Google ఫారమ్‌లతో క్విజ్‌లను రూపొందించండి & గ్రేడ్ చేయండి

మీరు Google ఫారమ్‌లతో క్విజ్‌లను సృష్టించవచ్చు, పంపవచ్చు మరియు గ్రేడ్ చేయవచ్చు.

కొత్త క్విజ్ & సమాధానం కీని రూపొందించండి

  1. Google ఫారమ్‌లలో, ప్లస్‌ను కూడిక చిహ్నం క్లిక్ చేయండి.
  2. ఎగువున కుడివైపు ఉన్న సెట్టింగ్‌లను సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. క్విజ్‌లు ఆ తర్వాత దీనిని క్విజ్ వలె మార్చండి క్లిక్ చేయండి.
  4. ఐచ్ఛికం: ఇమెయిల్ చిరునామాలను సేకరించడానికి, సాధారణ ఆ తర్వాత ఇమెయిల్ చిరుమానాను సేకరించు ఎంపికపై క్లిక్ చేయండి.
  5. సేవ్ చేయి క్లిక్ చేయండి.
సమాధానం కీని రూపొందించండి, పాయింట్‌లను కేటాయించండి & ఆటోమేటిక్ ఫీడ్‌బ్యాక్‌ను జోడించండి

నిర్దిష్ట ప్రశ్న రకాలపై మీరు సమాధానం కీని రూపొందించగలరు:

సమాధానం కీని సృష్టించండి

  1. ప్రశ్నను జోడించడానికి, ప్రశ్నను జోడించు ప్రశ్నను జోడించు ఎంపికను క్లిక్ చేయండి.
  2. మీ ప్రశ్న మరియు సమాధానాలను పూరించండి.
  3. ప్రశ్న యొక్క దిగువభాగం ఎడమవైపున, సమాధానం కీ ఎంపికను క్లిక్ చేయండి.
  4. సరైన సమాధానం లేదా సమాధానాలను ఎంచుకోండి.
  5. ప్రశ్న యొక్క ఎగువ కుడిభాగంలో, ప్రశ్న ఎన్ని పాయింట్‌ల విలువ చేస్తుందో ఎంచుకోండి.
  6. ఐచ్ఛికం: సమాధానానికి వ్రాతపూర్వకమైన లేదా YouTube వీడియో వివరణను జోడించడానికి సమాధానం ఫీడ్‌బ్యాక్‌ను జోడించు ఎంపికను క్లిక్ చేయండి.
  7. ఐచ్ఛికం: ప్రశ్న లేదా సమాధానం ఎంపికలను సవరించడానికి, ప్రశ్నను సవరించు ఎంపికను క్లిక్ చేయండి.

గమనిక: మీరు పాయింట్‌లను కేటాయించవచ్చు మరియు అన్ని ప్రశ్న రకాలపై ఫీడ్‌బ్యాక్ జోడించవచ్చు.

క్విజ్ సమయంలో మరియు తర్వాత వ్యక్తులు ఏమి చేస్తారో ఎంచుకోండి

సమాధానమివ్వని పశ్నలు, సరైన సమాధానాలు మరియు పాయింట్ విలువలను వ్యక్తులు చూడవచ్చో, లేదో మీరు ఎంపిక చేసుకోవచ్చు.

  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువున కుడివైపు ఉన్న సెట్టింగ్‌లను సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. క్విజ్‌లుఎంపికను క్లిక్ చేయండి.
  4. "ప్రతిస్పందించే వ్యక్తి చూడగలరు" విభాగంలో, మీరు కోరుకున్న ఎంపికల పక్కన ఉన్న బాక్సులను ఎంచుకోండి.
మీ కార్యాలయం లేదా పాఠశాల వెలుపలి వ్యక్తులకు మీ క్విజ్‌ను పంపండి

మీరు దీనితో ముగిసే వేరొక ఇమెయిల్ చిరునామాతో వేరొకరికి మీ ఫారమ్‌ను పంపాలనుకుంటే:

  1. మీ క్విజ్‌లో, సెట్టింగ్‌ల సెట్టింగ్‌లు ఎంపికను క్లిక్ చేయండి.
  2. సాధారణం క్లిక్ చేయండి.
  3. "సైన్ ఇన్ అవసరమవుతుంది" విభాగం క్రింద [మీ డొమైన్] వినియోగదారుల కోసం పరిమితి ఎంపికను తీసివేయండి.

మీ క్విజ్‌ను ఇతరులకు ఎలా పంపాలో తెలుసుకోండి.

గ్రేడ్ క్విజ్‌లు

క్విజ్ ప్రతిస్పందనలు అన్నింటి కోసం మీరు ఇక్కడ పేర్కొన్న వాటితో ఆటోమేటిక్ సారాంశాలను చూడవచ్చు:

  • తరచుగా సమాధానం చెప్పకుండా మిస్ చేసే ప్రశ్నలు
  • సరైన సమాధానాలతో మార్క్ చేయబడిన గ్రాఫ్‌లు
  • స్కోర్‌ల యొక్క సగటు, మధ్యగత విలువ మరియు పరిధి

వ్యక్తిగత ప్రతిస్పందనలను గ్రేడ్ చేయండి

మీరు ఇమెయిల్ చిరునామాలను సేకరిస్తే, మీరు పాయింట్‌లను కేటాయించవచ్చు మరియు వ్యక్తిగత ప్రతిస్పందనలలోని ఫీడ్‌బ్యాక్‌ను అందించవచ్చు. మీరు ఒక్కో ప్రతిస్పందనను గ్రేడ్ చేసిన తర్వాత, మీ మార్పులను సేవ్ చేయండి.

