కామెంట్‌లను, పూర్తి చేయాల్సిన చర్యలను, అలాగే ఎమోజి ప్రతిస్పందనలను ఉపయోగించండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

మీరు Google Docs, Sheets, Slidesలో ఇతరులతో కలిసి ఇవి చేయగలరు:
  • కామెంట్‌లను జోడించండి, ఎడిట్ చేయండి, రిప్లయి ఇవ్వండి, లేదా తొలగించండి
  • టాస్క్‌లు, పూర్తి చేయాల్సిన చర్యలను కేటాయించండి
  • ఎమోజీ రియాక్షన్‌లను జోడించండి

కామెంట్‌లను జోడించండి, ఎడిట్ చేయండి, చూడండి, ఫిల్టర్ చేయండి లేదా తొలగించండి

కామెంట్‌ను జోడించండి
  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు వ్యాఖ్యానించాలనుకుంటున్న వచనం, చిత్రాలు, సెల్‌లు లేదా స్లయిడ్‌లను హైలైట్ చేయండి.
  3. కామెంట్‌ని జోడించేందుకు, టూల్‌బార్‌లో, కామెంట్‌ని జోడించు వ్యాఖ్యను జోడించు క్లిక్ చేయండి.
  4. మీ కామెంట్‌ని టైప్ చేయండి.
  5. కామెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
కామెంట్‌లను చూడండి, దాచండి లేదా కుదించండి
  1. మీ కంప్యూటర్‌లోని డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. కామెంట్‌ల ప్యానెల్‌ను తెరవడానికి లేదా మూసివేయడానికి, ఎగువున కుడి వైపున ఉన్న, అన్ని కామెంట్‌లను చూడండి వ్యాఖ్యలను తెరువు ని క్లిక్ చేయండి.
  3. మీ డాక్యుమెంట్‌కు పక్కన ఉండే కామెంట్‌లను దాచడానికి, కుదించడానికి లేదా విస్తరించడానికి, చూడండి ఆ తర్వాత కామెంట్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • కామెంట్‌లను దాచండి: ఇది అన్ని కామెంట్‌లను దాచడమే కాకుండా, ఏదైనా కామెంట్‌ల ప్యానెల్ తెరిచి ఉంటే దాన్ని మూసివేస్తుంది.
    • కామెంట్‌లను కుదించండి: Docs, Sheetsలోని చిహ్నాలకు కామెంట్‌లను తగ్గిస్తుంది, వీటిని ప్రివ్యూ చేయడానికి మీరు మౌస్ కర్సర్ ఉంచడం చేయవచ్చు అలాగే మరిన్ని చూడటానికి క్లిక్ చేయవచ్చు.
    • కామెంట్‌లను విస్తరించండి: పూర్తి కామెంట్‌లను, రిప్లయిలను చూపుతుంది, మీరు రిప్లయి ఇవ్వడానికి లేదా ఇతరులను జోడించడానికి వాటిని క్లిక్ చేయవచ్చు.
కామెంట్‌లను కనుగొనండి
  1. మీ కంప్యూటర్‌లోని డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.

  2. ఎగువున కుడి వైపున ఉన్న, అన్ని కామెంట్‌లను చూడండి వ్యాఖ్యలను తెరువు ని క్లిక్ చేయండి.
  3. దాని లొకేషన్‌ను చూడటానికి కామెంట్ మీద క్లిక్ చేయండి.

మీరు కీవర్డ్‌లు లేదా యూజర్‌నేమ్‌లను ఉపయోగించి కూడా కామెంట్ కోసం సెర్చ్ చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లోని డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.

  2. ఎగువున కుడి వైపున ఉన్న, అన్ని కామెంట్‌లను చూడండి వ్యాఖ్యలను తెరువు ని క్లిక్ చేయండి.
  3. కామెంట్‌ల ప్యానెల్ కుడి వైపున, అన్ని కామెంట్‌లను సెర్చ్ చేయండి Filter comments by keyword ని క్లిక్ చేయండి.
  4. కామెంట్ లేదా వ్యక్తి కోసం సెర్చ్ చేయడానికి కీవర్డ్‌లను ఎంటర్ చేయండి.

Google Sheetsలో కామెంట్ లొకేషన్‌ను కనుగొనండి

Google Sheets‌లో, మీరు యాక్టివ్ షీట్ కోసం కామెంట్ లొకేషన్‌లను కనుగొనవచ్చు.

