మీ ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను చూడండి, అలాగే వాటి క్రమాన్ని మార్చండి

మీరు సులభంగా కనుగొనడానికి వీలుగా, లేఅవుట్‌లను మార్చవచ్చు, అలాగే మీ ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను క్రమపద్ధతిలో అమర్చవచ్చు.

నా డ్రైవ్‌లో, మీరు మీ ఫైల్స్ లిస్ట్‌ను క్రమపద్ధతిలో అమర్చడానికి 4 మార్గాలు ఉన్నాయి:

చిట్కా: మీరు "హోమ్ పేజీ" లేదా "ఇటీవలి" పేజీలో ఉన్నట్లయితే, మీ ఫైల్స్‌ను మీరు క్రమపద్ధతిలో అమర్చలేరు.

Google Driveలో ఫైల్స్‌ను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.

లిస్ట్ & గ్రిడ్ లేఅవుట్‌ల మధ్య మార్పులు చేయండి

Google Driveలో ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను చూడటానికి 2 మార్గాలు ఉన్నాయి: లిస్ట్ ఇంకా గ్రిడ్ లేఅవుట్. Drive ఆటోమేటిక్‌గా లిస్ట్ లేఅవుట్‌ను చూపుతుంది.

  • గ్రిడ్ లేఅవుట్‌కు మార్చడానికి, మీ టూల్‌బార్‌కు వెళ్లి, గ్రిడ్ లేఅవుట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  • లిస్ట్ లేఅవుట్‌కు తిరిగి మార్చడానికి, మీ టూల్‌బార్‌కు వెళ్లి, లిస్ట్ లేఅవుట్ చిహ్నాన్ని మెను క్లిక్ చేయండి.

ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను మళ్లీ సరిగా అమర్చండి

మీ ఫైల్స్‌ను మీరు లిస్ట్ రూపంలో చూస్తున్నట్లయితే

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్‌లో, నా డ్రైవ్ను క్లిక్ చేయండి.
  3. మీరు క్రమపద్ధతిలో అమర్చడం కోసం ఉపయోగించాలనుకుంటున్న నిలువు వరుసపై క్లిక్ చేయండి.
  4. క్రమాన్ని రివర్స్ చేయడానికి, పై వైపు బాణం Up arrow లేదా కింది వైపు బాణం down arrowను క్లిక్ చేయండి.

మీ ఫైళ్లను మీరు గ్రిడ్ రూపంలో చూస్తున్నట్లయితే

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్‌లో, నా డ్రైవ్ను క్లిక్ చేయండి.
  3. ఎగువ కుడి వైపున ఉన్న, "పేరు" లేదా "ఎడిట్ చేసినవి" వంటి ప్రస్తుత క్రమపద్ధతిలో అమర్చిన టైటిల్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు కోరుకునే క్రమపద్ధతి రకంపై క్లిక్ చేయండి.
  5. క్రమాన్ని రివర్స్ చేయడానికి, పై వైపు బాణం Up arrow లేదా కింది వైపు బాణం down arrowను క్లిక్ చేయండి.

ఇటీవల ఎడిట్ చేసిన ఫైళ్లను కనుగొనండి

అత్యంత ఇటీవల ఎడిట్ చేయబడిన ఫైల్‌లను చూడండి.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపు, 'సమాచారం సమాచారం' క్లిక్ చేయండి.
  3. యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు మీ ఫైళ్లు & ఫోల్డర్‌లను ఎలా క్రమపద్ధతిలో అమర్చాలో మార్చండి

"నా డ్రైవ్," "నాతో షేర్ చేసినవి," మరియు "స్టార్ ఉన్నవి" వీక్షణలలో, మీరు ఫైళ్లు, ఫోల్డర్‌లను కలిపి చూపించడాన్ని ఎంచుకోవచ్చు లేదా కింద ఫైళ్లను పైన ఫోల్డర్‌లను చూపించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Driveకు వెళ్లండి.
  2. కుడి వైపున, వెంటనే మీ ఫైళ్ల లిస్ట్ పైన, మెనూని క్లిక్ చేయండి మరిన్ని.
  3. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి. వీటిని ఈ విధంగా చూపడానికి:
    • ఫోల్డర్‌లు పైన, పై భాగంలో ఆప్షన్‌‌ను క్లిక్ చేయండి.
    • ఫైళ్లు ఫోల్డర్‌లను కలిపి చూపడానికి ఫైళ్ళతో కలిపి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: ఫైళ్లు, ఫోల్డర్‌లను క్రమపద్ధతిలో అమర్చడానికి మీ ప్రాధాన్యతలు సేవ్ చేయబడతాయి; పైన దశలను అనుసరించి కొత్త ఎంపికను చేయడం ద్వారా మీరు మీ క్రమపద్ధతిలో అమర్చే ఆప్షన్‌లను అప్‌డేట్ చేయవచ్చు.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10862132458370303343
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false