Google Sheetsలో BigQuery డేటాతో ప్రారంభించండి

మీరు కొత్త BigQuery డేటా కనెక్టర్ అయిన కనెక్ట్ చేయబడిన షీట్‌లతో మీ స్ప్రెడ్‌షీట్‌లోని బిలియన్‌ల అడ్డు వరుసల డేటాను యాక్సెస్ చేయవచ్చు, విశ్లేషించవచ్చు, విజువలైజ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. వీటి కోసం కూడా మీరు కనెక్ట్ చేయబడిన షీట్‌లని ఉపయోగించవచ్చు: 
 

  • సుపరిచితమైన స్ప్రెడ్‌షీట్ ఇంటర్‌ఫేస్‌లో పార్ట్‌నర్‌లు, విశ్లేషణకర్తలు లేదా ఇతర స్టేక్‌హోల్డర్‌లతో కలిసి పని చేయడం. 
  • డేటా విశ్లేషణ కోసం అదనపు .csv ఎగుమతులు లేకుండా ఒకటే ఉండే అసలుసిసలైన మూలాధారం కలిగి ఉండేలా నిర్ధారించుకోవాలి.
  • మీ రిపోర్టింగ్, డాష్‌బోర్డ్ వర్క్‌ఫ్లోలను క్రమబద్ధం చేసుకోవాలి.

మీరు మాన్యువల్‌గా రిక్వెస్ట్ చేసినప్పుడు లేదా నిర్వచించిన షెడ్యూల్ ప్రకారం కనెక్ట్ చేయబడిన షీట్‌లు మీ తరఫున BigQueryలో క్వెరీలను రన్ చేస్తుంది. ఆ క్వెరీల యొక్క ఫలితాలు విశ్లేషణ, షేరింగ్ కోసం మీ స్ప్రెడ్‌షీట్‌లో సేవ్ చేయబడతాయి.

Google Sheetsలో BigQuery డేటాతో పని చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి వీడియో ట్యుటోరియల్‌ను చూడండి.

చిట్కా: మీరు హిస్టారికల్ డేటా కనెక్టర్‌ను ఉపయోగించి ఉంటే, దాని నుండి పొందే సారాంశాల ద్వారా మీ మునుపటి వర్క్‌ఫ్లోలో మీరు చూసే అదే టేబుల్ వీక్షణను రూపొందించవచ్చు. అలాగే మీరు మీ డేటాను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడానికి షెడ్యూల్ చేసిన రిఫ్రెష్‌లను కూడా సెటప్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు కనెక్ట్ చేయబడిన షీట్‌లలో BigQuery డేటాను యాక్సెస్ చేసినప్పుడు, ఎంట్రీలు క్లౌడ్ ఆడిట్ లాగ్‌లలో రికార్డ్ చేయబడతాయి. డేటాను ఎవరు, ఎప్పుడు యాక్సెస్ చేశారో లాగ్‌లు చూపుతాయి. సరైన ప్రామాణీకరణ ఉన్న వ్యక్తులు మాత్రమే లాగ్ రికార్డ్‌లను యాక్సెస్ చేయగలరు. 

మీరు ఆడిట్ లాగ్‌లో స్ప్రెడ్‌షీట్ IDని కనుగొనవచ్చు. ప్రతి స్ప్రెడ్‌షీట్, అక్షరాలు, నంబర్‌లు, హైఫన్‌లు, లేదా అండర్‌స్కోర్‌లను కలిగి ఉండే ప్రత్యేక స్ప్రెడ్‌షీట్ ID విలువను కలిగి ఉంటుంది. మీరు Google Sheets URLలో స్ప్రెడ్‌షీట్ IDని కనుగొనవచ్చు.

క్లౌడ్ ఆడిట్ లాగ్స్ గురించి మరింత తెలుసుకోండి.