  1. యాక్టివ్ షీట్ దిగువున, ట్యాబ్‌లోని కామెంట్ నోటిఫికేషన్‌ను సూచించండి .
  2. కనిపించే టూల్‌బార్‌లో, హైలైట్ చేసిన సెల్‌కు తరలించడానికి సెల్ లొకేషన్‌ను క్లిక్ చేసి కామెంట్ చేయండి.
కామెంట్‌లను ఫిల్టర్ చేయండి

మీరు Google Docs, Slides, ఇంకా Sheetsలో కామెంట్‌లను ఫిల్టర్ చేయవచ్చు.

  1. డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌లో, అన్ని కామెంట్‌లను చూడండి వ్యాఖ్యలను తెరువు ని క్లిక్ చేయండి.
  2. అన్ని కామెంట్‌లను చూడటానికి లేదా మీ కోసం కామెంట్‌లను చూడటానికి ఒక ట్యాబ్‌ను ఎంచుకోండి.
  3. తెరిచిన లేదా మూసివేసిన కామెంట్‌లను చూడటానికి, అన్ని రకాలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. (ఆప్షనల్) Google Sheetsలో, మీరు షీట్ ద్వారా కామెంట్‌లను ఫిల్టర్ చేయవచ్చు. ఫిల్టర్‌ను ప్రస్తుత షీట్‌కు మార్చడానికి, "కామెంట్‌లు" విండో కుడి వైపున ఉన్న, అన్ని షీట్‌లు కిందికి బాణం ను క్లిక్ చేయండి.
  5. ఆ కేటగిరీకి సంబంధించిన అన్ని కామెంట్‌లు విండోలో కనిపిస్తాయి.
కామెంట్‌ను ఎడిట్ చేయండి లేదా తొలగించండి
  1. మీ కంప్యూటర్‌లోని డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు సవరించాలనుకుంటున్న లేదా తొలగించాలనుకుంటున్న కామెంట్‌పై, మరిన్ని మరిన్ని నొక్కండి.
  3. సవరించు లేదా తొలగించు క్లిక్ చేయండి.
నిర్దిష్ట వ్యక్తికి కామెంట్‌ను పంపండి

మీ కామెంట్ ఎవరికైనా కనిపించేలా చేయడానికి, మీరు వారిని కామెంట్‌కు జోడించవచ్చు. వారు మీ కామెంట్‌తో కూడిన ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు.

చిట్కా: ఎవరైనా వారి స్టేటస్‌ను “ఆఫీస్‌లో లేరు”గా సెట్ చేసి, వారి క్యాలెండర్‌ను చూడటానికి మీకు అనుమతి ఉంటే, మీరు వారిని జోడించినప్పుడు కామెంట్‌లో నోటిఫికేషన్‌ను పొందుతారు.

  1. మీ కంప్యూటర్‌లోని డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఇన్‌సర్ట్ చేసి, కామెంట్‌ను టైప్ చేయండి.
  3. మీ కామెంట్‌లో ఎక్కడైనా, "@", వారి పేరు లేదా ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. సరైన వ్యక్తి సూచించబడితే, వారి పేరును క్లిక్ చేయండి.
  4. కామెంట్ చేయండిని క్లిక్ చేయండి.

గమనిక: ఫైల్‌ను చూడటానికి అనుమతి లేని వ్యక్తిని ఎవరినైనా మీరు జోడించినట్లయితే, ఫైల్‌ను షేర్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

కామెంట్‌ల పరిమితి తర్వాత మరిన్ని కామెంట్‌లను జోడించండి

మీరు మీ Google డాక్, షీట్ లేదా స్లయిడ్‌లో "మీరు కామెంట్‌లకు డాక్యుమెంట్ పరిమితిని చేరుకున్నారు. కొత్త కాపీ‌లో కామెంట్ చేయడాన్ని కొనసాగించడానికి, దయచేసి, పరిష్కరించిన కామెంట్‌లు లేకుండా డాక్యుమెంట్ కాపీని రూపొందించండి" అని తెలియజేసే అలర్ట్ మీకు కనిపించవచ్చు.

