Connected Sheetsని ఉపయోగించి BigQuery డేటాను విశ్లేషించండి & రిఫ్రెష్ డేటాను ఉపయోగించండి

మీరు ఫంక్షన్‌లు, చార్ట్‌లు, సారాంశాలు, పివోట్ టేబుల్‌లను ఉపయోగించవచ్చు, అదే విధంగా Google Sheetsలో BigQuery డేటాను రిఫ్రెష్ చేయవచ్చు. 

ముఖ్య గమనిక: Google Sheetsలో BigQuery డేటాను యాక్సెస్ చేయడానికి, మీకు BigQueryకి యాక్సెస్ అవసరం. BigQueryతో ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. పైభాగంలో, చార్ట్ క్లిక్ చేయండి.
  3. ఎక్కడ ఉంచాలో ఎంచుకోండి.
  4. రూపొందించు క్లిక్ చేయండి.
  5. కుడి వైపు, మీ ఇతర సెట్టింగ్‌లను ఎంచుకోండి.
  6. దిగువున కుడి వైపు, వర్తింపజేయి క్లిక్ చేయండి.

Google Sheetsలో చార్ట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

చిట్కా: తాజా BigQuery డేటా ఆధారంగా చార్ట్‌ను అప్‌డేట్ చేయడానికి, చార్ట్ దిగువ భాగంలో, రిఫ్రెష్ చేయి క్లిక్ చేయండి.

పివోట్ టేబుల్‌ను యాడ్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. ఎగువన, పివోట్ టేబుల్ క్లిక్ చేయండి.
  3. ఎక్కడ ఉంచాలో ఎంచుకోండి.
  4. రూపొందించు క్లిక్ చేయండి.
  5. కుడి వైపు, మీ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
  6. దిగువున కుడి వైపు, వర్తింపజేయి క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • పివోట్ టేబుల్స్ ప్రస్తుతం 50,000 వరకు ఫలితాలకు సపోర్ట్ చేయగలవు.
  • మీ పివోట్ టేబుల్‌లో మీకు కనిపించే డేటా పరిమాణాన్ని పరిమితం చేయడానికి, ఎన్ని అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలు అందించాలన్నది పేర్కొనండి. ఏయే అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలు అందించాలో పేర్కొనడానికి “దీని ప్రకారం క్రమపద్ధతిలో అమర్చు”, అలాగే “ఆర్డర్” ఆప్షన్‌లను అప్‌డేట్ చేయండి. 
  • SUM లేదా అనుకూల ఫార్ములాతో గణించబడిన ఫీల్డ్‌లను జోడించడానికి, సైడ్ ప్యానెల్‌లో, “విలువలు” పక్కన ఉన్న, జోడించు ఆ తర్వాత గణించబడిన ఫీల్డ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. పివోట్ టేబుల్‌లలో గణించబడిన ఫీల్డ్‌లను ఎలా జోడించాలో తెలుసుకోండి.
  • తాజా BigQuery డేటాకు అప్‌డేట్ చేయడానికి, పివోట్ టేబుల్ దిగువున, రిఫ్రెష్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • పరిధి లోపల ఉన్న వ్యవధులలో విలువలను చూడటానికి, హిస్టోగ్రామ్ గ్రూపింగ్‌ను ఉపయోగించండి. గరిష్ఠం కంటే ఎక్కువగా ఉన్న, అలాగే కనిష్ఠం కన్నా తక్కువగా ఉన్న విలువలు ఒకటిగా గ్రూప్ చేయబడతాయి.
ఫంక్షన్‌ను ఉపయోగించండి

మీరు కొన్ని ఫంక్షన్‌లను BigQuery డేటాతో ఉపయోగించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. పైభాగంలో, ఫంక్షన్ క్లిక్ చేయండి.
  3. లిస్ట్ నుండి ఒక ఫంక్షన్‌ను ఎంచుకోండి.
  4. ఫంక్షన్‌ను ఎక్కడ ఉంచాలో ఎంచుకోండి.
  5. రూపొందించు క్లిక్ చేయండి.
  6. మీ సూచన నిలువు వరుసను ఎంచుకుని, ఇంకేవైనా అవసరమైన పారామీటర్‌లను యాడ్ చేయండి.
  7. Enter నొక్కండి.
  8. మీ మౌస్‌ను ఫార్ములా కలిగి ఉండే సెల్‌పై ఉంచి, ఆ తర్వాత మార్పులను వర్తింపజేయి క్లిక్ చేయండి.


