Gmail స్పేస్‌లలో మీ ఫైల్స్‌ని మేనేజ్ చేయండి

Gmailలో స్పేసెస్ ఇంకా ఫైళ్లను వినియోగించడానికి, మీ Gmail సెట్టింగ్‌లలో Google Chatను ఆన్ చేయండి. Gmailలో Chatను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి

Gmail స్పేస్‌లో ఫైల్స్‌ని చూడండి, మేనేజ్ చేయండి

స్పేస్‌లో షేర్ చేసిన ఫైళ్లు, లింక్‌లు ఇంకా మీడియాకు సంబంధించిన లిస్ట్‌ను మీరు చూడవచ్చు, అలాగే ఫైల్‌ను తెరవవచ్చు, అంతేకాకుండా ఫైల్‌ను Driveకు జోడించవచ్చు. షేర్ చేయబడిన ఫైల్‌తో ఉన్న చాట్ మెసేజ్‌ను మీరు తొలగిస్తే, అది స్పేస్ నుండి కూడా తొలగించబడుతుంది.

ఒకవేళ మీరు Driveలో ఫైల్‌ను తొలగిస్తే, మీరు తొలగించేంతవరకూ ఆ ఫైల్ లింక్ స్పేస్‌లోనే, అది షేర్ చేయబడిన చోటే ఉంటుంది. చాట్ మెసేజ్ నుండి మీరు ఫైల్‌ను తొలగించినప్పుడు, చాట్ నుండి, అలాగే స్పేస్‌లోని షేర్ చేసినవి ట్యాబ్ నుండి ఫైల్ లింక్ తీసివేయబడుతుంది.

Attach a file to a discussion.

  1. Gmailని తెరవండి.
  2. స్పేస్‌ను ఎంచుకోండి.
  3. ఎగువ భాగంలో ఉండే, Files ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: Files ట్యాబ్ కనిపించకపోతే, స్పేస్‌ను ఫుల్ స్క్రీన్‌కు విస్తరించండి. హిస్టరీ ఆన్‌లో ఉన్నప్పుడు, ఫైల్‌లు తేదీ ప్రకారం క్రమపద్ధతిలో అమర్చబడి చూపించబడతాయి.
  4. ఫైల్‌ను తెరవడానికి, ఫైల్ పేరును క్లిక్ చేయండి.
    • Google Docs, Sheets, Slides కోసం: చాట్ విండోలోని సంభాషణ పక్కన ఫైల్ తెరుచుకుంటుంది.
    • ఇతర Google ఫైల్స్ కోసం: కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో ఫైల్ తెరుచుకుంటుంది. 
    • మిగిలిన ఇతర రకాల ఫైల్‌ల అన్నింటి కొరకు: ఫైల్ ఫుల్ స్క్రీన్ ప్రివ్యూగా తెరుచుకుంటుంది.

చిట్కా:  ఒకవేళ ఫైల్ Driveకు జోడించబడకపోతే, దానిని డౌన్‌లోడ్ చేయడానికి ఫైల్ పేరును క్లిక్ చేయండి. PDFలు, వీడియో ఫైల్‌లు, కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో తెరుచుకుంటాయి.

స్పేస్ ద్వారా ఇప్పటికే ఉన్న Google Docs, Sheets, Slidesలలో సహకరించవచ్చు

మీరు నేరుగా స్పేస్‌లోనే షేర్ చేయబడిన Google Docs, Sheets, Slidesలో మీ టీమ్ మెంబర్‌లకు సహకారం అందించవచ్చు. సంభాషణ పక్కనున్న చాట్ విండోలో డాక్యుమెంట్ లేదా స్ప్రెడ్‌షీట్ తెరుచుకుంటుంది, ఇక్కడ మీరు ఇతరులతో కలిసి ఫైల్‌లో సహకరించుకుంటూ చాట్ చేసే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. మీరు మీ టీమ్ మెంబర్‌లతో కలిసి పని చేసినప్పుడు, మీరు Gmailను వదలకుండా ఫైల్స్‌ను ఎడిట్ చేయవచ్చు, ఫార్మాట్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు, ఇంకా వాటి పేరును మార్చవచ్చు. కామెంట్‌లతో పని చేయడానికి, లేదా Docs, Sheets లేదా Slidesకు సంబంధించిన ఇతర ఫీచర్‌లను ఉపయోగించడానికి, కొత్త ట్యాబ్‌లో ఫైల్‌ను తెరవండి. 