మీ ఫైల్‌కు మరిన్ని కామెంట్‌లను జోడించడానికి:

  1. యాక్టివ్‌గా లేని కామెంట్‌లను పరిష్కరించండి.
  2. ఫైల్ ఆ తర్వాత మీ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, లేదా ప్రెజెంటేషన్‌కు చెందిన కాపీని రూపొందించండి ఆప్షన్‌లకు వెళ్లండి.
  3. పాప్-అప్ విండోలో, కామెంట్‌లు మరియు సూచనలను కాపీ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పనిని కొనసాగించడానికి కాపీని ఉపయోగించండి.

చిట్కా: పరిష్కరించబడిన కామెంట్‌లు మీ ఒరిజినల్ డాక్యుమెంట్‌లో యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి.

కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి లేదా మూసివేయండి

డాక్యుమెంట్‌ని సవరించేందుకు లేదా దానిపై వ్యాఖ్యానించేందుకు మీకు అనుమతి ఉంటే, మీరు కామెంట్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వగలరు. చర్చ పూర్తయినప్పుడు, కామెంట్‌ని మూసివేసేందుకు మీరు దానిని పరిష్కరించగలరు.

చిట్కా: మీరు మీ ఈమెయిల్ నుండి నేరుగా కామెంట్‌లకు రిప్లయి ఇవ్వగలరు లేదా వాటిని మూసివేయగలరు. Gmailలో కామెంట్‌లతో ఎలా పని చేయాలో తెలుసుకోండి.

కామెంట్‌కు రిప్లయి ఇవ్వండి

డాక్యుమెంట్‌లు లేదా ప్రెజెంటేషన్‌లలోని కామెంట్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వండి

  1. మీ కంప్యూటర్‌లో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. కామెంట్‌ను క్లిక్ చేయండి.
  3. ప్రత్యుత్తరమివ్వు క్లిక్ చేసి మీ ప్రత్యుత్తరాన్ని టైప్ చేయండి.
  4. సేవ్ చేసేందుకు, రిప్లయి ఇవ్వండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: Google Docsలో, టెక్స్ట్ బాక్స్ దిగువున, మీరు స్మార్ట్ రిప్లయిపై క్లిక్ చేయవచ్చు.

స్ప్రెడ్‌షీట్‌లలోని కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి

  1. మీ కంప్యూటర్‌లో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. షీట్ ట్యాబ్‌పై, కామెంట్‌ని జోడించు వ్యాఖ్యను జోడించు క్లిక్ చేయండి.
  3. మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలనుకుంటున్న కామెంట్‌ని క్లిక్ చేయండి.
  4. ప్రత్యుత్తరమివ్వు క్లిక్ చేసి మీ ప్రత్యుత్తరాన్ని టైప్ చేయండి.
  5. సేవ్ చేసేందుకు, రిప్లయి ఇవ్వండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: ఎవరైనా వారి స్టేటస్‌ను “ఆఫీస్‌లో లేరు”గా సెట్ చేసి, వారి క్యాలెండర్‌ను చూడటానికి మీకు అనుమతి ఉంటే, మీరు వారికి రిప్లయి ఇచ్చినప్పుడు కామెంట్‌లో నోటిఫికేషన్‌ను పొందుతారు.

కామెంట్‌ను మూసివేయండి లేదా మళ్లీ తెరవండి
  1. మీ కంప్యూటర్‌లోని డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు మూసివేయాలనుకుంటున్న కామెంట్‌ని క్లిక్ చేయండి.
  3. కామెంట్ యొక్క ఎగువ మూలన, పరిష్కరించు క్లిక్ చేయండి.

మీరు మూసివేసిన కామెంట్‌ని చూసేందుకు, విండో యొక్క పై మూలన కామెంట్‌లు క్లిక్ చేయండి. మూసివేసిన కామెంట్‌ను మళ్లీ తెరవడానికి, కామెంట్ యొక్క ఎగువ కుడి మూలన మళ్లీ తెరవండిని క్లిక్ చేయండి.

పూర్తి చేయాల్సిన చర్యలను ఉపయోగించండి, ఫాలో అప్ చేయండి

మీ కార్యాలయ లేదా పాఠశాల ఖాతాతో పనులు లేదా చర్య అంశాలను కేటాయించడానికి కామెంట్‌లను ఉపయోగించండి. మీ ఫైల్‌లోని కంటెంట్ ఆధారంగా సూచిత చర్య అంశాలు కనిపిస్తాయి.