చిట్కా: అలాగే మీరు ఏదైనా సెల్ లోపల కూడా ఫంక్షన్‌లను టైప్ చేయవచ్చు. 

డేటాను సారాంశంలోకి లాగండి

మీరు డేటాను ఆఫ్‌లైన్‌లో విశ్లేషించవచ్చు లేదా ఫంక్షన్‌లలో వేర్వేరు విలువలు, పరిధులు సూచించవచ్చు. మీ BigQuery డేటా నుండి గరిష్ఠంగా 50,000 అడ్డు వరుసలు లేదా 10MB వరకు పొందవచ్చు. మీరు ఈ పరిమితి కంటే ఎక్కువ పొందడానికి ట్రై చేస్తే, కేవలం మొదటి 50,000 అడ్డు వరుసలు మాత్రమే కనిపిస్తాయి. 

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    1. ఎగువన ఉన్న, ఎక్స్‌ట్రాక్ట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. దీనిని ఎక్కడ ఉంచాలో ఎంచుకోండి.
  4. రూపొందించు క్లిక్ చేయండి.
  5. కుడి వైపు, "సారాంశం ఎడిటర్" దిగువున నిలువు వరుసలు, ఫిల్టర్‌లు, క్రమపద్ధతిలో అమర్చే సెట్టింగ్‌లు యాడ్ చేయండి.
  6. సారాంశానికి దిగువున ఎడమ వైపు, మార్పులను వర్తింపజేయి క్లిక్ చేయండి.
డేటా సెట్‌లోని అన్ని అడ్డు వరుసలకు లెక్కింపును జోడించి, నిలువు వరుస గణాంకాలను చూడండి

లెక్కించిన నిలువు వరుసను జోడించడం ద్వారా మీరు అన్ని అడ్డు వరుసలకు లెక్కింపును వర్తింపజేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. పైభాగంలో, లెక్కించిన నిలువు వరుసను క్లిక్ చేయండి.
  3. నిలువు వరుస పేర్లు, సపోర్ట్ ఉన్న Sheets ఫంక్షన్‌లు ఉపయోగించి ఫార్ములాను ఎంటర్ చేయండి. మీరు =price * quantity లాంటి ప్రాథమిక గణిత లెక్కలు ఉపయోగించవచ్చు లేదా =RIGHT(orderId, 4)తో టెక్స్ట్‌ని నియంత్రించవచ్చు. 
  4. జోడించును క్లిక్ చేయండి.
  5. షీట్‌లో దిగువ ఎడమ వైపున, వర్తింపజేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: నిలువు వరుస గణాంకాలను చూడటానికి, నిలువు వరుసకు సంబంధించిన ఎగువ కుడి వైపున, కింది వైపు బాణం గుర్తు కింది వైపు బాణం గుర్తు ఆ తర్వాత నిలువు వరుస గణాంకాలను చూపించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సపోర్ట్ ఉన్న ఫంక్షన్‌లు
లాజిక్ ఫంక్షన్‌లు
  • IF (ఎర్రర్‌లు ఏర్పడే అవకాశం ఉన్న వాటిని అంటే, సున్నాతో భాగహారం లాంటి వాటిని గుర్తించడానికి ఉపయోగించవచ్చు)
  • AND
  • OR
  • NOT

లుకప్ ఫంక్షన్‌లు:

ఫిల్టర్ ఫంక్షన్‌లు

  • FILTER
టెక్స్ట్ ఫంక్షన్‌లు
  • LEFT, RIGHT, MID
  • UPPER, LOWER
  • LEN
  • CONCAT (&)
ప్రాథమిక గణితం
  • +, -, *, /
  • రుణాత్మక గుర్తు (-), శాతం గుర్తు (%)

