Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లలో ఆఫ్‌లైన్‌లో పని చేసుకోండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

ఒకవేళ మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోయినప్పటికీ, మీరింకా వీటిలో ఫైల్‌లను సృష్టించడం, వీక్షించడం మరియు ఎడిట్ చేయడం చేయగలరు:

  • Google Docs
  • Google Sheets
  • Google Slides

Google డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌లను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించండి

మీరు మీ కంప్యూటర్‌లో ఇటీవల తెరిచిన డాక్యుమెంట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేసే ముందు

  • మీరు తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉండాలి.
  • మీరు తప్పనిసరిగా Google Chrome లేదా Microsoft Edge బ్రౌజర్‌ను ఉపయోగించాలి.
  • ప్రైవేట్ బ్రౌజింగ్‌ను ఉపయోగించకండి.
  • Google డాక్స్ ఆఫ్‌లైన్ Chrome ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఆన్ చేయండి.
  • మీ ఫైళ్లను సేవ్ చేయడానికి మీ పరికరంలో తగినంత స్పేస్ అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి.

ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఎలా ఆన్ చేయాలి

  1. Google Driveను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లుఆ తర్వాత సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఆఫ్‌లైన్ సెట్టింగ్‌ను ఆన్ చేయండి. 
    1. మీరు Microsoft Edgeను ఉపయోగిస్తుంటే, Google Docs ఆఫ్‌లైన్ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీరు Chrome వెబ్ స్టోర్‌కి మళ్లించబడతారు.
  4. ఆఫ్‌లైన్‌లో పని చేయడానికి, Google Docs, Sheets, లేదా Slidesను తెరవండి. 

చిట్కా:

  • Docs, Sheets, లేదా Slides సెట్టింగ్‌ల నుండి మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేయవచ్చు. మీరు Docs, Sheets, Slides లేదా డ్రైవ్ కోసం ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేస్తే, మిగిలినవి కూడా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
  • ప్రత్యామ్నాయంగా, ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేయడానికి, ఏదైనా Google డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి. ఎగువన, ఫైల్ టైటిల్‌కు పక్కన ఉన్న, డాక్యుమెంట్ స్టేటస్‌ను చూడండి Cloud done ఆ తర్వాత ఆన్ చేయండి ఆ తర్వాత ఆన్ చేయండి అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి .
  • మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను వేరే Google ఖాతా కోసం ఉపయోగించాలనుకుంటే, మీరు సరైన Chrome లేదా Edge ప్రొఫైల్‌కు సైన్ ఇన్ అయ్యారని నిర్ధారించుకోండి. Chrome ప్రొఫైల్‌లను స్విచ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆఫ్ చేయండి

  1. Google Docs, Sheets లేదా Slides మొదటి స్క్రీన్‌ను తెరవండి.
  2. మెనూ మెనుఆ తర్వాత సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. కుడి వైపు, ఆఫ్‌లైన్‌ను ఆఫ్ చేయండి.
    • చిట్కా: మీరు Docs, Sheets లేదా Slides కోసం ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆఫ్ చేస్తే, మిగిలిన వాటికి ఆఫ్‌లైన్ యాక్సెస్ కూడా ఆఫ్ అవుతుంది.

నిర్దిష్ట ఫైల్‌లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచండి

మీకు తగినంత స్టోరేజ్ ఉంటే, మీ తాజా ఫైల్‌లు కొన్ని ఆటోమేటిక్‌గా ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయబడతాయి. ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయడానికి ఫైల్‌లను మాన్యువల్‌గా ఎంచుకోవడానికి:

  1. Google Driveలో ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేయడానికి పై దశలను అనుసరించండి.
  2. Google Docs, Sheets లేదా Slides మొదటి స్క్రీన్‌ను తెరవండి.
  3. మీరు ఆఫ్‌లైన్‌లో ఉపయోగించాలనుకుంటున్న ఫైల్‌లో, మరిన్ని మరిన్ని క్లిక్ చేయండి.
  4. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచు క్లిక్ చేయండి. ఫైల్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉందని చూపడానికి దిగువ ఎడమ మూలలో ఒక ఎంపిక గుర్తు కనిపిస్తుంది.

చిట్కా: మీరొక Google డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరిచి, ఫైల్ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచును క్లిక్ చేయడం ద్వారా కూడా ఆ ఫైల్‌ను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచవచ్చు.

డాక్యుమెంట్, ఆఫ్‌లైన్ వినియోగం కోసం సిద్ధంగా ఉందో లేదో తనిఖీ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Docs, Sheets, లేదా Slidesలో ఫైల్‌ను తెరవండి.
  2. ఎగువన, ఫైల్ టైటిల్ పక్కన, డాక్యుమెంట్ స్టేటస్‌ను చూడండి Cloud done అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీ డాక్యుమెంట్ ఆఫ్‌లైన్‌లో ఎడిట్ చేయడానికి ఇంకా సిద్ధం కాకపోతే, దానికి సంబంధించిన వివరణ కనిపిస్తుంది.

ఫైల్‌లను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించడంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీకు Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌లతో ఆఫ్‌లైన్‌లో పనిచేయడంలో ఏదైనా సమస్య ఉంటే, ఈ దశలను ప్రయత్నించండి.