కామెంట్‌లో చర్య అంశాన్ని కేటాయించండి
  1. మీ కంప్యూటర్‌లో Google ఫైల్‌ని తెరవండి.
  2. మీరు వ్యాఖ్యానించాలనుకుంటున్న వచనం, చిత్రాలు, సెల్‌లు లేదా స్లయిడ్‌లను హైలైట్ చేయండి.
  3. కామెంట్‌ని జోడించేందుకు, టూల్‌బార్‌కి వెళ్లి, కామెంట్‌ని జోడించు వ్యాఖ్యను జోడించు క్లిక్ చేయండి.
  4. మీ కామెంట్‌ని టైప్ చేయండి.
  5. మీ కామెంట్‌లో ఎక్కడైనా మీరు దానిని కేటాయించాలనుకుంటున్న వ్యక్తి ఈమెయిల్ అడ్రస్‌ను ముందర @ లేదా + ఉంచి జోడించండి.
  6. "[name]కి కేటాయించు" పక్కన ఉన్న పెట్టెను క్లిక్ చేయండి.
  7. కేటాయించు క్లిక్ చేయండి. మీరు పూర్తి చేయాల్సిన చర్యను కేటాయించిన వ్యక్తి ఈమెయిల్‌ను పొందుతారు.

చిట్కా: ఎవరైనా వారి స్టేటస్‌ను “ఆఫీస్‌లో లేరు”గా సెట్ చేసి, వారి క్యాలెండర్‌ను చూడటానికి మీకు అనుమతి ఉంటే, మీరు వారికి దాన్ని కేటాయించినప్పుడు, మీరు కామెంట్‌లో నోటిఫికేషన్‌ను పొందుతారు.

పూర్తి చేయాల్సిన చర్యను మళ్లీ కేటాయించండి
  1. మీ కంప్యూటర్‌లో Google ఫైల్‌ని తెరవండి.
  2. కామెంట్‌ను క్లిక్ చేయండి.
  3. ప్రత్యుత్తరమివ్వు క్లిక్ చేయండి.
  4. మీ కామెంట్‌ని టైప్ చేయండి.
  5. మీ కామెంట్‌లో ఎక్కడైనా మీరు దానిని పునఃకేటాయించాలనుకుంటున్న వ్యక్తి యొక్క ఇమెయిల్ చిరునామాని ముందర @ లేదా + ఉంచి జోడించండి.
  6. "[name]కి పునఃకేటాయించు" పక్కన ఉన్న పెట్టెను క్లిక్ చేయండి.
  7. పునఃకేటాయించు క్లిక్ చేయండి. మీరు పూర్తి చేయాల్సిన చర్యను కేటాయించిన వ్యక్తి ఈమెయిల్‌ను పొందుతారు.
పూర్తి చేయాల్సిన చర్య పూర్తయినట్లు మార్క్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో Google ఫైల్‌ని తెరవండి.
  2. కామెంట్ యొక్క ఎగువ కుడి మూలన, పూర్తయింది పూర్తయింది క్లిక్ చేయండి.
డాక్యుమెంట్ గురించిన తదనంతర విషయాలను చూడండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Docs, Sheets లేదా Slides హోమ్ స్క్రీన్‌ని లేదా Google Driveని తెరవండి.
  2. డాక్యుమెంట్ యొక్క పైన కుడి మూలన, నంబర్‌ని క్లిక్ చేయండి. మీకు నంబర్ కనిపించకపోతే, మీకు ఆ డాక్యుమెంట్‌కు సంబంధించి ఫాలో-అప్‌లు ఏవీ లేవు.
  3. మీరు కింద పేర్కొన్న అనేక పరిష్కరించబడని అంశాలను చూడవచ్చు:
    • పూర్తి చేయాల్సిన చర్యలు
    • సూచనలు
  4. మొదటి పూర్తి చేయాల్సిన చర్య లేదా సూచనకు వెళ్లడానికి, లిస్ట్ నుండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మెనూను మూసివేయడానికి, నంబర్‌ను క్లిక్ చేయండి.

Google Docs, Sheets, Slidesలలో ఎమోజీ రియాక్షన్‌లను ఉపయోగించండి

మీరు డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌లో కామెంట్ చేయగలిగితే లేదా దాన్ని ఎడిట్ చేయగలిగితే, మీరు Docs లేదా Sheetsలోని కామెంట్‌లకు లేదంటే Docsలో లేదా Slidesలో మీరు హైలైట్ చేసే కంటెంట్‌కు ఎమోజీ రియాక్షన్‌లను జోడించవచ్చు.