  1. Gmailను తెరవండి.
  2. స్పేస్‌ను ఎంచుకుని, అది ఇప్పటికే ఫుల్ స్క్రీన్‌లో కనుక లేకపోతే, దాన్ని ఫుల్ స్క్రీన్‌కు విస్తరించండి.
    • ఇంతకుముందే షేర్ చేయబడిన డాక్యుమెంట్‌ను తెరవడానికి, దాన్ని చాట్‌లో పాయింట్ చేయండి ఆ తర్వాత చాట్‌లో తెరువు ను క్లిక్ చేయండి. డాక్యుమెంట్ కుడి వైపునకు తెరవబడుతుంది, ఇక్కడ మీరు ట్యాబ్‌లను మార్చకుండానే నేరుగా ఎడిట్‌లు చేయవచ్చు.
    • స్పేస్‌లోనే షేర్ చేసిన డాక్యుమెంట్‌ను క్రియేట్ చేయడానికి, "సంభాషణ" ట్యాబ్‌లో రిప్లయి ఇచ్చే ప్రదేశంలో, ఇంటిగ్రేషన్ మెనూ  ఆ తర్వాత Google Docs  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • తెరిచి ఉన్న డాక్యుమెంట్‌ను మూయడానికి, ఎగువున కుడి వైపున ఉన్న మూసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఆప్షనల్: కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో డాక్యుమెంట్‌ను తెరవడానికి, సంభాషణ ప్రివ్యూలోని ఎగువున కుడి వైపున, కొత్త ట్యాబ్‌లో తెరవండి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: ప్రత్యక్ష చాట్ మెసేజ్‌లలో, ఇప్పటికే ఉన్న Google Docs, Sheets, Slidesలలో కూడా మీరు సహకరించుకోవచ్చు.

ఫైల్‌ను జోడించు

మీరు ఈ ఫార్మాట్‌లలో 200-MB వరకు ఫైల్‌లను జోడించవచ్చు:

  • .bmp
  • .gif
  • .jpg
  • .png
  • .wbmp
  • .heic

మీరు స్పేస్‌లో, ఒక ఫైల్‌ను కొన్ని విభిన్న మార్గాలలో జోడించవచ్చు. మీరు ఫైల్స్‌ను, స్పేస్‌లోని Chat ట్యాబ్ లేదా Files ట్యాబ్‌లో జోడించవచ్చు.

Chat ట్యాబ్ నుండి ఫైల్‌ను జోడించండి

Chat ట్యాబ్‌లో, మీరు మీ కంప్యూటర్ నుండి లేదా Google Drive నుండి ఫైల్‌ను జోడించవచ్చు.

మీ కంప్యూటర్ నుండి ఫైల్‌ను జోడించండి

  1. Click Upload .
  2. Select the file you want to send ఆ తర్వాత click Send .

Tip: The file is not added to Drive. Other participants get the file directly in the message.

Google Drive నుండి ఫైల్‌ను జోడించండి

  1. Google Drive ను క్లిక్ చేయండి.
  2. మీరు పంపాలనుకుంటున్న ఫైల్‌ను ఎంచుకోండి. ఇది మీ Driveలోని ఫైల్ కావచ్చు లేదా మీ డెస్క్‌టాప్ గానీ, డౌన్‌లోడ్‌ల నుండి గానీ అప్‌లోడ్ చేసిన ఫైల్ కావచ్చు.

