Google ఫారమ్‌లతో క్విజ్‌లను రూపొందించండి & గ్రేడ్ చేయండి

కొత్త క్విజ్‌ను, సమాధానాల కీని రూపొందించండి

చిట్కా: వేగంగా క్విజ్‌ను క్రియేట్ చేయడానికి, g.co/createaquiz లింక్‌కు వెళ్లండి .

  1. Google Formsలో ఫారమ్‌ను తెరవండి.
  2. ఫారమ్ యొక్క ఎగువ భాగంలో, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. దీన్ని క్విజ్‌గా మార్చండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.
    • ఆప్షనల్: ఈమెయిల్ అడ్రస్‌లను సేకరించడానికి, “ప్రతిస్పందనలు” ఆప్షన్ పక్కన, కింది వైపు బాణం Down arrow గుర్తును క్లిక్ చేసి, ఈమెయిల్ అడ్రస్‌లను సేకరించండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.
సమాధానాల కీని రూపొందించండి, పాయింట్‌లను కేటాయించండి, ఆటోమేటిక్ ఫీడ్‌బ్యాక్‌ను జోడించండి

సమాధానాల కీని క్రియేట్ చేయండి

  1. ప్రశ్నను జోడించడానికి, ప్రశ్నను జోడించండి Add question అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. మీ ప్రశ్న మరియు సమాధానాలను పూరించండి.
  3. ప్రశ్న యొక్క దిగువభాగం ఎడమవైపున, సమాధానం కీ ఎంపికను క్లిక్ చేయండి.
  4. సరైన సమాధానం లేదా సమాధానాలను ఎంచుకోండి.
  5. ప్రశ్నకు ఎగువున కుడి భాగంలో, ప్రశ్న ఎన్ని పాయింట్‌ల విలువ చేస్తుందో ఎంచుకోండి.
    • ఏదైనా సమాధానానికి రాతపూర్వకమైన లేదా YouTube వీడియో వివరణను జోడించడానికి సమాధాన ఫీడ్‌బ్యాక్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు వాటిపై క్లిక్ చేసినప్పుడు ప్రశ్నలను లేదా సమాధానాలను మీరు ఎడిట్ చేయవచ్చు.

గమనిక: మీరు అన్ని రకాల ప్రశ్నలకు పాయింట్‌లను కేటాయించవచ్చు, ఫీడ్‌బ్యాక్‌ను జోడించవచ్చు.

క్విజ్ సమయంలో, తర్వాత వ్యక్తులు ఏమి చూస్తారో ఎంచుకోండి

సమాధానమివ్వని పశ్నలు, సరైన సమాధానాలు, అలాగే పాయింట్ విలువలను వ్యక్తులు చూడవచ్చో, లేదో మీరు ఎంపిక చేసుకోవచ్చు.

  1. Google Formsలో క్విజ్‌ను తెరవండి.
  2. క్విజ్‌కు ఎగువున ఉన్న, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "సమాధానం ఇచ్చే వ్యక్తికి సంబంధించిన సెట్టింగ్‌లు" అనే విభాగంలో, అవసరమైనట్లుగా సెట్టింగ్‌లను మార్చండి.
మీ ఆఫీస్ లేదా స్కూల్ వెలుపలి వ్యక్తులకు మీ క్విజ్‌ను పంపండి
  1. క్విజ్‌కు ఎగువన ఉన్న, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  2. “ప్రతిస్పందనలు” అనే ఆప్షన్ కింద, [మీ డొమైన్], అలాగే దాని విశ్వసనీయ సంస్థలలోని యూజర్‌లకు పరిమితం చేయడం అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మీ క్విజ్‌ను ఇతరులకు ఎలా పంపాలో తెలుసుకోండి.

క్విజ్‌లు గ్రేడ్ చేయండి

ఇక్కడ పేర్కొన్న వాటితో సహా, క్విజ్ ప్రతిస్పందనలన్నింటి కోసం మీరు ఆటోమేటిక్ సారాంశాలను  చూడవచ్చు:

  • తరచుగా సమాధానం చెప్పకుండా మిస్ చేసే ప్రశ్నలు
  • సరైన సమాధానాలతో మార్క్ చేయబడిన గ్రాఫ్‌లు
  • స్కోర్‌ల సగటు, మధ్యగత విలువ, పరిధి

ఒక్కొక్క ప్రతిస్పందనను గ్రేడ్ చేయండి

మీరు ఈమెయిల్ అడ్రస్‌లను సేకరిస్తే, ఒక్కొక్క ప్రతిస్పందనకు మీరు పాయింట్‌లను కేటాయించవచ్చు, ఫీడ్‌బ్యాక్‌ను అందించవచ్చు. మీరు ఒక్కో ప్రతిస్పందనను గ్రేడ్ చేసిన తర్వాత, మీ మార్పులను సేవ్ చేయండి.

