చిత్రాలు & వీడియోలను చేర్చండి లేదా తొలగించండి

మీరు Google డాక్స్ లేదా షీట్‌లలో ఫోటోలు, వీడియోలు లేదా .gif ఫైల్‌లను జోడించగలరు లేదా తీసివేయగలరు. Google స్లయిడ్‌లలో మీరు ఫోటోలు, వీడియోలు లేదా ఆడియోని జోడించగలరు.

డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌కు చిత్రాన్ని జోడించండి

 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 2. చేర్చు ఆ తర్వాత చిత్రం క్లిక్ చేయండి.
 3. మీ ఇమేజ్‌ను ఎక్కడ నుండి పొందాలో ఎంచుకోండి.
  • కంప్యూటర్ నుండి అప్‌లోడ్ చేయండి: మీ పరికరంలో సేవ్ చేసిన ఇమేజ్‌ను ఇన్‌సర్ట్ చేయండి.
  • వెబ్‌లో వెతకండి: ఇమేజ్ కోసం వెబ్‌లో వెతకండి.
  • డ్రైవ్: Google డిస్క్‌లో సేవ్ చేసిన ఇమేజ్‌ను ఉపయోగించండి.
  • ఫోటోలు: Google ఫోటోల లైబ్రరీ నుండి ఇమేజ్‌ను ఉపయోగించండి.
  • URL ద్వారా: మీ ఇమేజ్‌కు లింక్‌ను ఇన్‌సర్ట్ చేయండి లేదా .gifను ఇన్‌సర్ట్ చేయండి.
 4. ఇన్‌సర్ట్ లేదా తెరువును క్లిక్ చేయండి.

షీట్‌లలో ఇమేజెస్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.

ఒక డాక్యుమెంట్‌లో ఇమేజ్‌ను పొజిషన్, ఎడిట్ చేయండి 

 1. మీ కంప్యూటర్‌లో, Google Docsకు వెళ్లండి.
 2. ఒక డాక్యుమెంట్‌ను తెరవండి.
 3. మీరు తరలించాలనుకుంటున్న లేదా ఎడిట్ చేయాలనుకుంటున్న ఇమేజ్‌ను క్లిక్ చేయండి. ఎడిటింగ్ ఆప్షన్‌లతో దిగువ భాగాన ఒక పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.
 4. మీ ఇమేజ్ లేఅవుట్‌ను మార్చడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
  • లైన్ లోపల ఉంచు
  • టెక్స్ట్‌ను వ్రాప్ చేయి
  • టెక్స్ట్‌ను బ్రేక్ చేయి
 5. మీరు "వ్రాప్ టెక్స్ట్" లేదా "బ్రేక్ టెక్స్ట్"ను ఎంచుకుంటే, స్థానాన్ని దీనికి మార్చవచ్చు:
  • టెక్స్ట్‌తో తరలించు
  • పేజీలో స్థానాన్ని స్థిరపరుచు
 6. మరిన్ని ఎంపికల కోసం, ఇమేజ్ ఎంపికలు More and then అన్ని ఇమేజ్ ఎంపికలపై క్లిక్ చేయండి.
 7. కుడివైపు ఉన్న సైడ్‌బార్‌లో, ఇమేజ్ ఆప్షన్‌ను ఎంచుకోండి:

  • పరిమాణం & భ్రమణం: మీ ఇమేజ్ పరిమాణం, భ్రమణాలను సెట్ చేయండి.

  • టెక్స్ట్ వ్రాపింగ్: మీ ఇమేజ్, దాని చుట్టూ ఉన్న టెక్స్ట్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో సెట్ చేయండి.

  • స్థానం: డాక్యుమెంట్‌లో మీ ఇమేజ్ కోసం స్థానాన్ని సెట్ చేయండి. 

  • రంగు మార్పు: మీ ఇమేజ్ రంగుని మార్చండి.

  • సర్దుబాట్లు: మీ ఇమేజ్ పారదర్శకత, కాంతి, కాంట్రాస్ట్‌ను సెట్ చేయండి.

