ఆఫీస్ లేదా స్కూల్ కోసం Google Docs నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? ఎటువంటి ఛార్జీ లేకుండా Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.
మీరు ఒకే స్ప్రెడ్‌షీట్‌లో, డేటాను తిరిగి క్రియేట్ చేసి దానిని ఒక షీట్ నుండి మరొక షీట్లోకి కాపీ చేయవచ్చు.
మీ స్ప్రెడ్షీట్లోని ఇతర షీట్ల నుండి డేటాని పొందండి
- మీ కంప్యూటర్లో, docs.google.com/spreadsheets/ లింక్‌కు వెళ్లండి.
- షీట్‌ను తెరవండి లేదా సృష్టించండి.
- సెల్‌ను ఎంచుకోండి.
=
టైప్ చేసి తర్వాత షీట్ పేరు, ఆశ్చర్యార్థకం గుర్తు, ఆపై కాపీ చేయబడుతున్న సెల్‌ను టైప్ చేయండి. ఉదాహరణకు,=Sheet1!A1
లేదా='Sheet number two'!B4
.
గమనిక: షీట్ పేరులో స్పేస్‌లు లేదా అక్షరాలు, సంఖ్యలు కాకుండా ఇతర సంకేత గుర్తులు ఉన్నట్లయితే, మీరు వాటికి సింగిల్ కొటేషన్లను చేర్చాలి (రెండవ ఉదాహరణలో సూచించినట్లుగా).
ఇతర స్ప్రెడ్షీట్ల నుండి డేటాను పొందండి
ముఖ్య గమనిక: మరొక స్ప్రెడ్షీట్లోని సెల్ లేదా సెల్ల పరిధిని సూచించడానికి, మీరు తప్పనిసరిగా IMPORTRANGE ఫంక్షన్‌ను ఉపయోగించాలి.
ఇతర స్ప్రెడ్షీట్ల నుండి డేటాని స్వీకరించడానికి IMPORTRANGE ఫంక్షన్‌ని ఉపయోగించండి.