సెల్‌లు, అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలు కొన్ని నిబంధనలను పాటించినప్పుడు వాటిని వచనం లేదా నేపథ్య రంగును మార్చడానికి ఆకృతీకరించవచ్చు. ఉదాహరణకు, అవి ఒక నిర్దిష్ట పదం లేదా సంఖ్యను కలిగి ఉంటే.
- మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
- మీరు ఆకృతీకరణ నియమాలను వర్తింపజేయాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
- ఆకృతీకరించు
నియమబద్ధ ఆకృతీకరణ క్లిక్ చేయండి. టూల్‌బార్ కుడి వైపున తెరవబడుతుంది.
- నిబంధనను రూపొందించండి.
- ఒకే రంగు: "అలా ఉన్నప్పుడు సెల్‌లను ఆకృతీకరించు," క్రింద మీరు ట్రిగ్గర్ చేయాలనుకుంటున్న నియమానికి సంబంధించి నిబంధనను ఎంచుకోండి. "ఆకృతీకరణ శైలి క్రింద, నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పుడు సెల్ ఏ విధంగా కనిపించాలో ఎంచుకోండి.
- రంగు స్కేల్: "పరిదృశ్యం" క్రింద, రంగు స్కేల్‌ని ఎంచుకోండి. ఆ తర్వాత, కనిష్ట మరియు గరిష్ట విలువ మరియు ఐచ్ఛిక మధ్యస్థ విలువను ఎంచుకోండి. విలువ వర్గాన్ని ఎంచుకోవడానికి, కింద్రకు చూపబడిన బాణం గుర్తును
క్లిక్ చేయండి.
- పూర్తయింది ఎంపికను క్లిక్ చేయండి.
ఏ విద్యార్థులు 80% కంటే తక్కువ స్కోర్ చేసారో చూసేందుకు ఉపాధ్యాయుడు పరీక్ష స్కోర్‌లను హైలైట్ చేయవచ్చు.
- మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
- పరీక్ష స్కోర్‌లను ఎంచుకోండి.
- ఆకృతీకరించు
నియమబద్ధ ఆకృతీకరణ క్లిక్ చేయండి.
- "అలా ఉన్నప్పుడు సెల్‌లను ఆకృతీకరించు" క్రింద, ఇంత కంటే తక్కువ క్లిక్ చేయండి. ఇదివరకే నిబంధన ఉన్నట్లయితే, దానిని క్లిక్ చేయండి లేదా ఇంత కంటే తక్కువ అనే
కొత్త నిబంధనను జోడించండి.
- విలువ లేదా ఫార్ములా క్లిక్ చేసి 0.8 నమోదు చేయండి.
- ఎరుపు రంగును ఎంచుకోవడానికి, పూరించు క్లిక్ చేయండి
.
- పూర్తయింది ఎంపికను క్లిక్ చేయండి. తక్కువ స్కోర్‌లు ఎరుపు రంగులో హైలైట్ చేయబడతాయి.
అధునాతన నియమబద్ధ ఆకృతీకరణను ఉపయోగించండి
ఇతర సెల్‌లలోని కంటెంట్‌ల ఆధారంగా ఒకటి లేదా మరిన్ని సెల్‌లకు ఆకృతీకరణను వర్తింపజేయడానికి మీరు అనుకూల ఫార్ములాలను ఉపయోగించగలరు.
- మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
- మీరు ఆకృతీకరించాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
- ఆకృతీకరించు
నియమబద్ధ ఆకృతీకరణ క్లిక్ చేయండి.
- "అలా ఉన్నప్పుడు సెల్‌లను ఆకృతీకరించు" డ్రాప్-డౌన్ మెనులో, అనుకూల ఫార్ములా ఇది క్లిక్ చేయండి. ఇదివరకే నిబంధన ఉన్నట్లయితే, దానిని క్లిక్ చేయండి లేదా అనుకూల ఫార్ములా ఇది అనే
కొత్త నిబంధనను జోడించండి.
- విలువ లేదా ఫార్ములా క్లిక్ చేసి ఫార్ములా మరియు నిబంధనలను జోడించండి.
- పూర్తయింది ఎంపికను క్లిక్ చేయండి.
గమనిక: ఫార్ములాలు ప్రామాణిక నొటేషన్ "(='షీట్ పేరు'! సెల్)" ఉపయోగించి ఒకే షీట్‌ను మాత్రమే సూచించగలవు. ఫార్ములాలో మరో షీట్‌ని సూచించడానికి, INDIRECT ఫంక్షన్‌ని ఉపయోగించండి.
ఉదాహరణ 1
మీ డేటాలో ఒకే విలువ ఒకటి కంటే ఎక్కువ సార్లు సంభవించినప్పుడు హైలైట్ చేయడానికి:
- మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
- మీరు ఆకృతీకరించాలనుకుంటున్న పరిధిని ఎంచుకోండి. ఉదాహరణకు, A1 నుండి A100 వరకు సెల్‌లు.
- ఆకృతీకరించు
నియమబద్ధ ఆకృతీకరణ క్లిక్ చేయండి.
- "అలా ఉన్నప్పుడు సెల్‌లను ఆకృతీకరించు" డ్రాప్-డౌన్ మెనులో, అనుకూల ఫార్ములా ఇది క్లిక్ చేయండి. ఇదివరకే నిబంధన ఉన్నట్లయితే, దానిని క్లిక్ చేయండి లేదా అనుకూల ఫార్ములా ఇది అనే
కొత్త నిబంధనను జోడించండి.
