కుడి నుండి ఎడమకు ఉన్న వచనాన్ని ఎడిట్ చేయండి & వీక్షించండి

మీరు కుడి-నుండి-ఎడమ వచనం ఉన్న డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ని తెరిచినప్పుడు లేదా కుడి-నుండి-ఎడమ భాషలో వచనాన్ని జోడించినప్పుడు కుడి-నుండి-ఎడమ నియంత్రణలు ఆటోమేటిక్‌గా ఆన్ చేయబడతాయి. మీరు కుడి-నుండి-ఎడమ నియంత్రణలను మాన్యువల్‌గా కూడా ఆన్ చేయవచ్చు.

కుడి-నుండి-ఎడమ భాష నియంత్రణలను ఆన్ చేయండి

కుడి-నుండి-ఎడమ భాషల కోసం Google డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌లను సెటప్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌లు హోమ్ స్క్రీన్‌కి వెళ్లండి.
  2. ఎగువ ఎడమ మూలన, మెను మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు నొక్కండి.
  3. ఎల్లప్పుడూ కుడి-నుండి-ఎడమ నియంత్రణలను చూపు" ప్రక్కన ఉన్న పెట్టెను క్లిక్ చేయండి.
  4. సరే క్లిక్ చేయండి. సెట్టింగ్ ఇప్పుడు Google డాక్స్, షీట్‌లు, మరియు స్లయిడ్‌లకు వర్తిస్తుంది.

కుడి-నుండి-ఎడమ భాష నియంత్రణలను ఉపయోగించండి

మీరు కుడి-నుండి-ఎడమ నియంత్రణలను ఆన్ చేసిన తర్వాత, మీరు కుడి-నుండి-ఎడమ భాషలోని వచనంతో కూడిన డాక్యుమెంట్‌ల లేఅవుట్‌ని మార్చగలరు. 

Google డాక్స్

పేరాగ్రాఫ్ దిశను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో Google డాక్స్‌కి వెళ్లండి.
  2. కుడి-నుండి-ఎడమ భాషలో వచనం కలిగిన డాక్యుమెంట్‌ని తెరవండి.
  3. పేరాగ్రాఫ్ దిశను మార్చేందుకు, టూల్‌బార్‌లో, పేరాగ్రాఫ్ దిశను క్లిక్ చేయండి paragraph direction.

పట్టిక దిశను మార్చండి (నిలువు వరుస క్రమం)

  1. మీ కంప్యూటర్‌లో Google డాక్స్‌కి వెళ్లండి.
  2. డాక్యుమెంట్‌ని తెరవండి.
  3. పట్టికను ఆ తర్వాత ఆకృతీకరించు ఆ తర్వాత పట్టిక లక్షణాలు క్లిక్ చేయండి.
  4. "నిలువు వరుస క్రమం" విభాగంలో, కుడి-నుండి-ఎడమ లేదా ఎడమ-నుండి-కుడి ఎంచుకోండి.
Google షీట్‌లు

నిర్దిష్ట షీట్‌కి సంబంధించి నిలువు వరుసల యొక్క దిశను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లుకి వెళ్లండి.
  2. కుడి-నుండి-ఎడమ భాషలో వచనం కలిగిన స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  3. టూల్‌‌బార్‌లో, దిశను క్లిక్ చేయండి right to left table direction.

గమనిక: ఈ మార్పు ప్రస్తుత షీట్‌కి మాత్రమే వర్తిస్తుంది, స్ప్రెడ్‌షీట్‌లోని అన్ని షీట్‌లకు వర్తించదు.

సెల్‌లో వచనం యొక్క దిశను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లుకి వెళ్లండి.
  2. కుడి-నుండి-ఎడమ భాషలో వచనం కలిగిన స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న వచనాన్ని క్లిక్ చేయండి.
  4. టూల్‌బార్‌లో, సెల్ దిశను క్లిక్ చేయండి paragraph direction.

గమనిక: మీరు కుడి-నుండి-ఎడమ భాషను ఉపయోగించి సెల్‌లో వచనాన్ని టైప్ చేసినట్లయితే, Google షీట్‌లు స్వయంచాలకంగా వచనం దిశను కుడి-నుండి-ఎడమకు మారుస్తాయి. మీరు ఎడమ-నుండి-కుడి భాషలో టైప్ చేయడం ప్రారంభించినట్లయితే అది తిరిగి మార్చబడుతుంది.

Google స్లయిడ్‌లు

పేరాగ్రాఫ్ దిశను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో Google స్లయిడ్‌లుకి వెళ్లండి.
  2. కుడి-నుండి-ఎడమ భాషలో వచనం కలిగిన ప్రెజెంటేషన్‌ని తెరవండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న వచనాన్ని క్లిక్ చేయండి.
  4. ఫార్మాట్ టూల్‌బార్‌లో, పేరాగ్రాఫ్ దిశను క్లిక్ చేయండి paragraph direction.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11612537264352249354
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false