నవంబర్ 11, 2020 నుండి, ఇన్‌యాక్టివ్ లేదా కోటాను మించిపోయిన ఖాతాలకు సంబంధించి Google Photos, Gmail, అలాగే Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, Sitesలతో సహా) కోసం మేము ప్రోడక్ట్ పాలసీలను అప్డేట్ చేస్తున్నాము.
Google ఖాతా స్టోరేజ్ గురించి
ప్రతి Google ఖాతాకు 15 GB ఉచిత స్టోరేజ్ కోటా ఉంటుంది. దీన్ని Gmail, Google Drive, Google Photosలతో షేర్ చేయవచ్చు. Google One మెంబర్‌షిప్‌ను (అందుబాటులో ఉన్న ప్రాంతాలలో) కొనుగోలు చేయడం ద్వారా మీరు మీ స్టోరేజ్ కోటాకు అదనపు స్టోరేజ్‌ను జోడించవచ్చు. అప్పుడప్పుడు, ఒక ప్రత్యేక ప్రమోషన్ లేదా సంబంధిత కొనుగోలు నుండి మీకు ఉచిత అదనపు కోటా అందవచ్చు. మీ కోటా గురించి మరింత తెలుసుకోవడానికి, మీ స్టోరేజ్‌కు ఏయే ఐటెమ్‌లు లెక్కించబడతాయో చూడండి.
మీ Google ఖాతా స్టోరేజ్‌ను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి
జూన్ 1, 2021కు ముందు
ఈ కింద పేర్కొనబడిన ఐటెమ్‌లు మీ స్టోరేజ్ కోటాలో స్పేస్ తీసుకుంటాయి
- Google Photosకు బ్యాకప్ చేయబడిన ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు
- మీ స్పామ్, అలాగే ట్రాష్ ఫోల్డర్‌లతో సహా Gmail మెసేజ్‌లు, అటాచ్‌మెంట్‌లు
- PDFలు, ఇమేజ్‌లు, వీడియోలతో సహా Google Driveలోని అత్యధిక శాతం ఫైల్స్
మీరు మీ స్టోరేజ్ కోటాను మించిపోతే
- మీరు ఇకపై Google Driveకు కొత్త ఫైల్స్‌ను లేదా ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయలేరు
- మీరు Google Photosకు ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలను, అలాగే వీడియోలను బ్యాకప్ చేయలేరు
- Gmailలో ఇమెయిల్‌ను పంపగల లేదా అందుకోగల మీ సామర్థ్యం ప్రభావితం కావచ్చు
- మీరు ఇప్పటికీ మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, యాక్సెస్ చేయవచ్చు
జూన్ 1, 2021 తర్వాత
ఈ కింద పేర్కొనబడిన అదనపు ఐటెమ్‌లు, మీ స్టోరేజ్ కోటాలో స్పేస్ తీసుకుంటాయి:
- జూన్ 1, 2021 తర్వాత Google Photosకు బ్యాకప్ చేయబడే హై క్వాలిటీ, అలాగే తక్కువ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు. ఈ మార్పు గురించి మరింత తెలుసుకోండి.
- Google Docs, Sheets, Slides, Drawings, Forms, అలాగే Jamboard లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లలో క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన ఫైల్స్.
- జూన్ 1, 2021 తర్వాత క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన ఫైల్స్ మాత్రమే మీ కోటాలో స్పేస్ తీసుకుంటాయి.
- జూన్ 1, 2021కు ముందు అప్‌లోడ్ చేసిన లేదా చివరిగా ఎడిట్ చేసిన ఫైల్స్, మీ కోటాలో స్పేస్ తీసుకోవు.
మీ డేటాను మీ వినియోగం ఈ విధంగా ప్రభావితం చేస్తుంది
మీరు Gmail, Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms లేదా Jamboardతో సహా) లేదా Google Photosను 2 సంవత్సరాల పాటు ఉపయోగించకుండా ఉంటే, ఇన్‌యాక్టివ్ ప్రోడక్ట్(లు)లోని మీ కంటెంట్ తొలగించబడవచ్చు (సమంజసమైన అడ్వాన్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత).
మీరు మీ స్టోరేజ్ కోటాను మించిపోతే
- మీరు Google Driveకు కొత్త ఫైల్స్‌ను లేదా ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయలేరు.
- మీరు Google Photosకు ఫోటోలను, వీడియోలను వేటినీ బ్యాకప్ చేయలేరు.
- Gmailలో ఇమెయిల్‌ను పంపగల లేదా అందుకోగల మీ సామర్థ్యం కూడా ప్రభావితం కావచ్చు.
