మీ ఫారమ్ కోసం ప్రశ్న రకాన్ని ఎంచుకోండి

మీరు మెనూ నుండి ప్రశ్నల రకాలను ఎంచుకోవచ్చు:

  1. Google Formsలో ఫారమ్‌ను తెరవండి.
  2. కుడి వైపున, జోడించండి ని క్లిక్ చేయండి.
  3. ప్రశ్న టైటిల్‌కు కుడి వైపున, మీకు కావాల్సిన ప్రశ్న రకాన్ని ఎంచుకోండి.
  4. (ఆప్షనల్) యూజర్‌లు మీ ప్రశ్నకు సమాధానమివ్వాలని కోరడానికి, అవసరం ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  5. (ఆప్షనల్) "వివరణ" ఫీల్డ్‌ను జోడించడానికి, మరిన్ని ఆ తర్వాత వివరణ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. (ఆప్షనల్) ప్రతి ప్రశ్నకు మరిన్ని ఆప్షన్‌లను కనుగొనడానికి, మరిన్ని ని క్లిక్ చేయండి.
సంక్షిప్త సమాధానం
పేరాగ్రాఫ్
మల్టిపుల్‌ ఛాయిస్‌
  • మీరు పలు ఆప్షన్‌లను అందించవచ్చు. సమాధానం ఇచ్చే వ్యక్తులు ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంచుకోగలరు.

  • ఒక ఆప్షన్‌గా మీరు "ఇతరం" చేర్చవచ్చు. సమాధానం ఇచ్చే వ్యక్తులు చిన్న సమాధానాన్ని టైప్ చేయవచ్చు.

చెక్‌బాక్స్‌లు
  • మీరు పలు ఆప్షన్‌లను అందించవచ్చు. సమాధానం ఇచ్చే వ్యక్తులు పలు సమాధానాలను ఎంచుకోవచ్చు.

  • ఒక ఆప్షన్‌గా మీరు "ఇతరం" చేర్చవచ్చు. సమాధానం ఇచ్చే వ్యక్తులు చిన్న సమాధానాన్ని టైప్ చేయవచ్చు.

డ్రాప్‌డౌన్
  • మీరు పలు ఆప్షన్‌లను అందించవచ్చు. సమాధానం ఇచ్చే వ్యక్తులు ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంచుకోగలరు.
ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి

మీ ఫారమ్‌లో ఫైల్‌ను అప్‌లోడ్ చేయమని మీరు సమాధానం ఇచ్చే వ్యక్తిని అడగవచ్చు.

ముఖ్య గమనిక:

  • ఈ కింది సందర్భాలలో ఈ రకమైన ప్రశ్న ఉపయోగించబడదు:
  • ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, సమాధానం ఇచ్చే వ్యక్తులు Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.
  • ఫారమ్ ఓనర్ కోసం, అప్‌లోడ్ చేసిన ఫైల్స్ Google Driveలోని కొత్త ఫోల్డర్‌లో స్టోర్ చేయబడతాయి.

ఫైల్ అప్‌లోడ్ ప్రశ్నను సెటప్ చేయడానికి, మీరు వీటిని చేయవచ్చు:

  • సమాధానం ఇచ్చే వ్యక్తులు ఏ ఫైల్ రకాలను అప్‌లోడ్ చేయవచ్చో పేర్కొనవచ్చు.
  • సమాధానం ఇచ్చే వ్యక్తులు గరిష్ఠంగా ఎన్ని ఫైల్స్ అప్‌లోడ్ చేయవచ్చో సెటప్ చేయండి.
  • సమాధానం ఇచ్చే వ్యక్తులు అప్‌లోడ్ చేసే ఫైల్ గరిష్ఠ సైజ్‌ను మీరు ఎంచుకోవచ్చు.
లీనియర్ స్కేల్

స్కేల్‌లో రేటింగ్‌ను అందించమని మీరు సమాధానం ఇచ్చే వ్యక్తులను అడగవచ్చు.

  • మీ స్కేల్ సున్నా లేదా ఒకటితో ప్రారంభం అవుతుంది.
  • మీ స్కేల్ చివరలో పూర్ణ సంఖ్య 2 నుండి 10 వరకు ఉంటుంది.
  • స్కేల్ ప్రతి చివరన మీరు లేబుల్‌ను సెట్ చేయవచ్చు.
మల్టిపుల్ ఛాయిస్ గ్రిడ్

సమాధానం ఇచ్చే వ్యక్తులు ప్రతి అడ్డు వరుసకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమాధానాలను ఎంచుకోగల గ్రిడ్‌ను మీరు క్రియేట్ చేయవచ్చు.