  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలు ఎంపికను క్లిక్ చేయండి.
  3. స్వతంత్ర వ్యక్తి ఎంపికను క్లిక్ చేయండి.
  4. స్వతంత్ర వ్యక్తుల మధ్య మారడానికి, మునుపటిది మునుపటి లేదా తదుపరిది తర్వాత క్లిక్ చేయండి.
  5. మీరు గ్రేడ్ చేయాలనుకుంటున్న ప్రశ్నను కనుగొనండి.
    • ఎగువన కుడిభాగంలో, ప్రతిస్పందనకు ఎన్ని పాయింట్‌లు వచ్చాయో నమోదు చేయండి.
    • సమాధానం కింద, ఫీడ్‌బ్యాక్‌ను జోడించు ఎంపికను క్లిక్ చేయండి.
  6. మీ ఫీడ్‌బ్యాక్‌ను నమోదు చేయండి మరియు సేవ్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
  7. మీ మార్పులను సేవ్ చేయడానికి, దిగువన ఉన్న, సేవ్ చేయిఎంపికను క్లిక్ చేయండి.
క్విజ్ ఫలితాలను చూడండి
  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలు ఎంపికను క్లిక్ చేయండి.
  3. సారాంశం ఎంపికను క్లిక్ చేయండి.
ప్రశ్న-తర్వాత-ప్రశ్నను గ్రేడ్ చేయండి
  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలు ఎంపికను క్లిక్ చేయండి.
  3. "ప్రతిస్పందనలు" విభాగం క్రింద, ప్రశ్నను క్లిక్ చేయండి.
  4. సమాధానాల గుంపు కోసం పాయింట్‌లను అందించడానికి:
    • మొత్తం పాయింట్‌లు: సరిగ్గా మార్క్ చేయి సరైనదిగా గుర్తుపెట్టండి ఎంపికను క్లిక్ చేయండి.
    • పాక్షిక పాయింట్‌లు: మీరు అందించాలనుకుంటున్న పాయింట్‌ల సంఖ్యను నమోదు చేయండి.
    • పాయింట్‌లు ఏవీ లేవు: తప్పుగా మార్క్ చేయి సరికానిదిగా గుర్తుపెట్టండి ఎంపికను క్లిక్ చేయండి.
  5. ప్రశ్న కోసం వ్రాతపూర్వకమైన లేదా YouTube వీడియో ఫీడ్‌బ్యాక్‌ను జోడించడానికి ఫీడ్‌బ్యాక్‌ను జోడించు ఎంపికను క్లిక్ చేయండి.
  6. ప్రశ్నల మధ్య మారడానికి, పైభాగంలో, మునుపటిది మునుపటి లేదా తదుపరిది తర్వాత క్లిక్ చేయండి.
  7. మీరు గ్రేడింగ్ చేయడం పూర్తి చేసినట్లయితే, దిగువన ఉన్న, సేవ్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.

ఫలితాలను షేర్ చేయండి

మీరు మీ ఫారమ్‌లో ఇమెయిల్ చిరునామాను సేకరిస్తే, వెంటనే మీరు ఫలితాలను పంపవచ్చు లేదా మీరు వాటిని షేర్ చేయడానికి సిద్ధం అయ్యేంత వరకు వేచి ఉండండి.

డిఫాల్ట్‌గా:

  • గ్రేడ్‌లు వెంటనే రిలీజ్ అవుతాయి
  • ఇమెయిల్ చిరునామాలు సేకరించబడవు.

మీరు గ్రేడ్‌లను రిలీజ్ చేసే విధానాన్ని మార్చండి

  1. ఎగువున కుడిభాగంలో, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఎంపికను క్లిక్ చేయండి.
  2. క్విజ్‌లుఎంపికను క్లిక్ చేయండి.
  3. మాన్యువల్ సమీక్ష ముగిసినప్పుడు, తర్వాత ఎంపికను ఎంచుకోండి.
  4. సేవ్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.

సమీక్ష తర్వాత ఇమెయిల్ ఫలితాలు

  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలుఆ తర్వాత ఒక్కొక్కటిగా క్లిక్ చేయండి.
  3. రికార్డ్ చేయబడిన ఇమెయిల్ చిరునామాను కలిగిన ప్రతిస్పందనకు ఎగువ కుడిభాగంలో, రిలీజ్ స్కోర్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఇమెయిల్ పంపాలనుకుంటున్న వ్యక్తులకు పక్కన ఉన్న బాక్సులను ఎంచుకోండి.
  5. ఇమెయిల్‌లను పంపి, వాటిని రిలీజ్ చేయిఎంపికను క్లిక్ చేయండి.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?