- Google Docs, Sheets, Slides, Drawings, Forms, అలాగే Jamboard లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లలో మీరు కొత్త ఫైల్స్‌ను క్రియేట్ చేయలేరు. మీ స్టోరేజ్ వినియోగాన్ని మీరు తగ్గించుకొనే దాకా, ప్రభావితమైన మీ ఫైల్స్‌ను మీరు గానీ, ఇంకెవ్వరైనా గానీ ఎడిట్ లేదా కాపీ చేయలేరు.
- మీరు ఇప్పటికీ మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, యాక్సెస్ చేయవచ్చు.
మీరు మీ స్టోరేజ్ కోటాను మించిపోయి 2 సంవత్సరాలు గడిచినప్పుడు, Gmail, Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, అలాగే Jamboard ఫైల్స్‌తో సహా), అలాగే Google Photosలోని మీ కంటెంట్ తొలగించబడవచ్చు.
మీరు మీ కోటాను మించిపోయారు అంటే, మీకు అందుబాటులో ఉన్న దాని కంటే మీరు మరింత ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగిస్తున్నారని అర్థం. 2 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ కాలం పాటు మీరు కోటాను మించిపోయి ఉండి, కోటా పరిధిలోకి రావడానికి స్పేస్‌ను ఖాళీ చేయడం గానీ లేదా కొనడం గానీ చేయనట్లయితే, Gmail, Drive, Photos నుండి మీ కంటెంట్ మొత్తం తీసివేయబడవచ్చు. కానీ అలా జరగడానికి ముందు, మేము ఇలా చేస్తాము:
- Google ప్రోడక్ట్‌లలోని ఇమెయిల్‌ను, నోటిఫికేషన్లను ఉపయోగించి మీకు నోటీస్ ఇస్తాము. కంటెంట్, తొలగింపునకు అర్హత పొందే తేదీకి కనీసం మూడు నెలల ముందు మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
- తొలగింపును నివారించడానికి మీకు అవకాశం ఇస్తాము (అదనపు స్టోరేజ్ కోసం పేమెంట్ చేయడం ద్వారా లేదా ఫైల్‌లను తీసివేయడం ద్వారా)
- మా సర్వీస్‌ల నుండి మీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము. మీ Google డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
తిరిగి కోటా పరిధిలోకి ఎలా చేరుకోవాలి
https://one.google.com/storageలో స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడానికి వివిధ రకాల మార్గాలను గుర్తించడంలో మీకు సహాయపడే స్టోరేజ్ మేనేజ్‌మెంట్ టూల్స్‌కు మేము యాక్సెస్‌ను ఇస్తాము. మీ ఫైల్స్‌ను మీ వ్యక్తిగత పరికరంలోకి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత వాటిని మీ cloud storage నుండి తొలగించడం అనేది మీ స్పేస్‌ను ఖాళీ చేయడానికి సంబంధించిన మరొక ఆప్షన్.
Gmail, Drive, Photosలకు మీకు మరింత స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే, మీరు Google Oneతో మరింత పెద్ద స్టోరేజ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు.
Gmail, Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard లేదా Sites ఫైల్లతో కలిపి) లేదా Google Photosలో మీరు 2 సంవత్సరాలు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, ఆ ప్రోడక్ట్ నుంచి మీ మొత్తం కంటెంట్ తీసివేయబడవచ్చు. కానీ అలా జరగడానికి ముందు, మేము ఇలా చేస్తాము:
- Google ప్రోడక్ట్‌లలోని ఇమెయిల్‌ను, నోటిఫికేషన్లను ఉపయోగించి మీకు నోటీస్ ఇస్తాము. కంటెంట్, తొలగింపునకు అర్హత పొందే తేదీకి కనీసం మూడు నెలల ముందు మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
- తొలగింపును నివారించడానికి మీకు అవకాశం ఇస్తాము (ప్రోడక్ట్‌లో యాక్టివ్‌గా ఉండటం ద్వారా)
- మా సర్వీస్‌ల నుండి మీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము. మీ Google డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
ఒకవేళ మీరు పేమెంట్ బకాయి లేదా కోటాకు సంబంధించిన సమస్యలేవీ లేని Google One మెంబర్ అయితే, మీరు యాక్టివ్‌గా పరిగణించబడతారు.
ముఖ్యమైనది: ఉదాహరణకు, మీరు Photosలో 2 సంవత్సరాల పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉండి, Drive, Gmailలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే, కేవలం మీ Google Photosలోని కంటెంట్ మాత్రమే తొలగించబడుతుంది. మీరు Gmailలో, అలాగే Google Driveలో (Google Docs, Sheets, Slides, Drawings, Forms, అలాగే Jamboard ఫైల్స్‌తో సహా) యాక్టివ్‌గా ఉన్నట్లయితే, ఆ ప్రోడక్ట్‌లలోని కంటెంట్ తొలగించబడదు.
