చార్ట్ లేదా గ్రాఫ్‌ని జోడించండి & ఎడిట్ చేయండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

ఛార్ట్ లేదా గ్రాఫ్‌ని రూపొందించండి

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మీ చార్ట్‌లో చేర్చాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
  3. చేర్చు ఆ తర్వాత చార్ట్ క్లిక్ చేయండి.
చార్ట్ రకాన్ని మార్చండి
  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ని రెండు సార్లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, సెటప్ చేయి క్లిక్ చేయండి.
  4. "చార్ట్ రకం" క్రింద, దిగువకు చూపుతున్న బాణం గుర్తును కిందికి బాణం క్లిక్ చేయండి.
  5. జాబితా నుండి చార్ట్‌ని ఎంచుకోండి.

చార్ట్ మరియు గ్రాఫ్ రకాల గురించి మరింత తెలుసుకోండి.

డేటా పరిధిని మార్చండి

మీరు మీ చార్ట్‌లో చేర్చాలనుకుంటున్న సెల్‌ల సెట్‌ని "డేటా పరిధి" అంటారు.

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ని రెండు సార్లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, సెటప్ చేయి క్లిక్ చేయండి.
  4. "డేటా పరిధి" క్రింద, గ్రిడ్ క్లిక్ చేయండి గ్రిడ్.
  5. మీరు మీ చార్ట్‌లో చేర్చాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
  6. ఐచ్ఛికం: చార్ట్‌కి మరింత డేటాని జోడించేందుకు, మరో పరిధిని జోడించు క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీరు జోడించాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
  7. సరే క్లిక్ చేయండి.

చార్ట్ రూపాన్ని మార్చండి

రంగులు, లైన్‌లు, ఆకారాలు, అస్పష్టత, అలాగే ఫాంట్‌లను మార్చండి

గ్రిడ్‌లైన్‌లను జోడించండి

డేటాని సులభంగా చదివేలా చేయడానికి మీరు మీ చార్ట్‌కి గ్రిడ్‌లైన్‌లను జోడించగలరు.

మీరు ఎడిట్ చేయడానికి ముందు: లైన్, ప్రదేశం, నిలువు వరుస, బార్, స్కాటర్, వాటర్‌ఫాల్, సోపాన చిత్రం, రాడార్, లేదా క్యాండిల్‌స్టిక్ చార్ట్‌లకు గ్రిడ్‌లైన్‌లను జోడించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, అనుకూలీకరించు క్లిక్ చేయండి.
  4. గ్రిడ్‌లైన్‌లు క్లిక్ చేయండి.
  5. ఐచ్ఛికం: మీ చార్ట్‌లో అడ్డు మరియు నిలువు గ్రిడ్‌లైన్‌లు ఉన్నట్లయితే, "వీటికి వర్తింపజేయి" ప్రక్కన, మీరు మార్పులు చేయాలనుకుంటున్న గ్రిడ్‌లైన్‌లను ఎంచుకోండి.
  6. గ్రిడ్‌లైన్‌లకు మార్పులు చేయండి.

చిట్కాలు:

  • గ్రిడ్‌లైన్‌లను దాచి, అక్షం లేబుల్‌లను అలాగే ఉంచడానికి, గ్రిడ్‌లైన్‌లకు మరియు చార్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఒకే రంగును ఉపయోగించండి.
  • గ్రిడ్‌లైన్‌ల సంఖ్యను అనుకూలంగా మార్చడానికి, "మేజర్ గ్రిడ్‌లైన్ సంఖ్య" లేదా "మైనర్ గ్రిడ్‌లైన్ సంఖ్య" కింద, బాక్స్‌లో ఒక నంబర్‌ను ఎంటర్ చేయండి.
విడిగా ఉండే పాయింట్‌లు, బార్‌లను ఎడిట్ చేయండి

మీరు ఎడిట్ చేయడానికి ముందు: బార్, నిలువు వరుస, లైన్, స్కాటర్, మరియు నిర్దిష్ట రకాల కాంబో చార్ట్‌ల యొక్క పాయింట్‌లు మరియు బార్‌లను మార్చగలరు.

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. చార్ట్‌లో, బార్ లేదా పాయింట్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. డేటా పాయింట్‌ని ఫార్మాట్ చేయి క్లిక్ చేయండి.
  4. మీ మార్పులు చేయండి.

చిట్కా: మీరు అంచులను బార్‌లు, నిలువు వరుసలకు జోడించగలుగుతారు, కానీ పాయింట్‌లకు లేదా లైన్‌లకు జోడించలేరు.

