ఉంచండి ఆప్షన్‌ను మీరు క్లిక్ చేస్తే తప్పించి గత డాక్యుమెంట్‌లకు సంబంధించిన అత్యంత తాజా వెర్షన్‌లు మాత్రమే సేవ్ అవుతాయి.

తాజా వెర్షన్‌లను డౌన్‌లోడ్ చేయండి

Google Driveలో స్టోర్ చేసిన PDF ఫైల్స్, ఇమేజ్‌లు, ఇతర ఫైల్స్‌కు సంబంధించిన పాత కాపీలను మీరు డౌన్‌లోడ్ చేసుకుని, స్టోర్ చేసుకోవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత వెర్షన్‌లను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  4. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వెర్షన్ పక్కన, 'మరిన్ని మరిన్ని' ఎంపికను క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్‌లో కాపీని సేవ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత వెర్షన్‌లను మేనేజ్ చేయండి ఆ తర్వాత కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేయండి.

చిట్కా:మీరు వేరొకరికి చెందిన ఫైల్ కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తే, ఒరిజినల్ ఓనర్‌గా వారే ఉంటారు.

మునుపటి వెర్షన్‌ను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. మీరు భర్తీ చేయాలనుకుంటున్న ఫైల్‌పై క్లిక్ చేయండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాతవెర్షన్‌లను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకునే వెర్షన్ పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తొలగించండిని క్లిక్ చేయండి.

వెర్షన్ హిస్టరీ

Google Docs, Sheets, Slides వెర్షన్ హిస్టరీ అనేది Google Driveలో ఫైల్ వెర్షన్‌లకు భిన్నంగా ఉంటుంది. Google ఫైల్స్‌కు సంబంధించి మార్పుల హిస్టరీని చూడటం ఎలాగో తెలుసుకోండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
451104471000567249
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false