వ్యక్తిగత అంతరంగిక లేదా లైంగిక కంటెంట్‌ను తీసివేయమని రిక్వెస్ట్ చేయండి

మీకు సంబంధించిన ప్రైవేట్, నగ్నంగా చూపే, అందరికీ తగని లైంగిక, లేదా అంతరంగిక, ఇమేజ్‌లను, వీడియోలను సమ్మతి లేకుండా షేర్ చేయడం బాధ కలిగించవచ్చని మేము అర్థం చేసుకున్నాము. అంతరంగిక కంటెంట్‌లో, గోప్యతకు అధిక ప్రాధాన్యత ఉండే స్థలం (బెడ్‌రూమ్ లేదా బాత్‌రూమ్ వంటివి), పరిస్థితి (దుస్తులు ధరించిన భంగిమ వంటివి) ఉంటాయి.

Google మీకు లేదా మీకు ప్రాతినిధ్యం వహించే వారికి సంబంధించి ఈ కింద పేర్కొన్న కంటెంట్‌ను తీసివేయడంలో సహాయం చేయగలదు:

  • నగ్నంగా చూపే, అంతరంగిక, అందరికీ తగని లైంగిక కంటెంట్ (ఉదాహరణకు, మీ ఇమేజ్‌లు లేదా వీడియోలు) ఉండి, అది మీ అనుమతి లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయబడితే; లేదా
  • మీరు నగ్నంగా లేదా అందరికీ తగని లైంగిక పరిస్థితిలో ఉన్నట్లుగా చూపే నకిలీ కంటెంట్ లేదా తప్పుడు చిత్రీకరణలు; లేదా
  • మిమ్మల్ని లేదా మీ పేరును, నగ్నంగా లేదా అందరికీ తగని లైంగిక ఇమేజ్‌లతో, లేదా అవి ప్రదర్శించబడే సందర్భం ద్వారా అనుబంధించే కంటెంట్

ఈ ఇమేజ్‌లను, వీడియోలను షేర్ చేయడాన్ని కింద పేర్కొన్న Google ప్రోడక్ట్‌లలో నియంత్రించాలని రిక్వెస్ట్ చేయడానికి ఈ ఫారమ్ మీకు వీలు కల్పిస్తుంది:

  • Blogger
  • Drive
  • Groups
  • Photos
  • Sites
  • Classroom

 తీసివేత రిక్వెస్ట్‌ను ప్రారంభించండి

మీ రిక్వెస్ట్‌ను అందుకున్న తర్వాత:

  1. మేము రిక్వెస్ట్‌ను అందుకున్నట్లు నిర్ధారిస్తూ మీకు ఆటోమేటెడ్ ఈమెయిల్ వస్తుంది
  2. మేము మీ రిక్వెస్ట్‌ను రివ్యూ చేస్తాము.
  3. అవసరమైతే, మేము మరింత సమాచారాన్ని సేకరిస్తాము. కొన్ని సందర్భాలలో, మేము మిమ్మల్ని మరింత సమాచారం అందించమని అడగవచ్చు. అంచనా వేయడానికి, మిస్ అయిన URL వంటి తగినంత సమాచారం రిక్వెస్ట్‌తో పాటు జోడించకపోతే, మేము నిర్దిష్ట సూచనలను షేర్ చేసి, రిక్వెస్ట్‌ను మళ్లీ సమర్పించమని అడుగుతాము.
  4. ఏదైనా చర్య తీసుకుంటే, దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మీరు పొందుతారు. రిక్వెస్ట్ అనేది తీసివేత ఆవశ్యకతలకు అనుగుణంగా లేకపోతే, మేము కొంత వివరణను కూడా చేర్చుతాము. మీ రిక్వెస్ట్ తిరస్కరించబడి, తర్వాత మీ కేసుకు సపోర్ట్ చేయడానికి మీ వద్ద అదనపు మెటీరియల్స్ ఉంటే, మీరు మీ రిక్వెస్ట్‌ను మళ్లీ సమర్పించవచ్చు.
  5. ఇమేజ్‌లను షేర్ చేయడాన్ని నియంత్రించమని ఒక రిక్వెస్ట్ వచ్చిందని మేము దాన్ని షేర్ చేసిన వ్యక్తికి కూడా తెలియజేయవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

రివ్యూ కోసం నేను ఏ URLలను సమర్పించాలి?

Google ప్రోడక్ట్‌ల నుండి తీసివేయడం కోసం మేము రివ్యూ చేయాలని మీరు కోరుకునే అన్ని పేజీల URLలను మీరు తప్పనిసరిగా సమర్పించాలి. మీరు పేజీలోని పెద్ద సంఖ్యలో ఉన్న ఇమేజ్‌ల విషయంలో ఆందోళన చెందుతుంటే, మీరు స్క్రీన్‌షాట్‌ను కూడా అందించవచ్చు లేదా మీరు ఇమేజ్‌ను సమర్పిస్తున్నట్లయితే, పేజీ URLకు అదనంగా ఇమేజ్ URLను అందించండి. (URLను కనుగొనడం ఎలాగో తెలుసుకోండి)

నేను ఒకటి కంటే ఎక్కువ URLలను రివ్యూ కోసం ఎలా సమర్పించాలి?

ఫారమ్‌లోని URL ఫీల్డ్‌లో, ఒక లైన్‌కు ఒక URL చొప్పున జోడించండి. మీరు 1,000 URLల వరకు సమర్పించవచ్చు.

నా ఇమేజ్ ఎందుకు నియంత్రించబడలేదు?

మేము ఇమేజ్‌ను షేర్ చేయడాన్ని నియంత్రించలేని సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, మేము వార్తాల్లో నిలిచిన లేదా డాక్యుమెంటరీ ఇమేజ్‌లను షేర్ చేయడాన్ని నియంత్రించలేము, బలమైన ప్రజా ప్రయోజనం ఉన్న, గుర్తించలేని సబ్జెక్ట్‌లు ఉన్న, వాస్తవానికి అవి ఫోటోలు కానప్పుడు, లేదా సదరు ఫోటోల విషయంలో ఎలాంటి వివాదాలు లేనప్పుడు మేము వాటిని షేర్ చేయడాన్ని నియంత్రించలేము. మీ ఇమేజ్ ఎందుకు నియత్రించబడలేదనే దాని గురించి సంక్షిప్త వివరణను మేము మీకు ఈమెయిల్ చేస్తాము.

నేను ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను, నేను ఇంకా ఏమి చేయగలను?

మీ హక్కులను అర్థం చేసుకోవడం, మీకు అవసరమైనప్పుడు దానికి తగిన విధంగా సపోర్ట్‌ను పొందడం ఎంతో ముఖ్యం. మీరు మా సహాయ కేంద్రంలో కొన్ని సపోర్ట్ రిసోర్స్‌లను యాక్సెస్ చేయవచ్చు.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15026940971179116972
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false