గణితపరమైన ఫంక్షన్‌లు

  • ROUND
  • POW/POWER (^)
  • SQRT
  • ABS
  • LOG, LN, LOG10

తేదీలు, సమయాలు

  • DATE, TIME
  • YEAR, MONTH, DAY
  • HOUR, MINUTE, SECOND
పోలిక
  • =, <>
  • >, >=, <, <=
సముదాయాలు
  • SUM
  • SUMIF
  • SUMIFS
  • COUNT
  • COUNTBLANK
  • COUNTIF
  • COUNTIFS
  • COUNTUNIQUE
  • COUNTUNIQUEIFS
  • MIN
  • MINIFS
  • MAX
  • MAXIFS
  • AVERAGE
  • AVERAGEIF
  • AVERAGEIFS
  • VAR
  • VARP
  • STDEV
  • STDEVP

ఇతరం

  • ISBLANK (ఇవ్వబడిన ఆర్గ్యుమెంట్ NULL అవునో, కాదో తెలియజేస్తుంది)

మీ డేటాను రిఫ్రెష్ చేయండి

BigQuery డేటా ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేయబడిన షీట్‌లతో సింక్ అవ్వదు. డేటాను సింక్ చేయడానికి, మీరు నిర్దిష ఐటెమ్‌ను, డేటా సోర్స్‌లోని ప్రతి దానిని లేదా అన్ని డేటా సోర్స్‌లలోని ప్రతి దానిని రిఫ్రెష్ చేయవచ్చు. మీరు డేటా సోర్స్‌కు కనెక్ట్ అయిన తర్వాత ఆ డేటాను, దానితో అనుబంధితమైన చార్ట్‌లు, ఫంక్షన్‌లు, సారాంశాలు, పివోట్ టేబుల్‌లు లాంటి అన్ని ఆబ్జెక్ట్‌లను రిఫ్రెష్ చేయవచ్చు. 
  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. దిగువున, "రిఫ్రెష్" పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత రిఫ్రెష్ ఆప్షన్‌లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపు, "రిఫ్రెష్ ఆఫ్షన్‌లు" దిగువున, మీరు రిఫ్రెష్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌లు క్లిక్ చేయండి. మొత్తం డేటాను రిఫ్రెష్ చేయడానికి, దిగువున కుడి వైపున ఉన్న, అన్నీ రిఫ్రెష్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
రిఫ్రెష్‌ను షెడ్యూల్ చేయండి

ముఖ్య గమనిక: కనెక్ట్ చేయబడిన షీట్‌ల షెడ్యూల్ చేయబడిన రిఫ్రెష్‌లు, IP అడ్రస్ లేదా పరికర సమాచారం వంటి ఎలాంటి ఎండ్ యూజర్ సందర్భాన్ని ప్రచారం చేయవు. యాక్సెస్‌ను పరిమితం చేయడానికి ఎండ్ యూజర్ సందర్భాన్ని ఉపయోగించే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ సర్వీస్ కంట్రోల్స్ (VPC-SC) పెరీమీటర్‌ల వలన షెడ్యూల్ చేసిన రిఫ్రెష్‌లు విఫలమవుతాయి.

షెడ్యూల్ చేసిన రిఫ్రెష్ అనేది అన్ని ఆబ్జెక్ట్‌లు, డేటా సోర్స్‌లను నిర్దిష్టమైన, ప్రీసెట్ సమయంలో అప్‌డేట్ చేస్తుంది.
ముఖ్య గమనిక:

  • షెడ్యూల్‌ను సెటప్ చేసే యూజర్ ప్రకారం షెడ్యూల్ చేసిన రిఫ్రెష్ రన్ అవుతుంది. మరొక యూజర్ ఇప్పటికే ఉన్న డేటా సోర్స్‌ను యాడ్ చేస్తే లేదా అప్‌డేట్ చేస్తే, షెడ్యూల్ ఆటోమేటిక్‌గా పాజ్ అవుతుంది. అన్‌పాజ్ చేయడానికి, షెడ్యూల్ యజమానిని సంప్రదించండి లేదా పూర్తిగా రిఫ్రెష్ చేయండి.
  • ప్రివ్యూ లేదా విఫలమైన స్థితిలోని ఆబ్జెక్ట్‌లు షెడ్యూల్ చేసిన రిఫ్రెష్‌తో రిఫ్రెష్ అవ్వవు. 
  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. కింది భాగంలో, "రిఫ్రెష్" పక్కన, 'మరిన్ని మరిన్ని ఆ తర్వాత రిఫ్రెష్ ఆప్షన్‌లు' క్లిక్ చేయండి.
  3. సైడ్‌బార్ దిగువున కుడివైపు, “షెడ్యూల్ చేసిన రిఫ్రెష్” కింద, ఇప్పుడే సెటప్ చేయి క్లిక్ చేయండి.
  4. మీ రిఫ్రెష్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
షెడ్యూల్ చేసిన రిఫ్రెష్‌పై నియంత్రణ పొందండి