ఈ ప్రోడక్ట్లలో ఎలా యాక్టివ్‌గా ఉండవచ్చు
మీ డేటాను యాక్టివ్‌గా ఉంచడానికి సరళమైన దారి ఏంటంటే, వెబ్ లేదా Google యాప్ ద్వారా తరుచుగా Gmail, Google Photos, Google Drive (మరియు/లేదా Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, Sites లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లు) సందర్శించాలి. సందర్శిస్తున్నప్పుడు మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యి ఉన్నారని, సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.
- Gmail కోసం: Android; iOS; mail.google.com
- Google Drive కోసం: Android; iOS; drive.google.com
- Google Photos కోసం: Android; iOS; photos.google.com
మీ పరికరంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు సెటప్ చేయబడి ఉండవచ్చనే విషయాన్ని దయచేసి గమనించండి. యాక్టివిటీ అనేది ఖాతా ఆధారంగా పరిగణించబడుతుంది, పరికరం ఆధారంగా కాదు. మీరు ఏ ఖాతాలను అయితే యాక్టివ్‌గా ఉంచాలనుకుంటున్నారో, ఆ ఖాతాలన్నింటికీ సంబంధించిన సర్వీస్‌లను మీరు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.
యాక్టివిటీకి సంబంధించిన ఉదాహరణలు
Gmail
- Gmailకు సంబంధించిన Android, iOS, లేదా వెబ్ యాప్‌లో సైన్ ఇన్ చేసి ఉండటం అలాగే ఆన్‌లైన్ యాక్టివిటీ చేయడం. ఉదాహరణకు, మీరు యాప్‌ను ఉపయోగించి:
- మీ ఇన్‌బాక్స్‌ను చూడటం
- ఇమెయిల్‌ను తెరవడం
- ఇమెయిల్‌ను పంపడం
- ఆర్కైవ్ చేయడం, తొలగించడం, లేబుల్ చేయడం, చదివినట్లుగా మార్క్ చేయడం, స్టార్ పెట్టడం, లేదా ఏవైనా ఇతర ఇమెయిల్ చర్యలను చేయడం
- మీ ఇన్‌బాక్స్‌కు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ సింక్‌లను చేయడం, ఈ బ్యాక్‌గ్రౌండ్ సింక్‌లను Gmailకు సంబంధించిన Android, iOS యాప్‌లు చేస్తాయి
- కింద పేర్కొనబడిన వాటిని చేసే API లేదా థర్డ్-పార్టీ మెయిల్ క్లయింట్ ద్వారా ఇమెయిల్‌ను యాక్సెస్ చేయడం:
- ఇమెయిల్‌లను లోడ్ చేస్తుంది
- ఇమెయిల్‌ను పంపుతుంది
- ఆర్కైవ్ చేస్తుంది, తొలగిస్తుంది, లేబుల్ చేస్తుంది, చదివినట్లుగా మార్క్ చేస్తుంది, స్టార్ పెడుతుంది, లేదా ఏవైనా ఇతర ఇమెయిల్ చర్యలను చేస్తుంది.
- ఇమెయిల్ ఫార్వర్డ్ చేయడాన్ని ఆన్ చేస్తుంది లేదా దాన్ని రన్నింగ్‌లోనే ఉంచుతుంది
Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, అలాగే Sites లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లతో సహా)
- ఏదైనా ప్రామాణీకరించబడిన వినియోగం. దీనిలో ఇవి ఉంటాయి:
- Android, iOS లేదా వెబ్‌లో Driveను లోడ్ చేయడం
- Driveతో ఒక యాడ్-ఆన్‌ను లేదా థర్డ్-పార్టీ యాప్‌ను ఉపయోగించడం
- Drive File Stream లేదా 'బ్యాకప్ మరియు సింక్' వంటి ఏదైనా సింక్ క్లయింట్ సహాయంతో యూజర్ పరికరం నుండి కంటెంట్‌ను సింక్ చేయడం
- ఇతర యాప్ నుండి Driveను ఉపయోగించడం (Drive ఫైల్స్‌ను ఇమెయిల్లకు అటాచ్ చేయడం, Driveలో ఫైల్స్‌ను ప్రివ్యూ చేయడం మొదలైనవాటికి)
- Driveలో స్టోర్ చేయబడిన ఫైల్ మీద ఏదైనా యాక్టివిటీని పూర్తి చేయడం, ఉదాహరణకు, క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, చూడటం, షేర్ చేయడం లేదా కామెంట్ చేయడం
- Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard, అలాగే Sites లాంటి ఏదైనా సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లను ఉపయోగించడం
Google Photos
- Photosకు సంబంధించిన Android లేదా వెబ్ యాప్‌లో సైన్ ఇన్ చేసి ఉండటం అలాగే ఆన్‌లైన్ యాక్టివిటీ చేయడం. ఉదాహరణకు, మీరు యాప్‌ను ఉపయోగించి ఇవి చేయవచ్చు:
- బ్యాకప్ చేయబడిన మీ గ్యాలరీని చూడవచ్చు
- ఫోటోను లేదా వీడియోను షేర్ చేయడం
- ఆల్బమ్‌ను లేదా ఫోటో బుక్‌ను క్రియేట్ చేయడం
- ఫోటోను లేదా వీడియోను బ్యాకప్ చేయవచ్చు
తరుచుగా అడిగే ప్రశ్నలు
G Suite/వర్క్‌స్పేస్ ఖాతాలకు, అలాగే కన్జ్యూమర్ ఖాతాలకు కూడా ఈ పాలసీలు వర్తిస్తాయా?