చిట్కా: ఈ రకమైన ప్రశ్న తరచుగా ఆప్షన్‌ల కేటగిరీని రేట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

  1. "ప్రశ్న" ఫీల్డ్‌కు మీ ప్రశ్నను జోడించండి.
  2. అడ్డు వరుసల కోసం ఆప్షన్‌లను జోడించండి. ఉదాహరణకు: A, B, C.
  3. నిలువు వరుసల కోసం ఆప్షన్‌లను జోడించండి. ఉదాహరణకు: 1, 2, 3. సమాధానం ఇచ్చే వ్యక్తులు ప్రతి అడ్డు వరుసకు ఒక నిలువు వరుసను మాత్రమే ఎంచుకోగలరు.
  4. (ఆప్షనల్) సమాధానం ఇచ్చే వ్యక్తి ప్రతి నిలువు వరుస నుండి ఒక ఆప్షన్‌ను ఎంచుకున్నారని నిర్ధారించుకోవడానికి, "ప్రతి అడ్డు వరుసలో సమాధానం అవసరం"ని ఆన్ చేయండి. వారు చేయకపోతే, వారికి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఆపై సమాధానం ఇచ్చే వ్యక్తి కొనసాగించలేరు.
  5. (ఆప్షనల్) సమాధానాలను ఒక నిలువు వరుసకు ఒక ఆప్షన్‌కు పరిమితం చేయడానికి:
    1. దిగువున కుడివైపున ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
    2. “ప్రతి నిలువు వరుసకు ఒక సమాధానాన్ని పరిమితం చేయండి” పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  6. (ఆప్షనల్) సర్వే ప్రారంభించిన ప్రతిసారీ అడ్డు వరుస క్రమాన్ని షఫుల్ చేయడానికి:
    1. దిగువున కుడివైపున ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
    2. "అడ్డు వరుస క్రమాన్ని షఫుల్ చేయండి"కి పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.

"ప్రతి నిలువు వరుసకు ఒక సమాధానం ఉండేలా పరిమితి విధింపు"నకు ఉదాహరణ

ఇన్‌పుట్:

  • అడ్డు వరుసలు: A, B, C
  • నిలువు వరుసలు: 1, 2, 3

ఫలితం: సమాధానం ఇచ్చే వ్యక్తులు ప్రతి నిలువు వరుస (1, 2, 3) కోసం ఒక అడ్డు వరుస ఐటెమ్‌ను (A, B, C) ఎంచుకుంటారు. వారు నిలువు వరుసలో పలు అడ్డు వరుసలను ఎంచుకుంటే, వారికి ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

చెక్‌బాక్స్ గ్రిడ్

సమాధానం ఇచ్చే వ్యక్తులు ప్రతి అడ్డు వరుసకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమాధానాలను ఎంచుకోగల గ్రిడ్‌ను మీరు క్రియేట్ చేయవచ్చు.

చిట్కా: ఈ రకమైన ప్రశ్న తరచుగా ఆప్షన్‌ల కేటగిరీని రేట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

  1. "ప్రశ్న" ఫీల్డ్‌కు మీ ప్రశ్నను జోడించండి.
  2. అడ్డు వరుసల కోసం ఆప్షన్‌లను జోడించండి. ఉదాహరణకు: A, B, C.
  3. నిలువు వరుసల కోసం ఆప్షన్‌లను జోడించండి. ఉదాహరణకు: 1, 2, 3.
  4. (ఆప్షనల్) సమాధానం ఇచ్చే వ్యక్తులు ప్రతి అడ్డు వరుస కోసం నిలువు వరుసల నుండి ఒక ఆప్షన్‌ను ఎంచుకున్నారని నిర్ధారించుకోవడానికి, "ప్రతి అడ్డు వరుసలో సమాధానం అవసరం"ని ఆన్ చేయండి. వారు చేయకుంటే, ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది, ఆపై సమాధానం ఇచ్చే వ్యక్తి కొనసాగించలేరు.
  5. (ఆప్షనల్) సమాధానాలను ఒక నిలువు వరుసకు ఒక ఆప్షన్‌కు పరిమితం చేయడానికి:
    1. దిగువున కుడివైపున ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
    2. “ప్రతి నిలువు వరుసకు ఒక సమాధానాన్ని పరిమితం చేయండి” పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  6. (ఆప్షనల్) సర్వే ప్రారంభించిన ప్రతిసారీ అడ్డు వరుస క్రమాన్ని షఫుల్ చేయడానికి:
    1. దిగువున కుడివైపున ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
    2. "అడ్డు వరుస క్రమాన్ని షఫుల్ చేయండి"కి పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.

"ప్రతి నిలువు వరుసకు ఒక సమాధానం ఉండేలా పరిమితి విధింపు"నకు ఉదాహరణ

ఇన్‌పుట్:

  • అడ్డు వరుసలు: A, B, C
  • నిలువు వరుసలు: 1, 2, 3

ఫలితం: ప్రతి అడ్డు వరుస ఐటెమ్ (A, B, C) కోసం సమాధానం ఇచ్చే వ్యక్తులు పలు నిలువు వరుసలను (1, 2, 3) ఎంచుకోవచ్చు. వారు నిలువు వరుసలో పలు అడ్డు వరుసలను ఎంచుకుంటే, వారికి ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

తేదీ

సమాధానం ఇచ్చే వ్యక్తులు mm/dd/yyyy ఫార్మాట్‌లో తేదీని పూరించవచ్చు.

సంవత్సరం లేదా సమయాన్ని చేర్చడానికి, ప్రశ్న కింద కుడి వైపున ఉన్న మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సమయం

సమాధానం ఇచ్చే వ్యక్తులు ఈ సమాచారాన్ని పూరించవచ్చు:

  • సమయాన్ని hh:mm AM/PM ఫార్మాట్‌లో
  • వ్యవధిని hh:mm AM/PM ఫార్మాట్‌లో

సమయం లేదా వ్యవధి మధ్య మారడానికి, ప్రశ్న కింద కుడి వైపున ఉన్న మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15394287329129820817
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false