  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలు ఎంపికను క్లిక్ చేయండి.
  3. స్వతంత్ర వ్యక్తి ఎంపికను క్లిక్ చేయండి.
  4. ప్రతిస్పందనల మధ్య మారడానికి, మునుపటి మునుపటి లేదా తర్వాతి తర్వాత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీరు గ్రేడ్ చేయాలనుకుంటున్న ప్రశ్నను కనుగొనండి.
    • ఎగువ కుడి భాగంలో, ప్రతిస్పందనకు ఎన్ని పాయింట్‌లు వచ్చాయో ఎంటర్ చేయండి.
    • సమాధానం కింద, ఫీడ్‌బ్యాక్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మీ ఫీడ్‌బ్యాక్‌ను ఎంటర్ చేసి, సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. మీ మార్పులను సేవ్ చేయడానికి, దిగువున ఉన్న, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
క్విజ్ ఫలితాలను చూడండి
  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలు ఎంపికను క్లిక్ చేయండి.
  3. సారాంశం అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ప్రశ్న వారీగా గ్రేడ్ చేయండి
  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువభాగంలో, ప్రతిస్పందనలు ఎంపికను క్లిక్ చేయండి.
  3. "ప్రతిస్పందనలు" విభాగం క్రింద, ప్రశ్నను క్లిక్ చేయండి.
  4. సమాధానాల గ్రూప్ కోసం పాయింట్‌లను అందించడానికి:
    • మొత్తం పాయింట్‌లు: సరిగ్గా మార్క్ చేయండి సరైనదిగా గుర్తుపెట్టండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • పాక్షిక పాయింట్‌లు: మీరు అందించాలనుకుంటున్న పాయింట్‌ల సంఖ్యను ఎంటర్ చేయండి.
    • పాయింట్‌లు ఏవీ లేవు: తప్పుగా మార్క్ చేయండి సరికానిదిగా గుర్తుపెట్టండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ప్రశ్న కోసం రాతపూర్వకమైన లేదా YouTube వీడియో ఫీడ్‌బ్యాక్‌ను జోడించడానికి, ఫీడ్‌బ్యాక్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. ప్రశ్నల మధ్య మారడానికి, పైభాగంలో, మునుపటిది మునుపటి లేదా తదుపరిది తర్వాత క్లిక్ చేయండి.
  7. మీరు గ్రేడింగ్‌ను పూర్తి చేసినప్పుడు, దిగువున ఉన్న, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఫలితాలను షేర్ చేయండి

మీరు మీ ఫారమ్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను సేకరిస్తే, వెంటనే మీరు ఫలితాలను పంపవచ్చు లేదా మీరు వాటిని షేర్ చేయడానికి సిద్ధం అయ్యేంత వరకు వేచి ఉండవచ్చు.

డిఫాల్ట్‌గా:

  • గ్రేడ్‌లు వెంటనే రిలీజ్ అవుతాయి
  • ఈమెయిల్ అడ్రస్‌లను సేకరించడం జరగదు.

మీరు గ్రేడ్‌లను రిలీజ్ చేసే విధానాన్ని మార్చండి

  1. Google Formsలో, క్విజ్‌ను తెరవండి.
  2. సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “గ్రేడ్‌లను రిలీజ్ చేయండి” అనే విభాగంలో, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ప్రతి సమర్పణ తర్వాత వెంటనే
    • ఆపై, మాన్యువల్ రివ్యూ తర్వాత

రివ్యూ తర్వాత ఈమెయిల్ ఫలితాలు

  1. Google ఫారమ్‌లలో, క్విజ్‌ను తెరవండి.
  2. ఎగువున, ప్రతిస్పందనలుఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. రికార్డ్ చేయబడిన ఇమెయిల్ చిరునామాను కలిగిన ప్రతిస్పందనకు ఎగువ కుడిభాగంలో, రిలీజ్ స్కోర్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఇమెయిల్ పంపాలనుకుంటున్న వ్యక్తులకు పక్కన ఉన్న బాక్సులను ఎంచుకోండి.
  5. ఈమెయిల్స్‌ను పంపి, వాటిని రిలీజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5847034343472539792
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false