Google క్లౌడ్ రిసోర్స్‌లకు యాక్సెస్‌ను పరిమితం చేయడానికి, మీరు VPC సర్వీస్ కంట్రోల్స్‌ను ఉపయోగించవచ్చు. VPC సర్వీస్ కంట్రోల్స్ Sheetsకు సపోర్ట్ చేయనందున, VPC సర్వీస్ కంట్రోల్స్ రక్షించే BigQuery డేటాను మీరు యాక్సెస్ చేయలేకపోవచ్చు. మీకు అవసరమైన అనుమతులు ఉండి, VPC సర్వీస్ కంట్రోల్స్ యాక్సెస్ పరిమితులకు అనుగుణంగా ఉంటే, కనెక్ట్ చేయబడిన షీట్‌ల ద్వారా జారీ చేయబడిన క్వెరీలను అనుమతించడానికి మీరు VPC సర్వీస్ కంట్రోల్స్‌ను ఉపయోగించవచ్చు.

Google Sheetsలో నమూనా BigQuery డేటాతో పని చేయండి

కనెక్ట్ చేయబడిన షీట్‌లు ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి, మీరు కనెక్ట్ చేసిన షీట్ ఉదాహరణలు పబ్లిక్ డేటా ద్వారా పరిశీలించవచ్చు. 

  1. మీ కంప్యూటర్‌లో, Google Sheets టెంప్లేట్ గ్యాలరీని తెరవండి.
  2. కనెక్ట్ చేసిన షీట్ ఉదాహరణలలో ఒకదాన్ని ఎంచుకోండి.

మీకు అవసరమైనవి

Google Sheetsలో BigQuery డేటాను యాక్సెస్ చేయడానికి, మీరు కింది ఆవశ్యకాలు అన్నింటినీ పాటించాలి:

BigQuery ప్రాజెక్ట్‌ను యాడ్ చేయండి

ముఖ్య విషయం: మీరు Google Sheetsలో BigQuery డేటాను మార్చలేరు.
  1. మీ కంప్యూటర్‌లో Google Sheetsలో ఒక స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. పైభాగంలోని మెనూలో, 'డేటా ఆ తర్వాత డేటా కనెక్టర్‌లు ఆ తర్వాత BigQueryకి కనెక్ట్ చేయి' క్లిక్ చేయండి.
  3. ప్రాజెక్ట్‌ను ఎంచుకోండి.
  4. మీరు ఎలాంటి ప్రాజెక్ట్‌లను కనుగొనలేకపోతే, ఒకదాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది.
  5. ఒక టేబుల్‌ను ఎంచుకోండి లేదా చూడండి.
    • మీరు యాక్సెస్ కలిగి ఉన్న కంపెనీ టేబుల్ లేదా పబ్లిక్ డేటా సెట్‌ల నుండి ఎంచుకోవచ్చు.
  6. 'కనెక్ట్ చేయి ఆ తర్వాత విశ్లేషణను ప్రారంభించు' క్లిక్ చేయండి.

Use Connected Sheets on the Google Sheets app 

మీ మొబైల్ పరికరంలో Google Sheets యాప్‌ను ఉపయోగించి, మీరు వీటిని చేయవచ్చు:

  • కనెక్ట్ చేయబడిన షీట్‌ల డేటాను చూడవచ్చు.
  • లెక్కించిన నిలువు వరుస ఫార్ములాలు చూడవచ్చు, ఫిల్టర్‌లు, క్రమీకరణలు, కనెక్షన్ సెట్టింగులు చేయవచ్చు.
  • కనెక్ట్ చేయబడిన షీట్‌ల నుండి డేటాను కాపీ, పేస్ట్ చేయవచ్చు.

కనెక్ట్ చేయబడిన షీట్‌లలో డేటాను క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి లేదా రిఫ్రెష్ చేయడానికి, కంప్యూటర్‌లో Google Sheetsను తెరవండి.

తర్వాత: Sheetsలో మీ BigQuery డేటాను క్రమపద్ధతిలో అమర్చండి & ఫిల్టర్ చేయండి

సంబంధిత కథనాలు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6440335397766734032
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false