ఒరిజినల్ యజమాని బదులుగా మీరే షెడ్యూల్ చేసిన రిఫ్రెష్‌ను రన్ చేయడానికి, మీరు రిఫ్రెష్ నియంత్రణను పొందవచ్చు. 

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. దిగువున, "రిఫ్రెష్" పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత రిఫ్రెష్ ఆప్షన్‌లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపు ఉండే సైడ్‌బార్ కింది భాగంలో, “షెడ్యూల్ చేసిన రిఫ్రెష్” దిగువున, ఎడిట్ చేయి క్లిక్ చేయండి.
  4. మీ రిఫ్రెష్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి. 
  5. షెడ్యూల్ చేసిన రిఫ్రెష్ యాజమాన్య హక్కును మీకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
     

క్వెరీ వివరాలను చూడండి, క్వెరీని రద్దు చేయండి

స్ప్రెడ్‌షీట్ ఎడిటర్‌లు, అవసరమైన BigQuery అనుమతులు ఉన్న యూజర్‌లు అడుగుతున్న క్వెరీని రద్దు చేయవచ్చు. 

ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్‌ల కోసం క్వెరీ వివరాలను చూడటానికి:

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. దిగువున ఉన్న పాప్-అప్ రిఫ్రెష్ బటన్‌లో, BigQueryలోని క్వెరీ వివరాలను చూడటానికి సమాచారాన్ని The info icon. క్లిక్ చేయండి.
    1. గమనిక: క్వెరీని రన్ చేయకుండా డేటాను పొందగలిగితే The info icon. చూపబడదు. క్వెరీని రన్ చేయకుండా టేబుల్ డేటాను అన్వేషించడం గురించి మరింత తెలుసుకోండి.

ఏవైనా డేటాబేస్ ఆబ్జెక్ట్‌ల కోసం క్వెరీని రద్దు చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. క్వెరీ రన్ అవుతున్నప్పుడు లేదా పెండింగ్‌లో ఉన్నప్పుడు: దిగువున ఉన్న పాప్-అప్ రిఫ్రెష్ బటన్‌లో, “రన్నింగ్ క్వెరీ” లేదా “క్వెరీ పెండింగ్” పక్కన ఉన్న, లెక్కించబడిన రన్నింగ్ టైమ్ పక్కన ఉన్న రద్దు చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. నిర్ధారించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు రిఫ్రెష్ ఆప్షన్స్ సైడ్‌బార్ నుండి క్వెరీని కూడా రద్దు చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, BigQuery డేటాకు కనెక్ట్ అయి ఉండే స్ప్రెడ్‌షీట్‌ను Google Sheetsలో తెరవండి.
  2. దిగువున్న ఉన్న, రిఫ్రెష్ చిహ్నంపై మౌస్ కర్సర్ ఉంచి రిఫ్రెష్ చేయి, "రిఫ్రెష్ చేయండి" పక్కన ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత రిఫ్రెష్ ఆప్షన్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఒక్కొక్కటిగా రన్ అవుతున్న రిఫ్రెష్‌ను రద్దు చేయడానికి, ప్రతి ఐటెమ్ పక్కన ఉన్న, రద్దు చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. నిర్ధారించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: 
  • మీరు BigQuery డేటాసెట్ కోసం అవసరమైన BigQuery అనుమతిని కలిగి లేకుంటే, క్వెరీ రద్దు చేసే చర్య పూర్తి చేయడం సాధ్యం కాదు.
  • షీట్‌ల గడువు ముగిసిన కారణంగా విఫలమైన క్వెరీ డేటాబేస్‌లో రన్ అవుతూ ఉండవచ్చు.

తర్వాత: Sheetsలో BigQuery డేటాతో క్వెరీని రాయండి, ఎడిట్ చేయండి

సంబంధిత ఆర్టికల్స్

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
241062743615374162
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false