Google Driveలో ఫైళ్లకు లేబుల్స్‌ను వర్తింపజేయండి

మీరు ఆఫీస్ లేదా స్కూల్ కోసం Driveను ఉపయోగిస్తే, ఫైళ్లను ఆర్గనైజ్ చేయడానికి మీ సంస్థ లేబుల్స్‌ను సెటప్ చేయవచ్చు.  

చిట్కాలు: 

  • మీరు ఒక్కో ఫైల్‌కు గరిష్ఠంగా 5 లేబుల్స్‌ను వర్తింపజేయవచ్చు.
  • అడ్మినిస్ట్రేటర్‌లు మాత్రమే లేబుల్స్‌ను క్రియేట్ చేయగలరు.
  • ఫైల్‌కు లేబుల్స్‌ను వర్తింపజేయడానికి, అడ్మినిస్ట్రేటర్ తప్పనిసరిగా మీకు యాక్సెస్‌ను అందించాలి, అలాగే ఫైల్‌ను ఎడిట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించాలి.
  • ఫైల్‌కు వర్తింపజేసిన లేబుల్స్‌ను కనుగొనడానికి లేదా వాటి లేబుల్స్ ద్వారా ఫైళ్ల కోసం సెర్చ్ చేయడానికి, మీకు కింద పేర్కొన్న వాటికి అనుమతి ఉండాలి: 
    • ఫైల్‌కు యాక్సెస్ ఉండాలి
    • లేబుల్ కోసం సెర్చ్ చేసి దాన్ని చూడటానికి, మీకు దాన్ని చూడటానికి అనుమతి ఉండాలి

తెరవని ఫైల్‌కు లేబుల్స్‌ను వర్తింపజేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Driveకు వెళ్లండి.
  2. ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి ఆ తర్వాత లేబుల్స్  ఆ తర్వాత లేబుల్స్‌ను వర్తింపజేయండి ని క్లిక్ చేయండి.
  3. మీరు వర్తింపజేయాలనుకుంటున్న లేబుల్‌ను ఎంచుకోండి.
  4. లేబుల్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డ్స్‌ను కలిగి ఉంటే, మీరు విలువలను ఎంచుకోవచ్చు లేదా ఎంటర్ చేయవచ్చు.

చిట్కాలు:

  • ఫైల్ నుండి లేబుల్‌ను తీసివేయడానికి, మీరు తీసివేయాలనుకుంటున్న లేబుల్‌ను కనుగొని, తీసివేయండి తీసివేయిని క్లిక్ చేయండి.
  • మీరు లేబుల్స్ విభాగాన్ని కనుగొనలేకపోతే, మీ అడ్మినిస్ట్రేటర్ లేబుల్స్‌ను సెటప్ చేసి ఉండకపోవచ్చు లేదా మిమ్మల్ని యాక్సెస్ చేయడానికి అనుమతించకపోవచ్చు. మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.

లేబుల్స్‌ను బల్క్‌గా వర్తింపజేయండి 

  1. మీ కంప్యూటర్‌లో, Driveకు వెళ్లండి.
  2. మీరు లేబుల్‌ను వర్తింపజేయడం కోసం గరిష్ఠంగా 100 ఫైళ్లను ఎంచుకోండి.
  3. మౌస్‌పై కుడి క్లిక్ చేసి, ఆపై లేబుల్స్ ఆ తర్వాత లేబుల్‌ను వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లేబుల్‌ను ఎంచుకుని, ఫైల్‌కు వర్తింపజేయడానికి ఏవైనా ఫీల్డ్ విలువలను ఎంచుకోండి.

Docs, Sheets, లేదా Slidesలోని ఫైళ్లకు లేబుల్స్‌ను వర్తింపజేయండి 

  1. మీ కంప్యూటర్‌లో, Docs, Sheets, లేదా Slidesకు వెళ్లండి. 
  2. ఫైల్ ఆ తర్వాత లేబుల్స్ ను క్లిక్ చేయండి.
  3. సైడ్ ప్యానెల్‌లో, లేబుల్స్‌ను రివ్యూ చేసి, కొత్త వాటిని వర్తింపజేయండి. 
  4. ఫైల్ నుండి లేబుల్‌ను తీసివేయడానికి, లేబుల్‌ను ఎంచుకుని, తీసివేయండి తీసివేయిని క్లిక్ చేయండి.

Drive ప్రివ్యూలో Google యేతర ఫైళ్లకు లేబుల్స్‌ను వర్తింపజేయండి 

  1. మీ కంప్యూటర్‌లో, Driveకు వెళ్లండి.
  2. Drive ప్రివ్యూలో ఫైల్‌ను చూడటానికి, మరిన్ని మరిన్నిఆ తర్వాత లేబుల్స్ ను క్లిక్ చేయండి.
  3. సైడ్ ప్యానెల్‌లో, లేబుల్స్‌ను రివ్యూ చేసి, కొత్త వాటిని వర్తింపజేయండి. 
  4. ఫైల్ నుండి లేబుల్‌ను తీసివేయడానికి, లేబుల్‌ను ఎంచుకుని, తీసివేయండి తీసివేయిని క్లిక్ చేయండి.

లేబుల్స్‌తో ఉన్న ఫైళ్ల కోసం సెర్చ్ చేయండి

నిర్దిష్ట లేబుల్స్ లేదా ఫీల్డ్స్‌తో ఉన్న కంటెంట్‌ను కనుగొనడానికి Drive సెర్చ్ ఆప్షన్‌లను ఉపయోగించండి. 

  1. మీ కంప్యూటర్‌లో, Driveకు వెళ్లండి.
  2. ఎగువున, Driveలో సెర్చ్ చేయండి ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “లేబుల్స్” పక్కన, లేబుల్స్‌ను సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లేబుల్‌ను క్లిక్ చేయండి. మీరు ఫీల్డ్‌ను ఎంచుకుని, విలువను పేర్కొనవచ్చు.
  5. సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సెర్చ్ అనేది మీకు యాక్సెస్ చేయడానికి అనుమతి ఉన్న ఫైళ్ల ఫలితాలను మాత్రమే అందిస్తుంది.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8915235479753839318
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false