చిట్కా: మీరు స్పేస్‌కు జోడించడానికి ఫైల్‌ను ఎంచుకున్న తర్వాత, స్పేస్‌లోని మెంబర్‌ల కోసం యాక్సెస్ సెట్టింగ్‌లను ఎంచుకోమని మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మీరు ఫైల్‌ను ఎడిట్ చేయగలిగితే, స్పేస్‌లోని అందరికీ చూడగలిగే, కామెంట్ చేయగలిగే లేదా ఎడిట్ చేయగలిగే యాక్సెస్‌ను మంజూరు చేసే ఆప్షన్ మీకు కనబడుతుంది. మీరు స్పేస్‌లోని ప్రతిఒక్కరికీ యాక్సెస్‌ను మంజూరు చేస్తే, అది స్పేస్‌లో తర్వాత చేరే వ్యక్తులకు కూడా వర్తిస్తుంది.

  1. పంపు Send Arrowను క్లిక్ చేయండి.

Files ట్యాబ్ నుండి ఫైల్‌ను జోడించండి

మీరు స్పేస్‌లోని Files ట్యాబ్‌కు ఫైళ్లను నేరుగా జోడించవచ్చు.

  1. ఫైల్‌ను జోడించండి ని క్లిక్ చేయండి.
  2. మీరు స్పేస్‌కు జోడించాలనుకుంటున్న ఫైల్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీరు ఫైల్‌ను పంపినప్పుడు, స్పేస్ లేదా స్పేస్‌లో ఉన్న ఎవరికైనా యాక్సెస్ లేకుంటే మీకు అలర్ట్ వస్తుంది. మీరు ఫైల్‌ను ఎడిట్ చేయగలిగితే, స్పేస్‌లోని అందరికీ చూడగలిగే, కామెంట్ చేయగలిగే లేదా ఎడిట్ చేయగలిగే యాక్సెస్‌ను మంజూరు చేసే ఆప్షన్ మీకు కనబడుతుంది. మీరు స్పేస్‌లోని అందరికీ యాక్సెస్‌ను మంజూరు చేస్తే, అది స్పేస్‌లో తర్వాత చేరే వ్యక్తులకు కూడా వర్తిస్తుంది.

  1. Files ట్యాబ్‌కు జోడించడానికి, మీరు ఫైల్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత, చాట్ విండోలో ఫైల్‌తో కూడిన డ్రాఫ్ట్ మెసేజ్ క్రియేట్ అవుతుంది. మీరు దాన్ని సమర్పించే ముందు డాక్యుమెంట్ లింక్‌తో పాటు మెసేజ్‌ను కూడా జోడించవచ్చు.
  2. పంపు ను క్లిక్ చేయండి.

Chat‌లో ఫైల్‌లు బ్లాక్ చేయబడ్డాయి

Google Chatలో మీకు అప్‌లోడ్ ఎర్రర్ కనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎగ్జిక్యూట్ అయ్యే ఫైల్స్ లాంటి వైరస్‌లను వ్యాప్తి చేసే ఫైల్స్‌ను Chat బ్లాక్ చేస్తుంది. హానికరమైన సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్‌గా ఉండటానికి, అనుమతించబడని ఫైల్ రకాల గురించి Chat తరచుగా అప్‌డేట్ అవుతుంది.

అటువంటి ఫైల్స్ రకాలను మీరు జోడించడం సాధ్యపడదు. వాటిలో ఈ ఫైల్స్ రకాలు ఉంటాయి:

  • ADE, ADP, APK, BAT, CAB, CHM, CMD, COM, CPL, DLL, DMG, EXE, HTA, INS, ISP, JAR, JS, JSE, LIB, LNK, MDE, MSC, MSI, MSP, MST, NSH, PIF, SCR, SCT, SHB, SYS, VB, VBE, VBS, VXD, WSC, WSF, మరియు WSH.
    GZ లేదా BZ2 ఫైల్స్ లాంటి ఏదైనా కుదించిన రూపంలో ఉన్న ఫైల్స్, లేదా ZIP లేదా TGZ ఫైల్స్ లాంటి ఆర్కైవ్‌లలో కనిపించే ఫైల్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉంటాయి.
  • హానికారక మ్యాక్రోలు గల డాక్యుమెంట్‌లు.
  • ఆర్కైవ్‌ని కంటెంట్‌గా కలిగి ఉండే పాస్‌వర్డ్‌లతో రక్షింపబడిన ఆర్కైవ్‌లు.