- మొదటి అడ్డువరుస కోసం నియమాన్ని వ్రాయండి. ఈ సందర్భంలో నియమం, "=COUNTIF($A$1:$A$100,A1)>1."
- ఇతర ఆకృతీకరణ లక్షణాలను ఎంచుకోండి.
- పూర్తయింది ఎంపికను క్లిక్ చేయండి.
ఉదాహరణ 2
ఆ అడ్డువరుసలోని సెల్‌లలో ఒక దానిలో ఉన్న విలువ ఆధారంగా పూర్తి అడ్డువరుసను ఆకృతీకరించడానికి:
- మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
- మీరు ఆకృతీకరించాలనుకుంటున్న పరిధిని ఎంచుకోండి, ఉదాహరణకు, నిలువువరుసలు A:E.
- ఆకృతీకరించు
నియమబద్ధ ఆకృతీకరణ క్లిక్ చేయండి.
- "అలా ఉన్నప్పుడు సెల్‌లను ఆకృతీకరించు" డ్రాప్-డౌన్ మెనులో, అనుకూల ఫార్ములా ఇది క్లిక్ చేయండి. ఇదివరకే నిబంధన ఉన్నట్లయితే, దానిని క్లిక్ చేయండి లేదా అనుకూల ఫార్ములా ఇది అనే
కొత్త నిబంధనను జోడించండి.
- మొదటి అడ్డువరుస కోసం నియమాన్ని వ్రాయండి. ఉదాహరణకు, మీరు పూర్తి అడ్డువరుసను పచ్చగా చేయాలనుకుంటే, నిలువువరుస Bలో విలువ "Yes" ఉంటే, ఫార్ములా ఇలా వ్రాయండి "=$B1="Yes"."
- ఇతర ఆకృతీకరణ లక్షణాలను ఎంచుకోండి.
- పూర్తయింది ఎంపికను క్లిక్ చేయండి.
ఖచ్చితమైన వర్సె. సాపేక్ష సూచనలు
తరచుగా, మీరు ఫార్ములాలలో అక్షరాలు మరియు సంఖ్యల ముందు డాలర్ చిహ్నాలను ($) జోడించాల్సి ఉంటుంది, తద్వారా సాపేక్ష సూచనలకు (A1 నుండి B1, A2 నుండి B2) విరుద్ధంగా ఖచ్చితమైన సూచనలను ఉపయోగించి ఆకృతీకరణ వర్తింపజేయబడుతుంది.
బహుళ ఎక్స్‌ప్రెషన్‌లతో సరిపోల్చడానికి మీరు వైల్డ్‌కార్డ్ అక్షరాలను ఉపయోగించగలరు. ఆకృతీకరణ చేసేటప్పుడు ఫీల్డ్‌లు "కలిగి ఉన్న వచనం" లేదా "కలిగి లేని వచనం"తో వైల్డ్‌కార్డ్ అక్షరాలను ఉపయోగించవచ్చు.
- ఏదైనా ఒక అక్షరాన్ని సరిపోల్చడానికి, ప్రశ్నార్థకం గుర్తు (?)ని ఉపయోగించండి. ఉదాహరణకు, "a?c" కలిగిన వచన నియమం "abc" ఉన్న సెల్‌లను ఫార్మాట్ చేస్తుంది, కానీ "ac" లేదా "abbc" ఉన్నవి కాదు.
- (0) లేదా మరిన్ని అక్షరాలను సరిపోల్చేందుకు, ఆస్టరిస్క్ (*) ఉపయోగించండి. ఉదాహరణకు, "a*c" కలిగిన వచన నియమం "abc", "ac" మరియు "abbc" ఉన్న సెల్‌లను ఫార్మాట్ చేస్తుంది, కానీ "ab" లేదా "ca" ఉన్నవి కాదు.
- వచనంలో ప్రశ్నార్థకం గుర్తు లేదా ఆస్టరిస్క్‌ని సరిపోల్చడానికి, వాటి ముందు టిల్డ్ (~)ని జోడించడం ద్వారా మీరు వైల్డ్‌కార్డ్ అక్షరాల నుండి బయటకు రావచ్చు. ఉదాహరణకు, "a~?c" కలిగిన వచన నియమం "a?c" ఉన్న సెల్‌లను ఫార్మాట్ చేస్తుంది, కానీ "abc" లేదా "a~?c" ఉన్నవి కాదు.
గమనికలు:
- నియమాన్ని తీసివేయడానికి, నియమాన్ని పాయింట్ చేసి తీసివేయి
క్లిక్ చేయండి.
- జాబితా చేయబడిన క్రమంలో నియమాలు మూల్యాంకనం చేయబడతాయి. నిజమని రుజువైన మొదటి నియమం సెల్ లేదా పరిధి యొక్క ఆకృతిని నిర్వచిస్తుంది. నియమాల క్రమం మార్చడానికి, వాటిని క్లిక్ చేసి లాగండి.
- మీరు ఆకృతీకరణ నియమాలను కలిగి ఉన్న సెల్ లేదా పరిధి నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తే, మీరు కాపీ చేసిన డేటాను పేస్ట్ చేసినప్పుడు ఈ నియమాలు వర్తించబడతాయి.