Driveలో స్పామ్‌ను గుర్తు పెట్టండి లేదా గుర్తును తీసివేయండి

Gmailలో స్పామ్ ఫోల్డర్ ఎలా పని చేస్తుందో అలాగే, Drive అవాంఛితమని అనుమానించే ఫైళ్లను ఆటోమేటిక్ క్లాసిఫయర్‌లు స్పామ్ ఫోల్డర్‌కు మళ్లిస్తాయి. మీరు ఫైళ్లను స్పామ్ ఫోల్డర్‌లోకి, వెలుపలకు మాన్యువల్‌గా కూడా తరలించవచ్చు. ఒక ఫైల్ స్పామ్ ఫోల్డర్‌లో 30 రోజులకు పైగా ఉన్న తర్వాత, అది మీ Drive నుండి శాశ్వతంగా తీసివేయబడుతుంది.

మీరు Driveలో షేర్ చేసిన ఫైళ్లను స్పామ్‌గా రిపోర్ట్ చేయవచ్చు. మీరు స్పామ్‌గా రిపోర్ట్ చేసే ఫైళ్లు:

  • ఇకపై కామెంట్‌ల కోసం నోటిఫికేషన్‌లను జెనరేట్ చేయవు
  • Drive సెర్చ్ లేదా సూచించబడిన ఫైళ్లలో కనిపించవు
  • పాలసీ ఉల్లంఘనల కోసం ఫైళ్లను Google రివ్యూ చేస్తుంది

ముఖ్య గమనిక: మీకు లేదా మీ సంస్థ మెంబర్‌లకు చెందిన ఫైళ్లను మీరు రిపోర్ట్ చేయలేరు.

ఫైల్‌ను స్పామ్‌గా మార్క్ చేయండి

  1. మీ iPhone లేదా iPadలో, Drive యాప్ Google Drive చిహ్నంను తెరవండి.
  2. మీరు రిపోర్ట్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను కనుగొని, మరిన్ని ని ట్యాప్ చేయండి ఆ తర్వాత రిపోర్ట్ చేయండి ని ఎంచుకోండి.
  3. ఫారమ్‌ను పూర్తి చేయండి:
    1. అవాంఛిత కంటెంట్ రకాల లిస్ట్ నుండి ఎంచుకోండి ఆ తర్వాత రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
    2. మీరు యూజర్‌ను బ్లాక్ చేయాలనుకుంటే ఎంచుకోండి.

 చిట్కాలు:

  • చట్టవిరుద్ధమైన కంటెంట్ రకాన్ని ఎంచుకున్నట్లయితే, మీరు ఆ కంటెంట్ రకం కోసం ఓవర్‌వ్యూ పేజీకి మళ్లించబడతారు. రిపోర్ట్‌ను ఎలా పూర్తి చేయాలి అనే దాని గురించి ఓవర్‌వ్యూ పేజీ మరింత సమాచారాన్ని అందిస్తుంది. 
  • మీరు రిపోర్ట్ చేయండి ని క్లిక్ చేసినప్పుడు లేదా మాన్యువల్‌గా ఫైల్‌ను స్పామ్‌లోకి తరలించినప్పుడు, Googleకు తెలియజేయబడుతుంది. 
    • స్పామ్, దుర్వినియోగం నుండి మా యూజర్‌లను రక్షించడంలో సహాయపడటానికి, ఫైల్‌ను Google విశ్లేషించవచ్చు.
  • మీరు స్పామ్‌ను రిపోర్ట్ చేసిన తర్వాత, ఫైల్ స్పామ్‌కు తరలించబడుతుంది, అలాగే అది 30 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.

ఫైల్‌కు వర్తింపజేసిన స్పామ్ గుర్తును తీసివేయండి 

  1. మీ iPhone లేదా iPadలో, Drive యాప్ Google Drive చిహ్నంను తెరవండి.
  2. స్పామ్‌ను తెరవండి.
  3. మీరు ఏ ఫైల్ నుండి అయితే స్పామ్ గుర్తును తీసివేయాలనుకుంటున్నారో ఆ ఫైల్‌ను కనుగొని, మరిన్ని ని ట్యాప్ చేయండి ఆ తర్వాత స్పామ్ కాదు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్పామ్‌లోని ఫైళ్లను తొలగించండి

  1. మీ iPhone లేదా iPadలో, Drive యాప్ Google Drive చిహ్నంను తెరవండి.
  2. స్పామ్‌ను తెరవండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న ఫైల్‌ను కనుగొనండి లేదా ఎగువున, మరిన్ని ని ట్యాప్ చేయండి ఆ తర్వాత శాశ్వతంగా తొలగించండి ని ట్యాప్ చేయండి. 

చిట్కా: స్పామ్‌లోని అన్ని ఫైళ్లను తొలగించడానికి, స్పామ్ ఫోల్డర్ ఎగువున, ఇప్పుడే అన్ని స్పామ్ ఫైళ్లను తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6982697551179516448
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false