కోటాకు సంబంధించిన కొన్ని మార్పులు, కొన్ని Google Workspace, G Suite for Education, అలాగే G Suite for Nonprofits ప్లాన్‌లకు వర్తిస్తాయి. వాటిని ఈ మార్పులు ఎలా ప్రభావితం చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి దయచేసి Google Workspace అప్డేట్లను చూడండి.
ఇది ఇక్కడ లిస్ట్ చేయబడని Google Sites, Google Keep వంటి ఇతర క్రియేషన్ యాప్‌లకు కూడా వర్తిస్తుందా? Blogger, అలాగే YouTubeకు సంబంధించిన కంటెంట్ సంగతి ఏంటి?
నేను నా కోటాను మించిపోయాను. నా కంటెంట్ ఎప్పటిలోపు తొలగించబడుతుంది?
నా డేటాను తొలగించే ముందు మీరు నాకు సమాచారం ఏమైనా ఇస్తారా?
ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి నేను యాక్టివ్‌గా ఉండగలనో లేదో నాకు తెలియదు. నేను ఏమి చేయాలి?
జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల, మీరు మీ ఫోన్‌కు లేదా కంప్యూటర్‌కు చాలా ఎక్కువ కాలం పాటు దూరంగా ఉండాల్సి రావచ్చు అని మేము అర్థం చేసుకోగలము. అందుకనే, మేము మీ ఖాతాను ఇన్‌యాక్టివ్ ఖాతాగా పరిగణించే ముందు 2 సంవత్సరాల వ్యవధిని సెట్ చేశాము.
మీరు ఇన్‌యాక్టివ్ అయిన పక్షంలో, మీ డేటాను మేనేజ్ చేసుకోవడానికి మరో మార్గం కోసం ఇన్‌యాక్టివ్ ఖాతా మేనేజర్‌ను ఉపయోగించడాన్ని పరిశీలించండి. ఖాతా గురించి మీకు రిమైండర్లను పంపించడంతో పాటు, మీరు ఇకపై మీ ఖాతాను ఉపయోగించలేకపోతే, దానికి ఏమి జరగాలో మీరు ఈ టూల్ ద్వారా మేనేజ్ చేయవచ్చు. మీరు మీ ఖాతాను ఉపయోగించడం ఆపివేస్తే, మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఒక విశ్వసనీయ కాంటాక్ట్‌ను కూడా సెటప్ చేసుకోవచ్చు, తొలగింపునకు మీ ఖాతా అర్హత పొందడానికి ముందే మీరు ఇలా చేయవచ్చు.
అదనంగా, మీరు ముందుగానే మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకొని, ఏ సమయంలో అయినా దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు.
నాకు ప్రియమైన వారు చనిపోతే నేను వారి కంటెంట్‌ను ఎలా భద్రపరచాలి?
వారి ఆన్‌లైన్ ఖాతాలను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయానికి సంబంధించి స్పష్టమైన సూచనలను ఇవ్వకుండా మరణించే వ్యక్తులు చాలా మంది ఉంటారని మేము గుర్తించాము. మరణించిన యూజర్ ఖాతాలోని కంటెంట్‌ను అందించడానికి, Google వారి రక్తసంబంధీకులతో లేదా ప్రతినిధులతో (కొన్ని సందర్భాలలో) కలిసి పని చేయగలదు. మరణించిన యూజర్‌కు చెందిన డేటాను రిక్వెస్ట్ చేయడానికి సంబంధించిన మా ప్రాసెస్ గురించి మరింత తెలుసుకోండి.
మీరు మరణించినప్పుడు లేదా చాలా కాలం పాటు మీ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు, మీ డేటాతో ఏ విధంగా వ్యవహరించాలో ముందుగానే మాకు తెలియజేయడానికి, ఇన్‌యాక్టివ్ ఖాతా మేనేజర్ గురించి మరింత తెలుసుకోండి.
- గమనిక: ఇన్‌యాక్టివ్ ఖాతా మేనేజర్ సెట్టింగ్‌లు, మా ఇన్‌యాక్టివ్, కోటాకు మించి వినియోగానికి సంబంధించిన పాలసీలను ఓవర్‌రైడ్ చేయవు.