మీ డెస్క్‌టాప్ నుండి లేదా వెబ్ నుండి ఇమేజ్‌ను జోడించండి

ఇమేజ్‌ను లాగండి

ముఖ్యం: ఈ ఫీచర్ Google షీట్‌లకు అందుబాటులో లేదు.

 1. మీ కంప్యూటర్‌లో, మీ కంప్యూటర్ లేదా వెబ్‌సైట్‌లోని ఇమేజ్‌ను క్లిక్ చేయండి.
 2. మీ డాక్యుమెంట్‌లోకి ఇమేజ్‌ను హోల్డ్ చేసి, లాగండి.

ఇమేజ్‌ను కాపీ చేసి & అతికించండి

 1. మీ కంప్యూటర్‌లో, మీ కంప్యూటర్ లేదా వెబ్‌సైట్‌లోని ఇమేజ్‌పై కుడి క్లిక్ చేయండి.
 2. కాపీ క్లిక్ చేయండి. 
 3. మీ డాక్యుమెంట్, ప్రెజెంటేషన్, లేదా స్ప్రెడ్‌షీట్‌కు వెళ్లండి.
 4. అతికించు అతికించును క్లిక్ చేయండి.

చిట్కా: మీ ఇమేజ్‌ను తెరవడానికి కాస్త సమయం పట్టవచ్చు.

ఇమేజ్‌ను భర్తీ చేయండి
 1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్లేదా స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 2. మీరు భర్తీ చేయాలనుకుంటున్న ఇమేజ్‌పై కుడి క్లిక్ చేయండి.
 3. ఇమేజ్‌ను భర్తీ చేయిని క్లిక్ చేయండి.
 4. మీరు ఎక్కడ నుండి మీ ఇమేజ్‌ను పొందాలనుకుంటున్నారో ఎంచుకోండి:
  • కంప్యూటర్ నుండి అప్‌లోడ్ చేయండి
  • వెబ్‌లో వెతకండి
  • డ్రైవ్
  • ఫోటోలు
  • URL ద్వారా
  • కెమెరా
 5. ఇమేజ్‌ను ఎంచుకోండి.
 6. భర్తీ చేయి లేదా ఎంపిక చేయి క్లిక్ చేయండి.

షీట్‌లలో చిత్రాలను ఎలా భర్తీ చేయాలో తెలుసుకోండి.

ప్రెజెంటేషన్‌కి వీడియోని జోడించండి

 1. మీ కంప్యూటర్‌లో, Google స్లయిడ్‌లలో ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 2. మీరు వీడియోని జోడించాలనుకుంటున్న స్లయిడ్‌ను క్లిక్ చేయండి.
 3. ఇన్‌సర్ట్ ఆ తర్వాత వీడియోని క్లిక్ చేయండి.
 4. మీ వీడియోని ఎక్కడ నుండి పొందాలో ఎంచుకోండి:
  • YouTubeలో వెతకండి
  • URL ద్వారా
  • Google డిస్క్
 5. వీడియోని ఎంచుకోండి.
 6. ఎంపిక చేయిని క్లిక్ చేయండి.

ప్రెజెంటేషన్‌కు ఆడియోని జోడించండి

మీరు మీ డ్రైవ్‌లో స్టోర్ చేయబడిన .mp3, .wav ఫైల్స్‌ను ప్రెజెంటేషన్‌కు జోడించవచ్చు. Google డిస్క్‌కు ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయాడం ఎలాగో తెలుసుకోండి.

 1. మీ కంప్యూటర్‌లో, Google స్లయిడ్‌లలో ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 2. మీరు ఆడియో ఫైల్‌ని జోడించాలనుకుంటున్న స్లయిడ్‌ని ఎంచుకోండి.
 3. ఇన్‌సర్ట్ ఆ తర్వాత ఆడియోని క్లిక్ చేయండి.
 4. ఆడియో ఫైల్‌ను ఎంచుకోండి.
 5. ఎంపిక చేయిని క్లిక్ చేయండి.

చిట్కా: మీరు Chrome, Firefox, Safari, Microsoft Edge నుండి .wav ఫైల్స్‌ను ఉపయోగించవచ్చు.

సంబంధిత కథనం

చిత్రాలను డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లో కత్తిరించి సర్దుబాటు చేయండి

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?