ఎమోజీ రియాక్షన్‌లను జోడించండి

చిట్కా: సహకారి ఇప్పటికే ఎమోజి రియాక్షన్‌ను జోడించినట్లయితే, మీ రియాక్షన్‌ను జోడించడానికి మీరు ఎమోజిని క్లిక్ చేయవచ్చు. ఎంచుకున్న ఒకే టెక్స్ట్‌కు లేదా కామెంట్‌కు మీరు పలు ఎమోజీలను జోడించవచ్చు.

Google Docsలో హైలైట్ చేసిన కంటెంట్‌కు ఎమోజీ రియాక్షన్‌లను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్‌ను తెరవండి.
  2. మీరు ప్రతిస్పందించాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి.
  3. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • కుడి వైపున ఉండే మార్జిన్‌లో, ఎమోజి ప్రతిస్పందనను జోడించండి Add Emoji Reaction ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఇన్‌సర్ట్ చేయండి ఆ తర్వాత ఎమోజి ప్రతిస్పందన అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • మీరు జోడించాలనుకుంటున్న ఎమోజీని ఎంచుకోండి.
    • మీరు ఎమోజి కోసం సెర్చ్ క్వెరీలను కూడా ఎంటర్ చేయవచ్చు.

కామెంట్‌లకు ఎమోజి రియాక్షన్‌లను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్‌ను, Google షీట్‌ను లేదా Google Slides ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు ఏ కామెంట్‌కు అయితే రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ కామెంట్‌పై మౌస్ కర్సర్ ఉంచండి.
  3. ఎమోజీ రియాక్షన్‌ను జోడించండి Add Emoji Reaction ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • మీరు జోడించాలనుకుంటున్న ఎమోజీని ఎంచుకోండి.
    • మీరు ఎమోజి కోసం సెర్చ్ క్వెరీలను కూడా ఎంటర్ చేయవచ్చు.
ఎమోజీ రియాక్షన్‌లను తీసివేయండి లేదా పరిష్కరించండి

Google డాక్, షీట్, లేదా Slides ప్రెజెంటేషన్‌లోని కామెంట్‌ల నుండి లేదా Google డాక్‌లో హైలైట్ చేసిన కంటెంట్ నుండి మీ రియాక్షన్‌ను తీసివేయడానికి, ఎమోజీని మళ్లీ క్లిక్ చేయండి.

చిట్కా: మీ రియాక్షన్‌ను మీరు తీసివేయడం వలన ఇతర సహకారుల రియాక్షన్‌లు తీసివేయబడవు.

Google డాక్‌లో హైలైట్ చేసిన కంటెంట్‌పై రియాక్షన్ పరిష్కరించడానికి ఈ కింది దశలను ఫాలో అవ్వండి:

  1. ఎమోజీ రియాక్షన్‌ను క్లిక్ చేయండి.
  2. పరిష్కరించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • చిట్కా: పరిష్కరించబడిన రియాక్షన్‌లను చూడటానికి, ఎగువ కుడి వైపున ఉన్న, కామెంట్‌లు కామెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

కామెంట్‌ల మధ్య నావిగేట్ చేయడానికి, కామెంట్‌లకు రిప్లయి ఇవ్వడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

కింది పనులు చేయడానికి మీరు కామెంట్‌ను ఎంచుకొని, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు:

  • కామెంట్‌ల మధ్య నావిగేట్ చేయడానికి.
  • కామెంట్‌లకు రిప్లయి ఇవ్వడానికి.
  • కామెంట్‌లను దాచడానికి లేదా చూపడానికి.

ఎంచుకున్న కామెంట్‌లపై కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ప్రస్తుత కామెంట్‌కు రిప్లయి ఇవ్వడం R
తర్వాత కామెంట్‌కు వెళ్లడం J
మునుపటి కామెంట్‌కు వెళ్లడం K
ప్రస్తుత కామెంట్‌ను పరిష్కరించడం E
ప్రస్తుత కామెంట్ నుండి నిష్క్రమించడం U
కామెంట్‌ను దాచడం

Windows, Chrome OS కోసం: Ctrl + Alt + Shift + n 

Mac కోసం: ⌘ + Alt + Shift + n

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
3383084893728061901
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false