ఒకవేళ పై లిస్ట్‌లో బ్లాక్ చేయబడిన ఫైల్ లేకపోతే, ఆ బ్లాక్ చేయబడిన ఫైల్ సురక్షితమేనని మీరు నిర్ధారించుకుని, ఫైల్‌ను Driveకు అప్‌లోడ్ చేసి, ఆపై ఫైల్‌ను Drive అటాచ్‌మెంట్‌గా పంపించండి.

ఒక ఫైల్‌ను తీసివేయండి

  1. Gmailని తెరవండి.
  2. స్పేస్‌ను ఎంచుకోండి:
  3. ఎగువ భాగంలో ఉండే, Files ట్యాబ్‌ను క్లిక్ చేయండి. Gmailలో, Files ట్యాబ్‌ను చూడటానికి మీరు స్పేస్‌ను ఫుల్ స్క్రీన్‌కు విస్తరించాల్సి ఉంటుంది.
  4. 'చాట్‌లో చూడండి' ని క్లిక్ చేయండి ఆ తర్వాత ఫైల్ ఎక్కడైతే షేర్ చేయబడిందో, ఆ చాట్ మెసేజ్‌కు స్క్రోల్ చేయండి.
  5. ఫైల్ పక్కన ఉన్న, మరిన్ని చర్యలు ఆ తర్వాత తొలగించండి ని క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీరు Driveలో ఫైల్‌ను తొలగిస్తే, ఆ ఫైల్ లింక్ స్పేస్‌లోనే దాన్ని షేర్ చేయబడిన చాట్ మెసేజ్ నుండి తొలగించేంతవరకూ అలాగే ఉంటుంది.
    • మీరు దాన్ని చాట్ నుండి తొలగించకపోతే, ఫైల్ కోసం Drive చర్యలు డిజేబుల్ అవుతాయి, ఇంకా ఫైల్ లింక్‌ను క్లిక్ చేసినప్పుడు అది "ఫైల్ ట్రాష్‌లో ఉంది" అనే మెసేజ్‌ను చూపిస్తుంది.
    • మీరు దాన్ని చాట్ నుండి తొలగించకుండా మీ Drive ట్రాష్ ను ఖాళీ చేస్తే, ఫైల్ లింక్‌ను క్లిక్ చేసినప్పుడు "ఫైల్ తొలగించబడింది" అనే మెసేజ్‌ను అది చూపిస్తుంది అంతే గాక ఫైల్ టైటిల్ దాన్ని మొదట షేర్ చేసినప్పుడు ఉన్న ఒరిజినల్ టైటిల్‌కు మారుతుంది.
  • చాట్ మెసేజ్ నుండి ఫైల్‌ను మీరు తొలగించినప్పుడు, చాట్ నుండి, స్పేస్‌లోని Files ట్యాబ్ నుండి, ఫైల్ లింక్ తీసివేయబడుతుంది. 

మీ ఫైల్‌లను Google Driveలో ఆర్గనైజ్ చేయండి & మేనేజ్ చేయండి

  • Google Driveకు ఫైల్‌ను జోడించడానికి, 'Drive నా డిస్క్‌కు జోడించుకు జోడించండి'ని క్లిక్ చేయండి.
  • Driveలో ఫైల్‌ను తరలించడానికి మీకు అనుమతి ఉంటే, 'తరలించండి 'ని క్లిక్ చేయండి.
  • Driveలో ఫైల్‌ను తరలించడానికి మీకు అనుమతి లేకపోతే, 'Drive కు షార్ట్‌కట్‌ను జోడించండి'ని క్లిక్ చేయండి.
  • మీరు ఫైల్‌కు షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసినట్లయితే, 'మరొక షార్ట్‌కట్‌ను Drive కు జోడించండి'ని క్లిక్ చేయండి.

చిట్కా: షేర్ చేయబడిన ఫైల్‌తో చాట్ మెసేజ్‌ను తెరవడానికి, 'Chat లో చూడండి'ని క్లిక్ చేయండి.

Google Driveలో ఫైల్‌ల కోసం షార్ట్‌కట్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి. 

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15753646180367378484
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false