బ్యాక్‌గ్రౌండ్, ఫాంట్, అలాగే ఇతర ఆప్షన్‌లను మార్చండి

మీరు మార్చగల ఆప్షన్‌లు మీ చార్ట్ రకంపై ఆధారపడి ఉంటాయి. ప్రతి చార్ట్ గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, అనుకూలీకరించు క్లిక్ చేయండి.
  4. చార్ట్ శైలి క్లిక్ చేయండి.
  5. మీకు కావలసిన మార్పులను చేయండి.

పదాలను ఎడిట్ చేయండి

శీర్షికలను ఎడిట్ చేయండి

మీరు శీర్షికలు, ఉపశీర్షికలు లేదా శీర్షిక ఫాంట్‌లను మార్చగలరు.

మీరు ఎడిట్ చేయడానికి ముందు: లైన్, ప్రదేశం, నిలువు వరుస, బార్, స్కాటర్, పై, వాటర్‌ఫాల్, సోపాన చిత్రం, రాడార్, క్యాండిల్‌స్టిక్ లేదా ట్రీమ్యాప్ చార్ట్‌లకు శీర్షికలు మరియు ఉపశీర్షికలు జోడించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, అనుకూలీకరించును క్లిక్ చేయండి.
  4. చార్ట్ & అక్షం శీర్షికను క్లిక్ చేయండి.
  5. "రకం" ప్రక్కన, మీరు ఏ శీర్షికను మార్చాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  6. "శీర్షిక వచనం" క్రింద, శీర్షికను నమోదు చేయండి.
  7. శీర్షిక మరియు ఫాంట్‌కి మార్పులు చేయండి.

చిట్కా: చార్ట్‌లో ఇప్పటికే ఉన్న శీర్షికలను ఎడిట్ చేసేందుకు, వాటిని రెండు సార్లు క్లిక్ చేయండి. 

లెజెండ్‌లను ఎడిట్ చేయండి

లెజెండ్ చార్ట్‌లో ఉన్న డేటా గురించి వివరిస్తుంది. 

మీరు ఎడిట్ చేయడానికి ముందు: లైన్, ప్రదేశం, నిలువు వరుస, బార్, స్కాటర్, పై, వాటర్‌ఫాల్, హిస్టోగ్రామ్ లేదా రాడార్ చార్ట్‌లకు లెజెండ్‌ను జోడించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
  3. కుడి వైపు, తగినట్టు మార్చు ను క్లిక్ చేసి ఆ తర్వాత లెజెండ్ను ఎంపిక చేయండి.
  4. మీ లెజెండ్‌ను తగినట్టు మార్చుకోవడానికి మీరు స్థానం, ఫాంట్, స్టైల్, రంగును మార్చవచ్చు.  
చిట్కా: విడి లెజెండ్ ఐటమ్‌ను తగినట్టు మార్చడానికి టెక్స్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
జోడించండి లేదా లెజెండ్ ముఖ్య శీర్షికను ఎడిట్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.
    • చిట్కా: మీరు లెజెండ్‌లో కనిపించాలని కోరుకునే టెక్స్ట్ మీ డేటా సెట్ యొక్క మొదటి అడ్డు వరుస లేదా నిలువు వరుసగా ఉందని నిర్ధారించుకోండి.
  3. కుడి వైపున, సెటప్ చేయిని క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ముఖ్యశీర్షికలు అడ్డు వరుసలలో ఉంటే: ముఖ్యశీర్షికలుగా అడ్డు వరుస Nని ఉపయోగించు క్లిక్ చేయండి.
    • ముఖ్యశీర్షికలు నిలువు వరుసలలో ఉంటేఅడ్డు వరుసలు / నిలువు వరుసల మధ్య స్విచ్ చేసి, ముఖ్యశీర్షికలుగా నిలువు వరుస Nని ఉపయోగించుని క్లిక్ చేయండి. 

చిట్కా: విడి లెజండ్ ఐటెమ్‌ను తగినట్టు మార్చడానికి, టెక్స్ట్‌ను రెండు సార్లు క్లిక్ చేయండి.

తరలించండి, పరిమాణం మార్చండి లేదా తొలగించండి

మీ చార్ట్‌లో ఐటెమ్‌లను తొలగించండి లేదా తరలించండి

అంశాలను తొలగించండి

మీరు శీర్షికలు, కథనాలు, డేటా లేబుల్‌లు, మరియు ఎర్రర్ బార్‌ల వంటి కొన్ని చార్ట్ అంశాలను తొలగించగలరు. ఐటెమ్‌లను తొలగించేందుకు:

  • చార్ట్‌లో నిర్దిష్ట ఐటెమ్‌ను తొలగించేందుకు, ఆ ఐటెమ్‌ను రెండు-సార్లు క్లిక్ చేయండి. ఆ తర్వాత, delete లేదా backspaceను నొక్కండి.
  • డేటా లేబుల్‌లు లేదా ఎర్రర్ బార్‌లను తొలగించేందుకు, అన్నింటిని ఎంచుకోవడానికి ఏదైనా ఒకదానిని రెండు-సార్లు క్లిక్ చేయండి. ఆ తర్వాత, ఒక డేటా లేబుల్/బార్‌ని ఎంచుకోవడానికి మూడవ సారి క్లిక్ చేయండి.

