మీ డాక్యుమెంట్‌ను జూమ్ చేయండి లేదా దాని వీక్షణ మార్చండి

మీరు డాక్యుమెంట్, ప్రెజెంటేషన్, లేదా స్ప్రెడ్‌షీట్ కనిపించే తీరును మార్చవచ్చు, ఉదాహరణకు, టెక్స్ట్‌ను పెద్దదిగా చేయడం లేదా పైన ఉన్న టూల్‌బార్‌ను దాచడం.

స్లయిడ్‌లో జూమ్ చేయడానికి, మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.

జూమ్ - ఇన్ లేదా జూమ్ - అవుట్

Google Docs లేదా Sheets ఫైల్‌లో జూమ్‌ను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్లో డాక్యుమెంట్‌ని తెరవండి లేదా Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. టూల్‌బార్‌లో, 100%ను క్లిక్ చేయండి.
  3. మీరు మీ టెక్స్ట్‌ను ఎంత పెద్దదిగా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి లేదా 50 నుండి 200 మధ్య నంబర్‌ను ఎంటర్ చేయండి.
    • చిట్కా: Google Docsలో, డాక్యుమెంట్‌ను బ్రౌజర్ విండో అంత పరిమాణానికి మార్చడానికి, ఫిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Slides ఫైల్‌లో జూమ్‌ను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Slidesలో ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. టూల్‌బార్‌లో, ఫిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. డ్రాప్‌డౌన్ నుండి జూమ్ ఆప్షన్‌ను ఎంచుకోండి లేదా 25, 1600 మధ్య ఏదైనా నంబర్‌ను ఎంటర్ చేయండి.
    1. చిట్కా: కాన్వాస్‌ను బ్రౌజర్ విండో అంత పరిమాణానికి మార్చడానికి, ఫిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ వీక్షణను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. టూల్‌బార్‌లో, చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆ తర్వాత ఒక ఆప్షన్‌‍ను క్లిక్ చేయండి.
    • ఫుల్ స్క్రీన్: మెనూ, టూల్‌బార్‌ను దాచుతుంది. ఫుల్ స్క్రీన్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డ్‌లో, Esc లేదా Escape నొక్కండి. మీరు టచ్ స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, సంబంధిత మెనూను తెరవడానికి నొక్కి, పట్టుకోండి ఆ తర్వాత ఫుల్ స్క్రీన్ నుండి నిష్క్రమించండి.  
    • ప్రింట్ లేఅవుట్‌ను చూడండి: ఈ ఆప్షన్ పేజీల ఫార్మాట్‌లో ఉన్న Google Docsలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు డాక్యుమెంట్‌ను ప్రింట్ చేసినట్లుగా పేజీల మధ్య మీ హెడర్‌లు, ఫుటర్‌లు, అలాగే మార్జిన్‌లను చూడండి.

చిట్కా: Google Docs, Sheets, అలాగే Slides మీ ఇటీవలి వీక్షణను గుర్తుంచుకుంటాయి. మీరు మీ వీక్షణను మార్చినప్పుడు, ఫైల్‌ను చూసే ఇతరుల విషయంలో అది మారదు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17240519236785334035
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false