స్మార్ట్ కంపోజ్, అలాగే స్మార్ట్ రిప్లయిని ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఆఫీస్ లేదా స్కూల్ ఖాతా ఉన్న యూజర్‌లకు స్మార్ట్ కంపోజ్ ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ భాషలలో అందుబాటులో ఉంది. Google Docs, అలాగే Slides కోసం స్మార్ట్ రిప్లయి ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది.

స్మార్ట్ కంపోజ్, స్మార్ట్ రిప్లయి ఫీచర్‌లు సమాధానాలను అందించవు, అలాగే ఎల్లప్పుడూ వాస్తవికంగా సరైన సమాచారాన్ని అందించకపోవచ్చు. రెండు ఫీచర్‌లు సూచనలను అందించడానికి మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తాయి.

Google Docs, Slides, Sheets, Drawingsలలో స్మార్ట్ కంపోజ్

డాక్యుమెంట్‌లలో వేగంగా, మరింత సులభంగా రాయడంలో మీకు సహాయపడటానికి, మీరు Google Docs, Slides, Sheets, Drawingsలలో స్మార్ట్ కంపోజ్‌ను ఉపయోగించవచ్చు.
స్మార్ట్ కంపోజ్ ఫీచర్ Google Slides, అలాగే Drawings కోసం కామెంట్‌లలో కూడా అందుబాటులో ఉంది.

స్మార్ట్ కంపోజ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. ఫైల్‌ను తెరవండి. 
  2. ఎగువున, టూల్స్ఆ తర్వాతప్రాధాన్యతలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  3. స్మార్ట్ కంపోజ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, స్మార్ట్ కంపోజ్ సూచనలను చూపించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: మీరు Google Docsలో స్మార్ట్ కంపోజ్‌ను ఆఫ్ చేస్తే, ప్రధాన ఎడిటింగ్ విండోలో లేదా కామెంట్‌లలో స్మార్ట్ కంపోజ్ సూచనలు ప్రదర్శించబడవు. మీరు Google Sheetsలో స్మార్ట్ కంపోజ్‌ను ఆఫ్ చేయలేరు.

సూచనను ఆమోదించండి లేదా తిరస్కరించండి

స్మార్ట్ కంపోజ్ సూచనను ఆమోదించడానికి:

  • 'ట్యాబ్ కీ'ను నొక్కండి
  • 'కుడి వైపు బాణం కీ'ను నొక్కండి
  • Android లేదా iOSల కోసం: సూచించిన టెక్స్ట్‌పై కుడి వైపునకు స్వైప్ చేయండి
స్మార్ట్ కంపోజ్ సూచనను తిరస్కరించడానికి, టైప్ చేస్తూ ఉండండి.

Google Docs, అలాగే Slidesలో స్మార్ట్ రిప్లయి

కామెంట్‌లకు రిప్లయి ఇచ్చే సమయాన్ని సేవ్ చేయడానికి మీరు Google Docs, Slidesలలో స్మార్ట్ రిప్లయిని ఉపయోగించవచ్చు.

స్మార్ట్ రిప్లయిని ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. ఫైల్‌ను తెరవండి. 
  2. ఎగువున, టూల్స్ఆ తర్వాతప్రాధాన్యతలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  3. స్మార్ట్ రిప్లయిని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, స్మార్ట్ రిప్లయి సూచనలను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. సరే అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు స్మార్ట్ రిప్లయిని ఆఫ్ చేస్తే, కామెంట్‌లలో స్మార్ట్ రిప్లయి సూచనలు ప్రదర్శించబడవు.

సూచించిన రిప్లయిని ఆమోదించండి లేదా తిరస్కరించండి

స్మార్ట్ రిప్లయి సూచనను ఆమోదించడానికి:

  • సూచనపై క్లిక్ చేయండి
  • రిప్లయి బాక్స్‌పై ఫోకస్ చేసి, సూచన కోసం tabను నొక్కి, ఆ తర్వాత Enterను నొక్కండి
  • స్క్రీన్ రీడర్ వినియోగం కోసం చదివి వినిపించే సూచనలను ఫాలో అవ్వండి

స్మార్ట్ రిప్లయి సూచనను తిరస్కరించడానికి, రిప్లయి బాక్స్‌లో వేరొక పదాన్ని టైప్ చేయండి.

మెషిన్ లెర్నింగ్ గురించి

ప్రపంచం గురించి ఆటోమేటిక్‌గా తెలుసుకోవడానికి భాష అవగాహన నమూనాలలో బిలియన్‌ల కొద్దీ సాధారణ పదబంధాలు, వాక్యాలు ఉపయోగించబడతాయి, అవి మానవ అభిజ్ఞా పక్షపాతాలను కూడా ప్రతిబింబిస్తాయి. దీని గురించి తెలుసుకోవడం మంచి ప్రారంభం, అలాగే దీన్ని ఎలా నిర్వహించాలో అనే సంభాషణ కొనసాగుతోంది. అందరి కోసం ఉత్తమమైన ప్రోడక్ట్‌లను తయారు చేయడానికి Google కట్టుబడి ఉంటుంది, అనాలోచిత పక్షపాతం, తీవ్రతను తగ్గించే వ్యూహాల గురించి యాక్టివ్‌గా పరిశోధిస్తోంది.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5547340469052466052
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false