చిట్కా: మీ చార్ట్‌లో ఇతర అంశాలను తొలగించేందుకు, సైడ్ ప్యానెల్‌ని తెరిచేందుకు చార్ట్‌ని రెండు-సార్లు క్లిక్ చేయండి. 

ఐటెమ్‌లను తరలించు

మీరు లెజెండ్, శీర్షికలు, విడి డేటా లేబుల్‌లు వంటి కొన్ని చార్ట్ లేబుల్‌లను తరలించగలరు. pie చార్ట్ లేదా బార్ చార్టులోని అక్షం లేదా బార్ వంటి డేటాను చూపించే చార్టులోని ఏ భాగాలలోనైనా మీరు లేబుల్‌లను తరలించలేరు. ఐటమ్‌లను తరలించడానికి:

  • ఐటమ్‌ను కొత్త స్థానానికి తరలించేందుకు, చార్ట్‌లోని మీరు తరలించాలనుకుంటున్న ఐటమ్‌ను రెండు-సార్లు క్లిక్ చేయండి. ఆ తర్వాత, అంశాన్ని క్లిక్ చేసి కొత్త స్థానానికి లాగండి. అంశాలను తరలించేందుకు మీరు కీబోర్డ్ బాణాలను కూడా ఉపయోగించవచ్చు.
  • ఒక అంశం యొక్క స్థానాన్ని రీసెట్ చేయడానికి, అంశాన్ని కుడి క్లిక్ చేయండి. ఆ తర్వాత లేఅవుట్‌ని రీసెట్ చేయి క్లిక్ చేయండి.
  • అన్ని అంశాల యొక్క స్థానానికి రీసెట్ చేసేందుకు, చార్ట్‌పై రెండు సార్లు క్లిక్ చేయడం ద్వారా చార్ట్ ఎడిటర్‌ని తెరవండి, మరియు "అనుకూలీకరించు" ట్యాబ్‌కి వెళ్లి, చార్ట్ శైలి క్లిక్ చేసి, లేఅవుట్‌ని రీసెట్ చేయి క్లిక్ చేయండి. 

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

చార్ట్‌ని త్వరితంగా నావిగేట్ చేయడానికి మీరు మీ కీబోర్డ్‌ని ఉపయోగించవచ్చు.

  • ఎలిమెంట్‌ల లేయర్‌ల ద్వారా మీరు పునరావృతం చేయవచ్చు. చార్ట్ యొక్క వివిధ భాగాలను ఎంచుకునేందుకు, Enter నొక్కండి.
  • చార్ట్ అంశాల మధ్య మార్చేందుకు, Tab నొక్కండి.
  • ఒక స్థాయి నుండి బయటకు రావడానికి, Esc నొక్కండి.
  • మరో స్థాయిలోకి ప్రవేశించడానికి, Enter నొక్కండి.
  • ఆ స్థాయిలో వివిధ ఆబ్జెక్ట్‌ల ద్వారా పునరావృతం చేయడానికి Tab నొక్కండి.
  • “Tab” యొక్క వ్యతిరేక దిశలో కదిలించడానికి, Shift + Tab నొక్కండి.
చార్ట్‌ని తరలించండి
  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు తరలించాలనుకుంటున్న చార్ట్‌ను క్లిక్ చేయండి.
  3. చార్ట్ ఏ ప్రదేశంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారో అక్కడకు లాగండి.

చిట్కా: ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అంశాలను తరలించేందుకు, CTRL లేదా Command నొక్కి, మీరు తరలించాలనుకుంటున్న అంశాలను క్లిక్ చేయండి.

చార్ట్ పరిమాణం మార్చండి
  1. మీ కంప్యూటర్‌లో Google షీట్‌లలో స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న చార్ట్‌ని క్లిక్ చేయండి.
  3. చార్ట్ పరిమాణం మార్చేందుకు నీలి రంగు మార్కర్‌లను లాగండి.

చిట్కా: ఒకటి కంటే ఎక్కువ ఐటెమ్‌ల పరిమాణాన్ని అదే స్థాయిలో మార్చడానికి, CTRL లేదా Commandను నొక్కి, మీరు పరిమాణాన్ని మార్చాలనుకుంటున్న ఐటెమ్‌లను క్లిక్ చేయండి.

సంబంధిత కథనాలు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5709563980671789229
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false