మీ బ్రౌజర్‌ని తనిఖీ చేయండి

  • మీరు Google Chrome లేదా Microsoft Edge బ్రౌజర్‌లలో ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించవచ్చు.
  • ప్రైవేట్ లేదా అజ్ఞాత బ్రౌజింగ్‌ను ఉపయోగించవద్దు. 
  • మీరు Google Docs ఆఫ్‌లైన్ Chrome ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేశారని, అలాగే అది ఆన్ చేసి ఉంచారని నిర్ధారించుకోండి.
  • మీ బ్రౌజర్ అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి.

ఎర్రర్ సందేశం: "ఆఫ్‌లైన్ సింక్ స్టేటస్‌ను చెక్ చేస్తోంది. దయచేసి వేచి ఉండండి."

  • పేజీని మళ్లీ లోడ్ చేసి, మళ్లీ ప్రయత్నించండి. 
  • మీ సైట్ డేటాను క్లియర్ చేయండి:
    1. chrome://settings/cookies/detail?site=docs.google.com ను తెరవండి.
      1. మీరు Microsoft Edgeను ఉపయోగిస్తున్నట్లయితే, edge://settings/cookies/detail?site=docs.google.com ను తెరవండి.
    2. అన్నింటినీ తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఎర్రర్ సందేశం: "మీ నిర్వాహకులు ఆఫ్‌లైన్ సింక్‌ను డిజేబుల్ చేశారు".

మీరు ఈ ఖాతాతో ఆఫ్‌లైన్‌ను ఉపయోగించలేరు. మీ నిర్వాహకులను ఎలా సంప్రదించాలో తెలుసుకోండి.

ఎర్రర్ సందేశం: "మరో వినియోగదారు ఇప్పటికే ఈ కంప్యూటర్‌లో ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ప్రారంభించారు".

ప్రతి బ్రౌజర్ ప్రొఫైల్‌కు ఒక ఖాతా మాత్రమే ఆఫ్‌లైన్ ఎనేబుల్ చేయబడుతుంది. మీరు ఆఫ్‌లైన్ కోసం అనేక ఖాతాలను ఎనేబుల్ చేయాలనుకుంటే, వాటిని వేర్వేరు బ్రౌజర్ ప్రొఫైల్స్‌లో క్రియేట్ చేయండి. కొత్త ప్రొఫైల్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి, ఆ తర్వాత ప్రతి ప్రొఫైల్‌లో ఒక ఖాతాకు ఆఫ్‌లైన్ ఎనేబుల్ చేయండి. 

ఆఫ్‌లైన్ సెటప్ విఫలమైంది

ఆఫ్‌లైన్‌ను డిజేబుల్‌ చేయడం మరియు మళ్లీ ఎనేబుల్ చేయడం 

మీ సైట్ డేటాను క్లియర్ చేయండి 

  1. chrome://settings/cookies/detail?site=docs.google.com ను తెరవండి
    1. మీరు Microsoft Edgeను ఉపయోగిస్తున్నట్లయితే, edge://settings/cookies/detail?site=docs.google.com ను తెరవండి
  2. అన్నింటినీ తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

ఆఫ్‌లైన్ ఇప్పటికే ఆన్‌లో ఉంది

మీరు Chrome ప్రొఫైల్‌ను సృష్టించేటప్పుడు మీ Docs, Driveను సింక్ చేయాలని ఎంచుకుంటే లేదా మీ పరికరంలో డెస్క్‌టాప్ Drive ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే, మీరు ChromeOS వినియోగదారు అయితే ఆఫ్‌లైన్ ఆటోమేటిక్‌గా ప్రారంభించబడుతుంది.

ఆఫ్‌లైన్‌ను ఎలా డిజేబుల్ చేయాలో తెలుసుకోండి.

ఎర్రర్ మెసేజ్: డాక్యుమెంట్‌ను సింక్ చేయడం సాధ్యపడలేదు లేదా సింక్ చేయడంలో సమస్య ఏర్పడింది

1వ దశ: మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ను తనిఖీ చేయండి

మీ నెట్‌వర్క్ కనెక్షన్‌లో సమస్య ఉండవచ్చు. ముందుగా, మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని తనిఖీ చేయండి. ఆపై, ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను నిలిపివేసి, మళ్ళీ ప్రారంభించండి.

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్, షీట్ లేదా స్లయిడ్ తెరవండి
  2. ఎగువన, ఫైల్ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచు క్లిక్ చేయండి. ఎంపిక గుర్తు కనిపించకూడదు.
  3. ఎగువన, ఫైల్ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచు క్లిక్ చేయండి. 

ఎర్రర్ అలాగే కొనసాగితే, మీ ఫైల్ చాలా పెద్దది అని అర్థం. 

2వ దశ: మీ ఫైల్‌ని చిన్నగా చేయండి

  1. మీ ఫైల్‌ను చిన్నగా చేయండి.
    • చిట్కా: ఒరిజినల్ డాక్యుమెంట్‌లోని చిన్న విభాగాలను కొత్త డాక్యుమెంట్‌లలోకి కాపీ చేయండి.
  2. మీ కొత్త చిన్న డాక్యుమెంట్ ఎగువన, ఫైల్ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచును క్లిక్ చేయండి.

ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి మాకు సహాయం చేయండి

ఈ సర్వేలో పాల్గొని Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లలో మీ ఆఫ్‌లైన్ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. 

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12250989656639339694
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false