ప్రేక్షకుల నుండి ప్రశ్నలను స్వీకరించి, ప్రదర్శించండి

మీరు మీ Google Slides ప్రెజెంటేషన్‌లో లైవ్ ప్రశ్నోత్తరాల సెషన్‌ను ప్రారంభించవచ్చు, అలాగే ఎప్పుడైనా ప్రశ్నలను ప్రెజెంట్ చేయవచ్చు. వీక్షకులు ఏదైనా పరికరం నుండి ప్రశ్నలు అడగవచ్చు.

ప్రశ్నోత్తరాల సెషన్‌ను ప్రారంభించండి

ప్రేక్షకుల ప్రశ్నలను స్వీకరించండి

  1. Google Slides ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎగువున, స్లయిడ్ షో పక్కన, కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి.
  3. ప్రెజెంటర్ వీక్షణ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. కొత్త విండోలో, ప్రేక్షకుల టూల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • కొత్త సెషన్‌ను ప్రారంభించడానికి, కొత్త సెషన్‌ను ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఇటీవలి సెషన్‌ను కొనసాగించడానికి, ఇటీవలి సెషన్‌ను కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ప్రశ్నోత్తరాలను ముగించడానికి, ప్రశ్నోత్తరాల విండోలో 'ఆన్ చేయండి/ఆఫ్ చేయండి' స్విచ్‌ను క్లిక్ చేయండి.
      • చిట్కా: మీరు ప్రశ్నోత్తరాలను ఆఫ్ చేయనప్పటికీ, మీరు మీ Google స్లయిడ్ ప్రెజెంటేషన్‌ను ముగించిన కొద్దిసేపటికే ప్రశ్నోత్తరాల వీక్షణ మూసివేయబడుతుంది.

చిట్కా: మీరు Googleను ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థల కోసం ఉపయోగిస్తే, ప్రశ్నలు ఎవరు సమర్పించవచ్చు అనేది మీరు ఎంచుకోవచ్చు:

  • "ప్రెజెంటర్ వీక్షణ" విండోలో, ప్రేక్షకుల టూల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, "వీరి నుండి ప్రశ్నలను స్వీకరిస్తోంది…"ని మార్చండి

ప్రేక్షకుల ప్రశ్నలను చూపండి

ప్రెజెంటర్‌లు ప్రెజెంటేషన్‌లో ప్రేక్షకుల ప్రశ్నలను ప్రదర్శించవచ్చు:

  1. "ప్రేక్షకుల టూల్స్" కింద, ప్రదర్శించడానికి ప్రశ్నను కనుగొనండి.
  2. ప్రెజెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ప్రశ్నను మార్చడానికి, వేరే ప్రశ్నను కనుగొని, ప్రెజెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ప్రశ్నను దాచడానికి, దాచండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇటీవలి సెషన్‌లను రివ్యూ చేయండి

ప్రెజెంటర్‌లు ఇటీవలి ప్రశ్నోత్తరాల సెషన్‌లకు సంబంధించిన ప్రశ్నలను చూడగలరు:

  1. Slides ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎగువున, టూల్స్ ఆ తర్వాత ప్రశ్నోత్తరాల హిస్టరీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఇటీవలి సెషన్‌లు కుడి వైపున కనిపిస్తాయి.

ప్రశ్నను అడగండి

ప్రేక్షక పాత్ర వహించే మెంబర్‌లు ప్రెజెంటేషన్ సమయంలో ప్రశ్నలు అడగవచ్చు:

  1. ప్రెజెంటేషన్ ఎగువున ఉన్న లింక్‌కు వెళ్లండి.
  2. ప్రశ్నను అడగండి… అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ప్రశ్నను టైప్ చేయండి.
    • ప్రేక్షక పాత్ర వహించే మెంబర్‌లు ఆప్షనల్‌గా "అజ్ఞాతంగా అడగండి" బాక్స్‌ను ఎంచుకోవచ్చు.
  3. సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ప్రశ్నలపై ఓటు వేయండి

ప్రేక్షక పాత్ర వహించే మెంబర్‌లు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలపై ఓటు వేయవచ్చు:

  1. స్లయిడ్‌లో చూపిన ప్రశ్నోత్తరాల లింక్‌కు వెళ్లండి.
  2. మీరు ఓటు వేయాలనుకుంటున్న ప్రశ్న కింద, అనుకూల ఓటు వేయండి అనుకూల ఓటు లేదా వ్యతిరేక ఓటు వేయండి వ్యతిరేక ఓటుని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2391208412239437136
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false