క్విజ్‌ల కోసం లాక్ చేసిన మోడ్‌ను ఉపయోగించండి

విద్యార్థులు తమ Chromebookలతో క్విజ్‌లలో, పరీక్షలలో పాల్గొంటున్నప్పుడు వారు ఏకాగ్రత నిలిపే విధంగా మీరు తోడ్పడవచ్చు. విద్యార్థులు లాక్ చేసిన మోడ్‌లో క్విజ్‌లో పాల్గొన్నప్పుడు, వారు ఇతర వెబ్‌సైట్‌లను బ్రౌజ్ చేయలేరు లేదా ఇంకేవైనా యాప్‌లను తెరవలేరు.

లాక్ చేసిన మోడ్ గురించి

లాక్ చేసిన మోడ్ అనేది ఇమెయిల్ అడ్రస్‌లను సేకరిస్తుంది, అలాగే క్విజ్‌లను కేవలం మీ డొమైన్‌కు మాత్రమే పరిమితం చేస్తుంది. లాక్ చేసిన మోడ్‌లో:

  • విద్యార్థులు ఇతర యాప్‌లను ఉపయోగించలేరు. 
  • కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు, కీబోర్డ్ షార్ట్‌కట్‌లు డిజేబుల్ చేయబడ్డాయి.
  • ఒక విద్యార్థి క్విజ్ నుండి నిష్క్రమిస్తే, లేదా ఇంకేదైనా ట్యాబ్‌ను తెరిస్తే, ఉపాధ్యాయుడికి ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
  • విద్యార్థి క్విజ్‌ను 30 రోజుల లోపు తెరిస్తే, ఉపాధ్యాయుడికి ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
    • గమనిక: విద్యార్థి చివరి సారి క్విజ్‌ను తెరిచిన 30 రోజుల తర్వాత మళ్లీ క్విజ్‌ను తెరిస్తే, నోటిఫికేషన్ పంపబడదు.
  • షెడ్యూల్ చేసిన గంటల సమయంలో మాత్రమే మీరు క్విజ్‌ను యాక్సెస్ చేయగలరు.

ముఖ్య గమనిక: లాక్ చేసిన మోడ్‌ను ఉపయోగించడానికి, మీకు ఇవి అవసరం అవుతాయి:

లాక్ చేయబడిన మోడ్‌ను ఆన్ చేయండి

  1. Google Formsలో క్విజ్‌ను తెరవండి.
  2. క్విజ్‌కు ఎగువున ఉన్న, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “Chromebook సెట్టింగ్‌ల” కింద, లాక్ చేయబడిన మోడ్ ఆప్షన్‌ను ఆన్ చేయండి.

లాక్ చేసిన మోడ్‌లో యాక్సెస్ సౌలభ్య ఫీచర్‌లు & ఎక్స్‌టెన్షన్‌లు

సిఫార్సు చేస్తున్న Chromebook యాక్సెస్ సౌలభ్య ఫీచర్‌లు
  • ChromeVox (టెక్ట్స్-టు-స్పీచ్‌)
  • అధిక కాంట్రాస్ట్ మోడ్
  • పూర్తి స్క్రీన్‌ మ్యాగ్నిఫైయర్
  • డాక్ చేసిన మాగ్నిఫైయర్
సిఫార్సు చేసిన Chrome ఎక్స్‌టెన్షన్‌లు
డాన్ జాన్‌స్టన్ నుండి:
  • Quizbot: ఫారమ్‌లకు సంబంధించిన ఆటోమేటిక్ క్విజ్ క్రియేటర్ (ఉపాధ్యాయుల కోసం).
  • స్నాప్&రీడ్: ఆలోచనలను అనువదించే, స్పష్టంగా తెలియజేసే, క్రమబద్ధంగా నిర్వహించే టెక్స్ట్ రీడర్. 
  • కో:రైటర్: ముందస్తు పద సూచన, స్పీచ్ రికగ్నిషన్, అనువాదాన్ని అందించే రైటింగ్ సహాయ టూల్.
ఈ సాధనాల గురించి మరింత తెలుసుకోవడానికి, డాన్ జాన్‌స్టన్ సైట్‌ను సందర్శించండి.
Texthelp నుండి:
  • EquatIO: మీ ఇన్‌పుట్ గణిత రూపంలోని సమీకరణాలు, ఫార్ములాలు, మొదలైన వాటి రూపంలోకి మారుస్తుంది.
  • Google Chrome కోసం చదవడం&రాయడం: చిత్ర నిఘంటువులు, ముందస్తు పదాల సూచన మొదలైన వాటితో వచనం నుండి ప్రసంగానికి, ప్రసంగం నుండి వచనానికి మారుస్తుంది.

చిట్కా: మీకు యాక్సెస్ సౌలభ్య ఫీచర్ కనిపించకుంటే, దానికి బదులుగా యాక్సెస్ సౌలభ్య షార్ట్‌కట్‌లను ఉపయోగించండి.

మీరు లాక్ చేసిన మోడ్‌ను ఉపయోగించనట్లయితే

క్విజ్ పరీక్షలు పెట్టే ఉపాధ్యాయుల కోసం
క్విజ్‌లలో పాల్గొనే విద్యార్థుల కోసం

మీరు ఇప్పటికీ క్విజ్‌ను ప్రారంభించలేకుంటే, మీ ఉపాధ్యాయుని సంప్రదించండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4681753021292790923
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false